breaking news
jerusalem muttiah
-
సికింద్రాబాద్‌లో ముత్తయ్య ప్రత్యక్షం
మారేడుపల్లి: ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తిగా మారిన జెరూసలేం ముత్తయ్య సికింద్రాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. సమాజ్‌వాది పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌గా తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు నాగలక్ష్మి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లలో సమాజ్‌వాది పార్టీ పోటీకి సిద్ధమని ముత్తయ్య తెలిపారు. వంద సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు జ్యోతి కాలనీలో తెలంగాణ సమాజ్‌వాది పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పార్టీకి సంబంధించిన వివిధ పదవుల్లో నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా ఏఎస్ శ్రీనివాస్, మీడియా కో-ఆర్డినేటర్‌గా జెరూసలేం ముత్తయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లయన్ సీ ప్రాన్సిస్, సెక్రటరీ జనరల్ సుజాన్, ఆర్గనైజర్ చంద్రశే ఖర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అది కేసీఆర్ అల్లిన పిట్టకథ
స్టీఫెన్సన్ వాంగ్మూలంపై ‘ఓటుకు కోట్లు’ కేసు నిందితుడు మత్తయ్య సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ నాంపల్లి కోర్టులో ఇచ్చిన వాంగ్మూ లం సీఎం కేసీఆర్, ఏసీబీ కలసి నేర్పించిన పిట్టకథ అని ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితుడైన జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఏపీలో తలదాచుకున్న మత్తయ్య స్వదస్తూరితో రాసిన ప్రకటనను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసు అంతా తప్పుల తడక అని, రేవంత్‌ను ఇరికించేందుకు స్టీఫెన్‌సన్‌తో కేసీఆర్ నాటకం ఆడించారని ఆరోపించారు. ఒక క్రైస్తవ మత కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరేందుకు తాను స్టీఫెన్సన్ను కలిశానన్నారు. ఆ సమయంలో కేసీఆరే రూ.80 లక్షలు తీసుకొని మోసం చేసినట్లుగా స్టీఫెన్ చెప్పారని మత్తయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుల పాలైన స్టీఫెన్సన్ తక్కు వ వడ్డీకి డబ్బులు ఇప్పించాలని తనను కోరాడన్నారు. స్టీఫెన్సన్ కేసీఆర్ కుట్రలో పావుగా మారారని, మెజిస్ట్రేట్ ముందు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తానెక్కడికీ పోలేదని, తన అత్తగారి ఊరు గుంటూరుకు వెళ్లానన్నారు. తనపై టీఆర్ఎస్, ఏసీబీ, పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.