breaking news
Jeans ban
-
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
భోపాల్ : మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో టీ షర్టు ధరించడం పద్దతి కాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్వాలియర్ డివిజన్లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్, టీ షర్టులు ధరించకుండా నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్ కమిషనర్ ఎంబీ ఓజా సర్క్యూలర్ జారీ చేశారు. ఉద్యోగులందరూ హుందాగా, సంప్రదాయంగా ఉండే దుస్తులను ధరించి విధి నిర్వాహణకు రావాలని ఆదేశించారు. (మెహబూబా నిర్బంధం మరో 3 నెలలు) కాగా జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్సౌర్ ఇల్లాలోని ఓ అధికారి పద్దతిగా లేని దుస్తులు (టీ షర్టు) ధరించి హాజరయ్యాడు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. తమ ఉత్తర్వులను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ కంటే ముందు అనేక రాష్ట్రాలు టీ షర్టు, జీన్స్ పై నిషేధం విధించాయి. గత ఏడాది బిహార్, తమిళనాడు ప్రభుత్వాలు సైతం సచివాలయంలోని ఉద్యోగులు ఈ దుస్తులు ధరించరాదని ఉత్తర్వులు జారీ చేశాయి. (సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10 వేలు ఫైన్) -
దయచేసి జీన్స్, స్కర్ట్స్తో రాకండి
ఉజ్జయిని: తమ దేవాలయంలోకి మహిళలు జీన్స్, స్కర్ట్స్ వేసుకొని ప్రవేశించకుండా ఉజ్జయినిలోని జైన దేవాలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లు పైబడిన వారంతా ఈ నిబంధనకు లోబడి ఆలయంలోకి రావాల్సి ఉంటుందని ప్రకటించారు. ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉజ్జయినిలో జైన మత శ్వేతాంబర సమాజానికి చెందిన వృషభదేవ ఆలయం ఉంది. దీనిని చగ్నిరామ్ పెడి ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఆలయ గౌరవాన్ని కాపాడేందుకోసం తీసుకునే చర్యల్లో భాగంగా ఆదివారం సమావేశం అయిన ట్రస్ట్ సభ్యులు కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదేళ్లు పైబడిన బాలికలు, మహిళలు జీన్స్, టీ షర్ట్స్, స్కర్ట్స్, టాప్స్ వంటి పాశ్చాత్య దుస్తులు కాకుండా కేవలం భారతీయ సంప్రదాయంతో నిండిన వస్త్రాలనే ధరించాలని నిబంధన తీసుకొచ్చినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు మహేంద్ర సిరోలియా చెప్పారు. జైన ఆలయంలోకి పాశ్చాత్య దుస్తులకు అవకాశం ఇవ్వబోమని తెలిపారు. ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత 'చున్రీ'(తలను కప్పి ఉంచుకునే వస్త్రం) ఇస్తామని చెప్పారు. సరైన వస్త్రాధరణతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని తెలిపారు.