breaking news
Joint disease
-
పాపం చిన్నారి!
బూర్జ: ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు.. చదువు, క్రీడల్లో చలాకీగా ఉండే చిన్నారికి పెద్దకష్టమే వచ్చిపడింది. 12 ఏళ్లకే కీళ్లవ్యాధి సోకింది. అంతే... అన్నింటా ముందుండే విద్యాకుసుమం మంచంపాలైంది. మెరుగైన వైద్యసేవలు అందజేసేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. ఇల్లును తాకట్టుపెట్టి మాత్రల కోసం ఖర్చుచేసినా వ్యాధి అదుపులోకి రాలేదు. దీంతో మంచంపైనే ఉంటూ విద్యార్థి నర కయూతన అనుభవిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని అల్లెన గ్రామానికి చెందిన సిరిపురపు నారాయణమూర్తి దళిత కుటుంబానికి చెందిన నిరుపేద విద్యార్థి. అల్లెన ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అతి పిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి లచ్చన్న సంరక్షణలో క్రమశిక్షణతో చదువుతూ అన్ని తరగతుల్లోనూ పాఠశాలకే ప్రథమస్థానంలో ఉండేవాడు. క్రీడల్లో కూడా రాణించి పలువురి మన్ననలు పొందాడు. పేదరికంతో బాధపడుతున్న ఆ విద్యార్థికి ఉపాధ్యాయులు కూడా తోచిన సాయం చేసి ప్రోత్సహించేవారు. అయితే, 2013 మార్చిలో ఒక్కసారిగా విద్యార్థికి కీళ్ల నొప్పులు ఆరంభమయ్యూరుు. కాళ్లు ఈడ్చుకుంటూనే పాఠశాలకు ప్రతిరోజు హాజరయ్యేవాడు. నారాయణమూర్తి పరిస్థితిని 2013 మార్చి 7న ‘నిరుపేదకు పెద్ద కష్టం’ అనే శీర్షికన ‘సాక్షి’ వార్త ప్రచురించింది. దీంతో అప్పటి ఎంఈవో శ్యామ్‌సుందర్, ఉపాధ్యాయులు స్పందించి ఆర్థిక సాయం చేశారు. బెంగుళూర్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ 10 రోజులు వైద్యసేవలు అందజేశారు. ఇంతలో దాతల ఇచ్చిన సాయం అరుుపోవడంతో విధిలేని పరిస్థితిలో వెనుకకు వచ్చేశారు. అనంతరం ఇల్లును తాకట్టుపెట్టి కొడుకుతోపాటు కుమార్తెను పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబా ఇన్‌నిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సెన్సైస్‌కు లచ్చన్న తీసుకెళ్లారు. అక్కడ రోగితోపాటు ఒక్కరే ఉండాలన్న నిబంధనతో కుమార్తెను ఎక్కడ ఉంచాలో తెలియక వారిచ్చిన మందులు తీసుకుని ఇంటిబాట పట్టాడు. ఎన్ని మందులు వేసినా మాయదారి జబ్బు నయం కాలేదు. ఆరోగ్యశ్రీ ఆదుకోలేదు. కొడుకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీనిస్తుండడంతో తండ్రి కలత చెందుతున్నాడు. కూలికెళ్తేగాని కుండాడని స్థితిలో పిల్లలకు కడుపునిండా భోజనం కూడా పెట్టలేక నర కయూతన అనుభవిస్తున్నాడు. కూలికెళ్లి కుమారుడిని, పాపను పోషిద్దామంటే వారిని చూసుకునే దక్షతలేదంటూ కన్నీరుకార్చుతున్నాడు. విధిలేని స్థితిలో ఇరుగుపొరుగు వారు ఇచ్చిన బియ్యంతో కాస్త గంజికాచి పిల్లలకు పెడుతున్నాడు. దయూర్థహృదయులు దయతలచి కుమారుడిని ఆదుకోవాలని, మెరుగైన వైద్యసేవలందించి ప్రాణబిక్ష పెట్టాలని వేడుకుంటున్నాడు. -
కీళ్ల వ్యాధి మందుతో బట్టతలపై జుట్టు
వాషింగ్టన్: ఒక వ్యాధి మందుతో మరొక ప్రయోజనం కూడా ఉంటే.. ఆ మందు అమృతమే కదా! అమెరికాలో అలాంటి ప్రయోగమే చేసిన శాస్త్రజ్ఞులు విజయవంతంగా బట్టతలపై జుట్టు మొలిపించారు. వైద్యానికి అందని జబ్బుతో బాధపడుతూ వంటిపై వెంట్రుకలన్నీ కోల్పోయిన 25 ఏళ్ల యువకుడికి.. కీళ్లవ్యాధి (ఆర్థరైటిస్)కి వాడే మందుతో జుట్టు పెరిగేలా చేశారు. ప్రస్తుతం అలోపేసియా యునివర్సిలిస్ (జుట్టు రాలిపోవడం) వ్యాధికి శాశ్వతంగా కానీ, దీర్ఘకాలంలో కానీ నివారణకు మందులు లేవని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇలాంటి వ్యాధిగ్రస్థుడికి మొట్టమొదటగా వెంట్రుకలు తిరిగి వచ్చిన ఘటన ఇదేనని వారు తెలిపారు. తాము ట్రీట్మెంట్ చేసిన యువకుడికి అలోపేసియాతో పాటు సొరియాసిస్ వ్యాధి కూడా ఉందని, సొరియాసిస్‌కు వైద్యం కోసం తమ వర్సిటీకి వచ్చాడని యలే వర్సిటీ మెడిసిన్ స్కూల్లో డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రెట్ కింగ్ చెప్పారు. కీళ్లవ్యాధికి వాడే టోఫాసిటినిబ్ సిట్రేట్ అనే మందుతో సొరియాసిస్‌కు వైద్యం ప్రారంభించామని, అలోపేసియాకు కూడా అదే మందు మోతాదులో మార్పులు చేసి వినియోగించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. రెండు నెలల పాటు ఆ మందును 10 మిల్లీ గ్రాముల చొప్పున ఇవ్వగా జుట్టు పెరుగుదల కనబడిందని, తర్వాత మూడు నెలల పాటు 15 మిల్లీగ్రాముల ఇవ్వగా పూర్తి స్థాయిలో జుట్టు మొలకెత్తిందని చెప్పారు.