'జనాభా పెంచాలనడం పిచ్చితనం'
హైదరాబాద్: ఎక్కువ మంది పిల్లలను కనాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునివ్వడం సరికాదని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఈ పిలుపు వెనుక ఉద్దేశమెంటోగాని, అది దేశానికి మంచిది కాదన్నారు. జనాభా పెంచుకోవాలంటూ పిలుపునివ్వడం పిచ్చితనం, ఆత్మహత్యాసదృశ్యమని మండిపడ్డారు.
ఉన్న యువతకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారని, ఇంకా ఇప్పుడు పిల్లల్ని కనమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎక్కువ జనన రేటు ఎన్నో రాష్ట్రాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయన్నారు. ప్రపంచ జనాభాలో మన దేశం వాటా 18 శాతమని, ఇందులో చాలా మందికి నైపుణ్యం లేదని జేపీ తెలిపారు.