breaking news
JDP
-
జపాన్ను అధిగమించిన భారత్: మరో మూడేళ్ళలో..
2047 నాటికి వికసిత భారత్ సాధ్యమవుతుందని 'నరేంద్ర మోదీ' చాన్నాళ్లకు ముందే పేర్కొన్నారు. ఈ దిశగానే కేంద్రం కూడా అడుగులు వేస్తోంది. కాగా ఇప్పుడు.. జపాన్ను అధిగమించి.. భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' పేర్కొన్నారు.నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. మొత్తం భౌగోళిక, రాజకీయ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశం కంటే.. అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే పెద్ద ఆర్ధిక వ్యవస్థను కలిగి ఉన్నాయి.మనం ఇప్పటికే వేసుకున్న ప్రణాళికలకు కట్టుబడి ముందుకు సాగితే.. మరో మూడేళ్ళలో మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తామని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. తయారీ రంగం అభివృద్ధి, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం వంటివి మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్‌పై దృష్టి సారించడం వంటివి దేశాభివృద్ధికి కీలకమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీభారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. వికసిత భారత్‌లో ఇది పెద్ద అడుగు. ఇలా జరిగేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ కేంద్ర మంత్రి 'జితేంద్ర సింగ్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.India Overtakes Japan, Becomes World's 4th Largest EconomyA rapid stride, a giant leap …towards #ViksitBharat! Thanks PM @narendramodi for making this happen.— Dr Jitendra Singh (@DrJitendraSingh) May 25, 2025 -
రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధి!
♦ పుష్కలంగా అవకాశాలున్నాయ్: నీతి ఆయోగ్ ♦ మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక విడుదల ♦ సామాజిక రంగాల్లో సంస్కరణలపై సూచనలు ♦ ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థల్లో కూడా... న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతానికి పైగా నమోదవడానికి పుష్కలంగా అవకాశాలున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోనిమొత్తం 125 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాలు సమకూర్చేలా ఉండాలని కూడా సూచించింది. ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ‘మూడేళ్ల సమగ్ర ప్రణాళిక– 2017–18 నుంచి 2019–20’ని గురువారం ఆవిష్కరించింది. నల్లధనం, అవినీతి నిరోధం, పన్ను పరిధి పెంపు, సివిల్ సర్వీసులు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణ వంటి కీలక అంశాలపై సూచనలు కూడా ఇందులో ఉన్నాయి. భారత్ 2016–17 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) జీడీపీ ఫలితాలు ఆగస్టు 31వ తేదీన వెలువడనున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ తాజా ప్రణాళిక విడుదలైంది. . 211 పేజీల ప్రణాళికలోని కొన్ని ముఖ్యాంశాలు వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో పేదరిక నిర్మూలన భారీగా జరిగే వీలుంది. కేంద్ర ప్రభుత్వ వ్యయాల విషయంలో భవిష్యత్ ప్రాధాన్యతపై దృష్టి ఉండాలి. అధిక ప్రాధాన్యతా రంగాలకు అదనపు కేటాయింపులు జరగాలి. ఇది వృద్ధి ప్రోత్సాహానికి దారితీస్తుంది. 2019–20 నాటికి అధిక నిధులను విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రక్షణ, రైల్వేలు, రోడ్లు అభివృద్ధికి కేటాయించాలి. ఆయా అంశాల్లో పెట్టుబడులు దేశంలో పట్టణీకరణకు దారితీస్తుంది. దీనితో చౌక గృహాలు, మౌలిక రంగం, ప్రభుత్వ రవాణా వ్యవస్థ అభివృద్ధిసహా స్వచ్ఛ భారత్‌కు ప్రోత్సాహానికి దారితీస్తుంది. ఇక న్యాయ వ్యవస్థలో సంస్కరణల విషయానికి వస్తే– వివాదాల తక్షణ పరిష్కారం దిశగా చర్యలు ఉండాలి. ఇందుకు వీలుగా మానవ వనరుల లభ్యత, పనితీరు, నైపుణ్యత పెరగాలి. సామాజిక రంగం విషయంలో విద్య, వైద్య రంగాలు మెరుగుపడాలి. మానవ వనరుల నైపుణ్యతలో పురోగతి ఉండాలి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. రెగ్యులేటరీ వ్యవస్థ పటిష్టతకు తగిన చర్యలు. దేశంలోని కుటుంబాలన్నింటికీ నిరంతర విద్యుత్ సరఫరా, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం, డీజిల్, పెట్రోల్ ధరల విధానంలో సంస్కరణలు, 100 స్మార్ట్ సిటీల్లో సిటీ గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత వంటి కీలక అంశాలు నీతి ఆయోగ్ సిఫారసుల్లో చోటుచేసుకున్నాయి. -
బీజేపీలో విలీనమైన జేడీపీ
జంషెడ్పూర్: బీజేపీ మాజీ నేత, జేడీపీ అధ్యక్షుడు సల్ఖాన్ ముర్ము నేతత్వంలోని జార్ఖండ్ దిసోమ్ పార్టీ (జేడీపీ)సోమవారం లాంఛనంగా బీజేపీలో విలీనమైంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా సమక్షంలో జంషెడ్‌పూర్‌లో జేడీపీ విలీనం జరిగింది. దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు బలంగా వీస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీని తమ నేతగా ప్రజలు ఆమోదిస్తున్నారని, పలు పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా అర్జున్ ముండా చెప్పారు. జేడీపీతో కొంతకాలంగా జరుగుతున్న విలీనం చర్చలు తుదిరూపు దాల్చాయన్నారు. విలీనం వెనుక ఎలాంటి ఒత్తిడీ లేదని, బీజేపీ ఆధ్వర్యంలో ఆశయాలు సాధించుకునేందుకు తమ పార్టీ వ్యూహం మార్చిందని సల్ఖాన్ ముర్ము స్పష్టం చేశారు.