breaking news
K. Nageswar
-
ఐఏఎస్... ఐపీఎస్... ఓ ప్రొఫెసర్!
ఎన్నికలకు మరో వారం రోజులు సమయం మాత్రమే ఉండడంతో తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. పోలింగ్‌కు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు అందరి దృష్టి 'హాట్ సీటు'పై నెలకొంది. మల్కాజ్గిరి లోకసభ స్థానంపై స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల వారు దృష్టి సారించారు. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారో ఇతమిత్థంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యావంతులు పోటీ పడుతుండడంతో అమితాసక్తి నెలకొంది. ఒక ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్ ప్రత్యర్థులుగా బరిలో ఉండడంతో మల్కాజ్గిరి ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర డీజీపీగా పదవీవిరమణ చేసిన దినేష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ లోక్‌సత్తా తరపున పోటీకి దిగారు. జర్నలిజం ప్రొఫెసర్ డాక్టర్ కె. నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎవరి విజయంపై వారు దీమాగా ఉన్నారు. కిందిస్థాయి నాయకులను కలుపుకుని దినేష్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్ జగన్, షర్మిల ప్రచారం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. షర్మిల ఇప్పటికే ప్రచారం పూర్తిచేయగా, జగన్ త్వరలో ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. జయప్రకాష్ నారాయణ, నాగేశ్వర్ విద్యావంతుల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఈ ముగ్గురిని ప్రజలను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. -
ప్రతిజిల్లా పరిశ్రమవ్వాలి: కె.నాగేశ్వర్
* అపార ఖనిజ సంపద తెలంగాణ సొంతం * పారిశ్రామిక ప్రగతి అన్ని జిల్లాలకూ విస్తరించాలి * విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చాలి * జిల్లాల్లోనూ విమానాశ్రయాలు నిర్మించాలి * అప్పుడే నవతెలంగాణ సాధ్యం ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు పారిశ్రామిక రంగం.. ముఖ్యంగా వస్తూత్పత్తి రంగం ఆలంబన అవుతుంది. సమాచార సాంకేతికరంగం లాంటి సేవల రంగంలో హైదరాబాద్ విశిష్ట ప్రగతి సాధించింది. దేశంలోనే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో నాలుగో స్థానంలో ఉంది. అయితే సేవల రంగం ఆధునిక ఉపాధి కల్పించినా అది పరిమితం. వస్తూత్పత్తి రంగమే ఉపాధి కల్పించి విస్తృత అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఔషధ పరిశ్రమలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్, మెషీన్‌టూల్స్, ఏరోనాటిక్స్ రంగాలకు చెందిన భారీ పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే ఆయా రంగాల్లో మరింత ప్రగతి, ఆధునికత సాధించడంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ జరగాలి. ముడిపదార్థాలున్నా.. నిస్తేజంగా.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో బొగ్గు గనులు, కొన్ని జిల్లాల్లో సిమెంట్ కర్మాగారాలు, మెదక్ జిల్లాలో మోటారు పరిశ్రమలు, నిజామాబాద్‌లో చక్కెర, బీడీ పరిశ్రమ, ఆదిలాబాద్‌లో జిన్నింగ్ మిల్లులు, నల్లగొండలో బియ్యం మిల్లులు మొదలుగునవి ఉన్నప్పటికీ, ఇతర అనేక పరిశ్రమల ఏర్పాటుకవసరమైన ముడి పదార్థాల లభ్యత తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర, కాగితం, పరిశ్రమల అభివృద్ధికి కూడా విస్తారమైన అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, నల్లగొండ జిల్లా పోచంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు అవకాశాలున్నా నిస్తేజంగా పడిఉన్నాయి. అద్భుత నైపుణ్యం ఉన్న నేతకారులు కళావిహీనులై నగరంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయడం నాగరికతకే తలవంపు. యువతను ఊరిస్తున్న ఐటీఐఆర్ ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీస్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సున్నపురాయి, నల్లమల అటవీసంపద వివిధ రకాల పరిశ్రమలకు అవకాశాలు ఇస్తున్నాయి. నిజామాబాద్‌లో పసుపు, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో మిర్చి, రంగారెడ్డిలో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఫ్లోరీ కల్చర్‌కు ఉన్న అవకాశాలు పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయగలవు. వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ లాంటి జిల్లాల్లోని టైర్-2, టైర్-3 నగరాలకు సమాచార సాంకేతిక పరిశ్రమను విస్తరించేందుకు అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్) నగర యువతను ఉవ్విళ్లూరిస్తోంది. మసిబారుతున్న యువత భవిత ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గుగనులు వేలాది కుటుంబాలకు జీవనోపాధినిచ్చి జీవి తాలు మార్చాయి. కానీ ఈ గనుల్లో క్రమంగా ఉపాధి తగ్గి పోవడంతో స్థాని క యువత భవిత మసిబారుతోంది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమ గందరగోళంలో ఉంది. కాబట్టి సమగ్ర పారిశ్రామిక పునరుజ్జీవనాన్నీ, సరికొత్త పారిశ్రామికీకరణ కోసం నవతెలంగాణ ఎదురుచూస్తోంది. ఎన్నెన్నో అవకాశాలు తెలంగాణ ఖనిజాల గని. ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీసు, ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులో ఇనుప ఖనిజం, ఉత్తర తెలంగాణలో బొగ్గు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో బొగ్గు ఆధారిత మీథేన్(సీబీఎం) గ్యాస్ నిక్షేపాలున్నాయి. ఇంకా గణనీయ స్థాయిలో సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇవికాక చైనా క్లే, గ్రానైట్, స్పటికం, మైకా మొదలుగు నిక్షేపాలు మెదక్, నల్లగొండ లాంటి ఇతర తెలగాణ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పారిశ్రామిక ముడి పదార్థాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సుమారు 45శాతం అటవీ సంపద తెలంగాణలోనే ఉంది. దేశంలోని మొత్తం బొగ్గు నిక్షేపాలలో 20శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అంచనా. వ్యవసాయాధారిత, ఆహారోత్పత్తి పరిశ్రమలతో పాటు బయో టెక్నాలజీ లాంటి విజ్ఞాన ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కూడా అవకాశాలు ఎన్నెన్నో. వెక్కిరిస్తున్న విద్యుత్ కొరత ముడి పదార్థాలున్నా, మురిపించే అవకాశాలున్నా ఆచరణలోకి రావాలంటే కావలసిందల్లా దార్శనికత గల రాజకీయ నాయకత్వమే. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికీకరణకు అతిపెద్ద సవాల్ చాలినంత విద్యుత్ లేకపోవడమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ సామర్థ్యం 16,500 మెగావాట్లు. ఇందులో 10,500 మెగావాట్లు సీమాంధ్ర ప్రాంతంలోనే. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగిలిన విద్యుత్‌లో గణనీయమైన భాగం జలవిద్యుత్తే. దీని ఉత్పత్తికి నీటి వనరుల లభ్యత ఎప్పుడూ సమస్యే. విద్యుత్ కొరత పారిశ్రామికీకరణకు ఆటంకంగా మారక తప్పదు. అతి తక్కువ కాలంలో విద్యుత్ లోటునుంచి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అధికారంలోకి రానున్న రాజకీయ నాయకత్వం ప్రణాళికలు రచించి అమలు చేయాలి. సమగ్ర జల విధానాన్ని అమలు చేయడం ద్వారా భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించి, ఉపరితల జలాల వినియోగాన్ని పెంచి తద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించాలి. విమానయానం జిల్లాలకూ విస్తరించాలి హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునిక పారిశ్రామికీకరణకు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. అయితే హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ర్టంలో ఇతర నగరాలను కూడా పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలంటే విమానయానరంగం విస్తరించాలి. ఆదిలాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో ఇప్పటికే విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్లు అభివృద్ధి కావాలి. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను ఉపయోగిస్తూ మానవ వనరులను అభివృద్ధి చేయాలి. మౌలిక వసతులు కల్పిస్తూ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా నూతన పారిశ్రామిక యుగానికి నవ తెలంగాణలో నాంది పలకాలి. - ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పొన్నాల లక్ష్మయ్య ఖిలాషాపురం, వరంగల్ గిది మీ ఊరే..! - సగం కూలిన ప్రాథమిక పాఠశాల భవనం.. ఆరుబయట చదువులు - విద్య, వైద్యం, మంచినీటికి ఇబ్బందులు - అద్దె ఇంట్లో ఆరోగ్య ఉపకేంద్రం - వ్యవసాయ పరికరాలు నిల్వచేసుకునే స్థలంగా గ్రంథాలయ భవనం - కంకరతేలి భయపెడుతున్న రోడ్లు - చెంతనే అశ్వరావుపల్లి రిజర్వాయర్ ఉన్నా తాగునీటికి ఇక్కట్లు - పర్యాటకంగా అభివృద్ధి చేయకపోవడంతో కూలుతున్న సర్దార్ సర్వాయి పాపన్న కోట - మాదారం-ఖిలాషాపురం మధ్య వాగులో వంతెన నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వాగుపొంగి సమీప గ్రామాలతో ఖిలాషాపురానికి తెగిపోతున్న సంబంధాలు ఒక్కడే... అనావుకుడిగా వచ్చి... అసెంబ్లీలో పాగ అవి జనతాపార్టీ గాలి ఉధృతంగా వీచే రోజు లు. ఎమ్మెల్యే టిక్కెట్ ట్రై చేద్దావూ! అనుకున్నా రు... మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లోని ఓ ఆర్ఎంపీ జి.నర్సిములునాయుడు. అనుకు న్నదే తడవుగా జనతాపార్టీ టిక్కెట్ కోసం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం వరకు వేచిచూసి నిరాశగా వెనుదిరిగారు. ‘ఎలాగూ ఇంత దూరం వచ్చా కదా.. గాంధీభవన్‌ను చూసి వెళ్దాం’ అనుకుని అక్కడికి వెళ్లి ఎందుకైనా మంచిదనుకుని వెంట తెచ్చుకున్న దరఖాస్తును అక్కడ సమర్పించారు. అంతే ఆయున రొట్టె విరిగి నేతిలో పడింది. ‘ఇందిరా కాంగ్రెస్ టికెట్‌కు మీరొక్కరే దరఖాస్తు చేసుకున్నారు...టికెట్ మీకే వచ్చింది’అంటూ గాంధీభవన్ నుంచి అతనికి వర్తమానం వచ్చింది. దీంతో అనూహ్యంగా ఆయున కాంగ్రెస్ టికెట్‌పై బరిలో దిగి 1978లో మక్తల్ ఎమ్మెల్యే అయ్యారు. ఒక ఆర్ఎంపీ ఒక పార్టీకి దరఖాస్తు చేసేందుకు వెళ్లి మరోపార్టీకి దరఖాస్తు సమర్పించి ఏకంగా ఎమ్మెల్యే కావడం అప్పట్లో ఓ సంచలనం. -న్యూస్‌లైన్, నారాయణపేట సాకలోల్ల కట్టం తీరకచ్చె రాజులు బోవట్టే.. రాజ్యాలు బోవట్టే గని మా సాకలోల్ల బతుకుల సీమంత సుక మారకచ్చినై. మా తాతముత్తాతల కాడికెళ్లి గిదే బతుకు. పొద్దుగల్ల లేసి.. కారంబువ్వ దిని.. ఇళ్లిళ్లూ దిరిగి ఊళ్లె బట్టలన్నీ ముళ్లెగట్టుకుని చెరొడ్డుకు దీస్కచ్చి ఉతుకుడే దెలుసు. బట్టలకంటిన మైలైతే బోవట్టే గని మా బతుకు కట్టం తీరకచ్చె. ఇగ మా బతుకంతా చాకిరేవు కాడ్నే బోవట్టే. మాకు దెల్సింది గిదొక్కటే పని. గిది గుడ సక్కగ సేసుకోలేక పోతున్నం. బట్టల్ని ఉతుకుదమంటే నీళ్లుంట లేవు. చెరువుల, కుంటల కాడ ఉతకస్త లేదు. గా దోబిగాట్లు కట్టిపియుండ్రి సారూ.. అని పెద్దమనుషులందర్ని అడిగినం. ఇగ ఎలచ్చన్ల సంగతేందో.. గ లీడరుసాబుల ముచ్చటేందో. ఐదేండ్లకోపారి గిట్ల ఇంటిమొకాన అత్తరు. ఏమే అవ్వ మంచిగున్నాయే.. అని తియ్యగ మాట్లడతరు. ఈసారి గూడ నాకే ఓటు గుద్దే అవ్వ.. నీకు పించినిప్పిత్తా.. ఇళ్ల జాగ ఇప్పిత్తా అని జెప్తరు. ఓట్లేశేనాడు ఆటోల గూసుండ వెట్టి దీస్కపోతరు. తీస్కత్తరు. గంతే.. మల్ల ఒక్కనాడు సుక కన్పియ్యరు. మాకు పెద్దకోర్కెలు ఏముంటయ్ బిడ్డా.. కడుపుకింత తిండి, కట్టుకునతందుకు బట్ట, ఉండతందుకు ఇంత ఇల్లు సాలు. ఇగ గివి గూడ ఇయ్యకపోతే గౌర్నమెంటు ఎందుకు.. గీ లీడరుసాబులు ఎందుకు. - సాకలి లచ్చవ్వ, బూర్గుల్, నిజామాబాద్ -
సామాజిక ఎజెండా రావాలి: కె. నాగేశ్వర్
తెలంగాణ వస్తే తమ బతుకులు పూర్తిగా మారిపోతాయని ప్రజలు నమ్మారు. ఉద్యమానికి జై కొట్టారు. ఇపుడు రాష్ట్రం స్వప్నం సాకారమైంది. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక విధానాల్లో మార్పులు రాకపోతే ప్రజల్లో అసంతృప్తి మొదలవుతుందని, ప్రజల ఆకాంక్షలే తీరనప్పుడు అది తెలంగాణ సమాజానికి పెను సవాలుగా మారనుందని, ప్రముఖ రాజకీయ, సామాజిక ఆర్థిక విశ్లేషకుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అభిప్రాయ పడుతున్నారు. సమస్త రంగాల్లో తెలంగాణ పునరుజ్జీవనంతో పాటు అసమానతలు తొలగినపుడే రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రజల సమస్యలన్నింటికీ సర్వరోగ నివారిణి కాదు. రాజకీయ, ఆర్థిక విధానాలలో మార్పు రాకుండా ప్రజలు జీవితాలలో మార్పు రాదు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలు ఎన్నికల్లో రాజకీయ ఎజెండా కావాలి. - నాగేశ్వర్, ఎమ్మెల్సీ విజ్ఞానం...అభివృద్ధికి మూలం తెలంగాణ ప్రాంతంలో ప్రాథమిక స్థాయిలో బడిమానేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. డాక్టర్లు, ఆస్పత్రి, పడకలకు, జనాభాకు మధ్య నిష్పత్తి చూస్తే సీమాంధ్ర, తెలంగాణ మధ్య తేడా (హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మినహా) పెరుగుతోందని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సీహెచ్ హనుమంతరావు విశ్లేషించారు కూడా! సమాచార సాంకేతిక రంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణవారు తక్కువగా ఉన్నారనే అంశం తెలంగాణ ఉద్యమ కాలంలో ముందు కొచ్చింది. విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో సర్వీసుల రంగంలో నాణ్యమైన ఉపాధికి అవకాశాలున్నాయి. అందుకే ఆధునిక ఆర్థిక వ్యవస్థలో విజ్ఞాన తెలంగాణ లక్ష్యం కావాలి. ‘పరిశ్రమ’తో ప్రగతి హైదరాబాద్ నుంచి ఔషధ కర్మాగారాలు తరలిపోతు న్నాయి. విద్యుత్ సంక్షోభం వల్ల చిన్న తరహా పరిశ్రమలు మూత పడుతున్నాయి. వరంగల్‌లో అజాంజాహీ మిల్లు నుంచి సిర్పూర్లో సర్ సిల్క్ వర కూ రాజధానిలో డీబీఆర్ మిల్లు మొదలుకుని నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీల వరకూ పరిశ్రమలు మూత పడ్డాయి. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమ గందరగోళంగా ఉంది. వీటి పునరుద్ధరణ వల్ల చిన్న పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేయవచ్చు. ఆలోచనా పరులు మెదళ్లకు పదును పెట్టాల్సిన సందర్భం ఇది. సమ సమాజం...లక్ష్యం కావాలి కొత్త తెలంగాణ రాష్ట్రంలో సామాజిక పొందికను అర్ధం చేసుకోవాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌గా మిగిలి ఉండే సీమాంధ్ర మొత్తం జనాభాలో 5.3 శాతం మాత్రమే గిరిజనులు ఉంటారు. కానీ తెలంగాణ రాష్ర్టంలో గిరిజన జనాభా 9.3 శాతం ఉంటుంది. ఆమేరకు రాష్ర్ట శాసన సభలో కూడా గిరిజన ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగనుంది. అలాగే 2001 జనాభా లెక్కల ప్రకారం అవశేష ఆంధ్రప్రదేశ్ జనాభాలో 6.9 శాతం మంది ముస్లింలు ఉంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో వారి వాటా 12.5 శాతం. ఇక ఎస్సీల విషయానికి వస్తే మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో వారు 17 శాతం ఉండగా తెలంగాణలో 15.4 శాతం ఉంటారు. అందుకే తెలంగాణలో మైనార్టీ, అణగారిన వర్గాల అభివృద్ధి అంశం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. సుజలాం...సుఫలాం రాష్ట్ర విభజనకు కారణమైన అంశాలలో నీటిపారుదల రంగంలో అసమానతలు ప్రధాన మైనవి. ఐదు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో చెరువుల కింద సాగునీటి సదుపాయం గణ నీయంగా పడిపోయింది. మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఎండిన చెరువులు దర్శనమిస్తాయి. మరోవైపు భారీ, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా సాగు సదుపాయం ఆశించిన స్థాయిలో పెరగలేదు. శ్రీరాం సాగర్‌లో పూడిక వల్ల సాగునీటి విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇచ్చంపల్లి ముచ్చట మర్చి పోయారు. పాలమూరులో పేదరికం తాండవిస్తున్నా జూరాల ఆర్డీయస్ ప్రాజెక్టుల కింద కేటాయించిన నీరు ఆ జిల్లా ప్రజలు ఏనాడూ పొందలేదు. మంజీరా నది రాజధాని వాసుల దాహార్తి తీరుస్తున్నప్పటికీ మెదక్ జిల్లా ప్రజలకు ఆర్తినే మిగిల్చింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర జలవిధానం ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరానికీ సాగునీరిచ్చే ఏర్పాటు జరగాలి. గొలుసు చెరువుల పునరుద్ధరణ జరగాలి. పర్యాటకరంగానికి పెద్దపీట వేయాలి ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో, నల్లమల అడవుల్లో పర్యావరణ అనుకూల పర్యాటక రంగాన్ని (ఇకో టూరిజం) అభివృద్ధి చేయవచ్చు. మహబూబ్ నగర్లో ఉన్న కోటలు, చెరువులూ, రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండలూ హైదరాబాద్ నగర వాసులకు సేదదీర్చుకునే ప్రదేశాలు అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం గల బౌద్ద, జైన క్షేత్రాలున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం, దేశంలోని అరుదైన బాసర సరస్వతీదేవి ఆలయం, నైజాం నవాబులు, కాకతీయులూ, శాతవాహనుల నాటి చారిత్రక ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వ్యవసాయం మొదలుకుని అన్ని రంగాల్లోనూ స్థానికపరమైన ప్రత్యేకతలను గుర్తించి, వాటి పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను రచించే దార్శనికత నవ తెలంగాణలో అవసరం. వ్యవ‘సాయం’...శ్రేయోదాయకం వ్యవసాయమే కాదు అనుబంధ రంగాల అభివృద్ధి కూడా ఉపాధి కల్పనకు సుస్థిర ఆదాయానికి కీలకం అవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యం గా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక వ్యవసాయ, ఉద్యాన వన పంటల ప్రాంతాన్ని స్థానిక రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హైదరాబాద్ నగర ప్రజలకు పండ్లు, పూలు, పాలు సమృద్ధిగా లభించేందుకు వీలు కలుగుతుంది. అంతరా ్జతీయ విమానాశ్రయం కూడా ఆ సమీపంలో ఉండడం వల్ల ఫ్లోరీకల్చర్ అభివృద్ధికి కూడా అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా గొర్రెల పెంపకంలో అగ్రభాగాన ఉంది. కృష్ణా నదిలో నీళ్ళ కన్నా ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి. కానీ గోదావరి నదిలో నాలుగు వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ప్రాణహిత, ఇంద్రావతి కలిసాక గోదావరిలో పుష్కలంగా నీరుంటుంది. అనాడే ఇచ్చంపల్లి ప్రాజెక్టు కనుక కట్టి ఉంటే తెలంగాణలో గణనీయమైన ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. అయితే చాలా ప్రాంతాల్లో నీటి ప్రవాహం కన్నా దిగువ ప్రాంతంలో భూములుండడం వల్ల గోదావరి జ లాలను ఎత్తిపోతల ద్వారా మాత్రమే వినియోగించుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇందుకు గణనీయమైన స్థాయిలో విద్యుత్ అవసరం ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సమీకృత జల, విద్యుత్ విధానాలను అమలు చేయాల్సిఉంటుంది. తెలంగాణలో విస్తారంగా బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ అవసరమైన పరిమాణంలో విద్యుదుత్పత్తి జరగడంలేదు. స్థానికంగా విద్యుత్ ప్లాంట్లను పెడితే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది.