breaking news
kakinada Elvinpet
-
సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం
-
సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎల్విన్‌పేటలో గతరాత్రి దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో హత్యాయత్నం చేశాడో వ్యక్తి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్విన్‌పేటకు చెందిన ధనలక్ష్మి, చంద్రశేఖర్‌లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ధనలక్ష్మిపై అతను అనుమానం పెంచుకున్నాడు. సోమవారం ఉదయం సైకిల్‌పై వస్తున్న ధనలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె శరీరంపై 17 చోట్ల కత్తితో పొడిచాడు. ఆసమయంలో ఆమె సోదరి కూడా వెంట ఉండడంతో ధనలక్ష్మిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కాగా ధనలక్ష్మి వేరే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ చనువుగా ఉంటుందనే అక్కసుతోనే చంద్రశేఖర్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితునిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.