breaking news
Jaw pain
-
దవడ నొప్పికి కారణాలు చికిత్స
-
వైరల్: ఇదేం వింత.. 17 ఏళ్ల కుర్రాడికి ఏకంగా 82 పళ్లు..
Bihar Man Rare Tumor: సాధారణంగా మనుషులకు 32 పళ్లు (దంతాలు) ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వయస్సు తేడాను బట్టి కొందరి దంతాల సంఖ్యలో మార్పులు ఉండవచ్చు. దంత సమస్యలు ఏమైనా ఉంటే కొందరికి అవి ఊడిపోవచ్చు. కానీ ఎప్పుడైనా 32 కంటే ఎక్కువ దంతాలు కలిగిఉన్న వారిని చూశారా. పోనీ వారి గురించి విన్నారా.. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తికి ఉండాల్సిన పళ్ల కంటే మించి ఉన్నాయి. హా ఎన్నిలే 33, 34 ఉండవచ్చనుకుంటున్నారా. కాదండోయ్.. దానికి రెట్టింపుగా ఏకంగా 82 పళ్లు ఉన్నాయి. ఈ విచిత్ర సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పాట్నాకు చెందిన నితీష్ కుమార్ అనే 17 ఏళ్ల యువకుడికి 82 దంతాలు ఉన్నాయి. అంటే దాదాపు అతని వయస్సు కంటే దాదాపు అయిదు రెట్లు ఎక్కువ. నితీష్ గత అయిదేళ్లుగా నోటిలో కణితితో బాధపడుతున్నారు. కణితి బాధ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దంతాల డాక్టర్ వద్దకు వెళ్లాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విషయం తెలిసి షాక్ అయ్యారు. నితీష్ కుమార్ దవడలో 82 పళ్లు ఉన్నాయని, అందువల్లే అతనికి దవడ నొప్పిగా ఉందని తెలిపారు. దవడలో ఏర్పడిన ట్యూమర్ వల్ల దంతాలన్నీ ఒకే దగ్గర ఎక్కువ మొత్తాల్లో పుట్టుకొచ్చాయని తెలిపారు. ఇటువంటి దాన్ని వైద్య పరిభాషలో `ఒడొంటొమా` అంటారని పేర్కొన్నారు. దీంతో నితీష్‌కు మూడు గంటలపాటు సుదీర్ఘ ఆపరేషన్ చేసి దవడంలోని ట్యూమర్‌ని తొలగించారు. కణిత రెండు దవడల వైపు ఏర్పడటం వల్ల నితీశ్ కుమార్ ముఖం వికృతంగా కనిపించేదని, ఇప్పుడు సర్జరీ చేయడంతో యువకుడి ముఖం సాధారణ పరిస్థితిలోకి వచ్చిందన్నారు. ఆపరేషన్‌తో అదనపు దంతాలు తొలగించామని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు. -
దవడ నొప్పికి చికిత్స చేస్తే.. బ్రెయిన్‌డెడ్‌తో మృతి
పంజగుట్ట: వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడంటూ ఓ మహిళ పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నాగార్జునాసాగర్ వద్ద ఎస్పీఎఫ్ పోలీస్ విభాగంలో పనిచేసే ఎం. శంకర్(38) దవడ నొప్పితో బాధపడుతూ.. ఈ నెల 19వ తేదీన నిమ్స్‌లో అడ్మిట్ అయ్యాడు. వైద్యపరీక్షలు పూర్తిచేసిన బరడా పి.డి. సాహూ వైద్య బృందం శంకర్‌కు 25వ తేదీన శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం రోగి పరిస్థితి చెప్పమని శంకర్ భార్య మాధవి ఎన్ని సార్లు వైద్యులను అడిగినా వారు స్పందించలేదు. తెలిసిన మరో వైద్యునితో మాధవి బంధువులు నిమ్స్ వైద్యులకు ఫోన్ చేయించి రోగి పరిస్థితి గూర్చి వాకబు చేయగా శంకర్ బ్రైయిన్‌డెడ్ అయ్యారని తెలిపారు. కోమాలో ఉన్న శంకర్ గురువారం ఉదయం మృతిచెందినట్లు వైద్యులు తెలపడంతో శంకర్ భార్య మాధవి తన భర్త నడుచుకుంటూ వచ్చి నిమ్స్‌లో అడ్మిట్ అయ్యారని కేవలం దవడ నొప్పి ఉంటే వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో మృతిచెందాడని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించి ఇద్దరు వైద్యులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.