breaking news
jayalalithaa in hospital
-
రాహుల్‌కు ఎల్టీటీఈ స్వాగతం?
తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరి.. గత 18 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ప్రైవేటు విమానంలో చెన్నై వెళ్లారు. అక్కడ ఆయన అపోలో ఆస్పత్రి వైద్య బృందంతో చర్చించి.. పావుగంట పాటు ఆస్పత్రిలోనే గడిపారు. బయటకు వచ్చిన తర్వాత.. జయలలిత కోలుకుంటున్నట్లు వైద్యులు తనకు చెప్పారని అన్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అసలు విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికింది ఎవరు? ఆయనను విమానాశ్రయం నుంచి నేరుగా అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చింది ఎవరు? ఈ విషయంలో బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యం స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు విమానంలో వచ్చిన రాహుల్ గాంధీని స్వాగతించినది.. ఎల్టీటీఈలో మిగిలిపోయిన ప్రముఖ నాయకులేనని ఆయన అన్నారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండా.. 'బుద్ధూ' అని ఆయనను సంబోధించారు. శశికళా నటరాజన్‌తో ఉన్న సంబంధాల దృష్ట్యానే వాళ్లు వచ్చి రాహుల్‌కు స్వాగతం పలికారని చెప్పారు. ఈ విషయమై ఆయన శనివారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. అయితే దీనికి కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎవరూ ఇంకా స్పందించలేదు. చెన్నై అపోలో వైద్యులతో రాహుల్ గాంధీ Buddhu arrived in Chennai by Pvt aircraft was received at the airport by well known LTTE left overs owing allegiance to Sasikala's Natarajan — Subramanian Swamy (@Swamy39) 8 October 2016 -
సీఎం త్వరగా కోలుకోవాలి: సూపర్‌స్టార్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరడంతో.. ఆమె త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో శనివారం ఉదయమే ఒక పోస్ట్ పెట్టారు. ప్రియతమ ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని అందులో ఆయన పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీన మెట్రోరైలు రెండోదశ ప్రారంభం, కొత్తగా సిటీ బస్సులను ప్రవేశపెట్టడం వంటి అనేక కార్యక్రమాల్లో జయలలిత పాల్గొన్నారు. మర్నాడు ఆమె సచివాలయానికి వెళ్లలేదు. అదే రోజు రాత్రి ఆమె జ్వరం బారిన పడ్డారు. అర్ధరాత్రి జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో సీఎంను చెన్నై గ్రీమ్స్‌రోడ్డులో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె కోలుకుంటున్నారు. జయలలిత ఆరోగ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఆలయాల్లో పూజలు చేయిస్తున్నారు. ఆమె పూర్తిస్థాయిలో కోలుకోగానే డిశ్చార్జి చేస్తామని అపోలో ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు. அன்புள்ள CM அவர்கள் விரைவில் நலமடைய இறைவனை பிராத்திக்கிறேன் — Rajinikanth (@superstarrajini) 24 September 2016