breaking news
jathin
-
బీజేపీలోకి జితిన్ ప్రసాద
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యూపీ కాంగ్రెస్‌లో కీలక నాయకుడు, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన జితిన్ ప్రసాద కమలదళంలో చేరిపోయారు. బుధవారం ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ జితిన్ ప్రసాదకు పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను వారి నివాసాల్లో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. జాతీయ పార్టీ అంటూ దేశంలో ఏదైనా పార్టీ ఉంటే అది కేవలం బీజేపీ ఒక్కటేనని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ మాత్రమే దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పార్టీ అని జితిన్ ప్రసాద వ్యాఖ్యానించారు. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాషాయ కండువా కప్పుకున్న తరువాత జితిన్ ప్రసాద మీడియాతో మాట్లాడుతూ ‘బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర నాయకులందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు నా రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మూడు తరాలుగా కాంగ్రెస్‌తో మా అనుబంధం కొనసాగుతోంది. ఈ ముఖ్యమైన నిర్ణయం కూలంకషంగా చర్చించిన తర్వాత తీసుకున్నా. నేను ఏ పార్టీని వీడుతున్నానన్నది ప్రశ్న కాదు. నేను ఏ పార్టీకి వెళుతున్నాను, ఎందుకు వెళ్తున్నాననేది అసలు ప్రశ్న. ఈ రోజు దేశంలో నిజమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీయే అని కొన్నేళ్లుగా అందరూ భావించే పరిస్థితి ఏర్పడింది’ అని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలకనేత యూపీ రాజకీయాల్లో, రాహుల్ కోటరీలో కీలకనేత జితిన్ ప్రసాద. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. కానీ అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్‌పైనే పోటీ చేసి ఓడిపోయారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేసిన ఆయన పార్టీ బాధ్యతల్లోనూ కీలకంగా పనిచేశారు. అయితే యూపీ ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ వచ్చిన తరువాత జితిన్ ప్రసాదను పక్కన పెట్టారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. జ్యోతిరాదిత్య సిందియా తర్వాత కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిన రాహుల్ సన్నిహితుల్లో రెండో నాయకుడు జితిన్. పశ్చిమ యూపీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద రాకతో ఆ ప్రాంతంలో బీజేపీ బలం పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బడా బుకీ జతిన్ అరెస్ట్
కర్ణాటక, బనశంకరి: సంచలనాల కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్, నటీమణుల ప్రమేయం తదితరాల కేసు విచారణను తీవ్రతరం చేసిన బెంగళూరు సీసీబీ అంతర్జాతీయ బుకీ జతిన్‌ను సోమవారం అరెస్ట్ చేసింది. కొన్నినెలలుగా నెదర్లాండ్స్‌లో తలదాచుకున్న ఢిల్లీకి చెందిన ఇతని కోసం రెడ్ కార్నర్ నోటీస్‌ను జారీచేశారు. అంతలోగా జతిన్ కోర్టులో ముందస్తు జామీను తీసుకున్నాడు. కేపీఎల్ ఫిక్సింగ్‌లో సూత్రధారిగా పేరున్న జతిన్ కెంపేగౌడ విమానాశ్రయానికి వస్తున్నాడనే పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా సోమవారం కెంపేగౌడ విమానాశ్రయంలో నెదర్లాండ్స్ నుంచి విమానంలో దిగగానే సీసీబీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు సీసీబీ ఉన్నతాధికారి సందీప్ పాటిల్ తెలిపారు. జతిన్ కేపీఎల్తో పాటు పలు క్రికెట్ మ్యాచ్ బెట్టింగుల్లో పాల్పంచుకున్నట్లు తేలిందని, దీనిపై కూపీ లాగుతున్నట్లు చెప్పారు. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి జతిన్ కీలక సమాచారం అందించాడని, ఇప్పటి వరకు అరెస్టైన వారితో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. డీసీపీ కుల్దీప్కుమార్ జైన్ నేతృత్వంలో జతిన్‌ను విచారిస్తున్నామని, కోర్టు అనుమతి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేపీఎల్ బాగోతం కీలక మలుపు తిరిగే అవకాశముంది. -
విప్లవోద్యమంలో బెంగాల్ బెబ్బులి
1908 నాటి ఘటన ఇది. జరిగిన చోటు– బెంగాల్‌లోని సిలిగుడి రైల్వే స్టేషన్. కొందరు ఇంగ్లిష్ అధికారులని ఒక భారతీయుడు చావగొట్టి వదిలిపెట్టాడు. దీని మీద కేసు నమోదైంది. ఒకే ఒక్క భారతీయుడు కొందరు శ్వేతజాతీయులకి ఒంటి చేత్తో కళ్లు బైర్లు కమ్మేటట్టు చేశాడంటే ఎంత పెద్ద వార్త. పత్రికలు పోటీపడి ప్రాధాన్యం ఇచ్చాయి. విచారణ జరుగుతున్నంత కాలం అదే పనిలో ఉన్నాయి. ఇదంతా చూశాక పరువు తక్కువ అని కేసు మూయించేశారు అధికారులు. ఎందుకంటే ఒంటరి భారతీయుడి చేతిలో అంతమంది అధికారులు చావు దెబ్బలు తిన్నారంటే రవి అస్తమించని సామ్రాజ్యానికి, బ్రిటిష్ చక్రవర్తికి ఎంత అప్రతిష్ట! పైగా దెబ్బలు తిన్న వాళ్లంతా సైనికాధికారులు కావడం మరొక విశేషం. మహిళలకు ఇబ్బంది కలిగించవద్దని సగౌరవంగా కోరినా జాత్యహంకారం చూపినందుకు, అవమానకర భాషతో తనను దూషించినందుకు ఆ యువకుడు ఆ సాహసం చేశాడు. ఇంతటి దేహబలం కలిగిన ఆ భారతీయుడి పేరు ‘బఘా’ (పెద్దపులి) జతీన్. పూర్తిపేరు జతీంద్రనాథ్ ముఖర్జీ. జతీన్ భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో వేగుచుక్క. విప్లవ స్రష్ట, ద్రష్ట. బ్రిటిష్ పాలన మీద విప్లవించడానికి మొత్తం భారతదేశాన్ని కదిలించాలని మొదటిసారి ఆలోచించినవారు జతీన్. ఈ పనిలో జర్మనీ సాయం తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం చిరస్మరణీయమైనది. రామకృష్ణ పరమహంస, వివేకానంద బోధనలు, శిష్యరికంతో ఆయన తన జాతీయవాద దృష్టిని మలచుకున్నారు. ఆధ్యాత్మికత ఆధారంగా సాంస్కృతిక జాతీయవాదాన్ని ఆశించారాయన. అరవిందుల ఆదేశంతో విప్లవ సంస్థను స్థాపించారు. రాస్ బిహారీ బోస్, ఎంఎన్ రాయ్ వంటివారి సాహచర్యంతో జతీన్ విప్లవ పంథాలో నడిచారు. ఆర్థిక పరిపుష్టితో, రాజకీయ స్వేచ్ఛతో, మౌఢ్యం లేని ఆధ్యాత్మిక చింతనతో ఈ దేశం పరిఢవిల్లాలని ఆకాంక్షించారాయన. జతీంద్రనాథ్ ముఖర్జీ (డిసెంబర్ 7, 1879–సెప్టెంబర్ 10, 1915) ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న కయాగ్రామ్ (నాడియా జిల్లా)లో పుట్టారు. తండ్రి ఉమేశ్‌చంద్ర ముఖర్జీ, తల్లి శరత్శశి. ఈమె కవయిత్రి. తన పిల్లలను ఎంత ప్రేమగా చూసేవారో, అంత అదుపులోనూ ఉంచేవారు. ఆమె నుంచి జతీన్ చిన్నతనంలోనే పురాణ కథలను విన్నాడు. బహుశా తల్లి మాటలలోనే మాతృభూమికి పట్టిన దుస్థితికి గురించి ఆయనకు అవగాహన కలిగి ఉండాలి. పురాణ గాథలతో పాటు బంకిమ్‌చంద్ర ఛటోపాధ్యాయ గొప్పతనం కూడా అమ్మ నోటి నుంచే జతీన్ విన్నాడు. అలాగే మరొక ప్రముఖ రచయిత యోగేంద్ర విద్యాభూషణ్ (ఇటలీ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డి జీవితాలను బెంగాలీలకు పరిచయం చేసినవారు) గురించి కూడా తల్లి చెప్పేది. మేనమామ బసంత్‌కుమార్ ఛటోపాధ్యాయ న్యాయవాది. రవీంద్రనాథ్ టాగోర్ ఆయన క్లయింట్. అప్పటికే టాగోర్ స్త్రీలకు సమాన స్థానం కల్పించడం గురించి ప్రజలలో చైతన్యం రేకెత్తించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఐదో ఏటనే జతీన్ తండ్రిని కోల్పోయారు. అయినా ఒక అందమైన, ఆదర్శనీయమైన బాల్యాన్ని ఆయన గడిపారు. బొమ్మలు గీసేవారు. పెద్దలు, వృద్ధుల పట్ల ఉదారంగా ఉండేవారు. పౌరాణిక నాటకాలు, ఆ పాత్రలు అంటే ఆరాధించేవారు. కిషన్‌నగర్‌లోని ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్లో చదువు అయిన తరువాత కలకత్తా సెంట్రల్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ చదవడానికి చేరారు. అప్పుడే బెంగాల్లో ప్లేగు వ్యాధి వచ్చింది. సిస్టర్ నివేదిత బాధితుల కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సేవకులను పిలిచి సేవలు చేసేవారు. అలా బాధితులకు సేవ చేయడానికి వెళ్లినప్పుడే నివేదిత జతీన్‌ను వివేకానందకు పరిచయం చేశారు. ఈ దేశానికి సేవలు అందించడానికి ‘ఇనుప కండరాలు,ఉక్కు నరాలు’ కలిగిన యువకుల బృందాన్ని సిద్ధం చేయమని నేరుగా వివేకానందులే యువ జతీన్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆంగ్లేయ విద్యా విధానం మీద సహజంగానే ఏవగింపు ఆరంభమైంది. చదువు వదిలి పెట్టి 1899లో ముజఫర్‌పూర్ వెళ్లిపోయారు. అక్కడ రచయిత, ‘త్రిహూత్ కొరియర్’ పత్రికా సంపాదకుడు, చరిత్రకారుడు, బారిస్టర్ ప్రింగీల్ కెన్నెడీ దగ్గర కార్యదర్శిగా చేరారు. కెన్నెడీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడే ఆంగ్లేయుడు. తన పత్రిక సంపాదకీయాలలోను, జాతీయ కాంగ్రెస్ సభలలోను కూడా భారత్‌లో జరుగుతున్న బ్రిటిష్ దోపిడీ గురించి, భారత జాతీయ సైన్యం ఏర్పడవలసిన అవసరం గురించి మాట్లాడేవారు. ఇది కూడా జతీన్‌ను ఉత్తేజపరిచేది. 1900 సంవత్సరంలో జతీన్, ఇంకొందరు యువకులు కలసి ‘అనుశీలన్ సమితి’ సంస్థను ఏర్పాటు చేశారు. 1903లో అరవిందులను కలసినప్పుడు రహస్య సంస్థలను స్థాపించమని ఆయన నుంచి సలహా అందింది. ‘జుగాంతర్’ అలాంటి సంస్థే. ‘అనుశీలన్ సమితి’ పైకి వ్యాయామశాలలు నిర్వహించే సంస్థ. కానీ అసలు ఉద్దేశం బ్రిటిష్ పాలన మీద సాయుధ పోరాటం చేసే యువతను సమీకరించడమే. బీరేంద్ర ఘోష్‌తో కలసి దేవ్‌గఢ్ అనేచోట బాంబుల నిర్మాణ కేంద్రం కూడా స్థాపించారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాలను దోచేవారు. ఆయన మీద పెట్టిన హౌరా–శిబ్పూర్ కేసు ఇందుకు సంబంధించనదే. కానీ సరైన ఆధారాలు లేక కేసు కొట్టేశారు. 1900 సంవత్సరంలో ఇందుబాలను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు– అతీంద్ర, ఆశాలత, తేజేంద్ర. కానీ 1903లో పుట్టిన పెద్దకొడుకు మూడేళ్లకే కన్నుమూయడంతో » ఘా జతీన్ తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయారు. అదే తరుణంలో భార్య, సోదరితో కలసి తీర్థయాత్రలు చేశారు. హరిద్వార్‌లో పరిచయమైన స్వామి భోలానందగిరి సాంగత్యంలో పోయిన మనశ్శాంతి మళ్లీ చేకూరింది. జతీన్ నేపథ్యం తెలిసిన ఆ స్వామి మళ్లీ ఉద్యమం ఆరంభించమని, తన సాయం ఉంటుందని ఆశీర్వదిచారు. తిరిగి స్వగ్రామానికి వచ్చిన తరువాత మానవ రక్తం రుచి మరిగిన ఒక చిరుత తిరుగుతోందని తెలిసింది. దీనిని పట్టుకునే క్రమంలో జతీన్ బంధువుల తుపాకీ కాల్చాడు. కానీ గురి తప్పింది. కానీ జతీన్ చిరుతతో బాహాబాహీ తలపడ్డారు. ఒళ్లంతా గోళ్లు దిగి జతీన్ శరీరం విషపూరితమైంది. అయినా తన వద్ద ఉన్న గూర్ఖాలు వాడే ఖుక్రీ కత్తితో పొడిచి చంపారు. దీనికి ప్రభుత్వం జ్ఞాపిక ఇచ్చి, ‘బఘా (పెద్దపులి) జతీన్’ అని పేర్కొంది. అప్పటి నుంచి ఆయన పేరు బఘా జతీన్గా మారింది (ఆ ఖుక్రీ ఇప్పటికీ ఆయన కుటుంబీకుల దగ్గర భద్రంగా ఉంది. పండుగలలో దేవతా విగ్రహాలతో పాటు దానిని కూడా పూజిస్తున్నారు. జతీన్ మరణ వార్త విన్న కుటుంబం మిగిలిన సామానుతో పాటు ఆ ఖుక్రీని కూడా వెంట తీసుకుని అప్పుడు తమ ఇల్లు విడిచి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయింది). ‘మనం మరణిద్దాం! జాతి మేల్కొంటుంది’ అన్న నినాదంతో జతీన్ ఉద్యమాన్ని ఆరంభించారు. జాతీయ కాంగ్రెస్ స్వరాజ్యం అన్నమాట పలకడానికి సిద్ధంగా లేని రోజులలోనే ఆయన సంపూర్ణ స్వరాజ్యం గురించి ఆలోచించారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. బ్రిటన్ పరిపాలనను కూల్చడానికి ఈ యుద్ధ పరిస్థితులను ఉపయోగించుకోవాలని భారతదేశంలోని తీవ్ర జాతీయవాదులంతా ఆలోచించారు. అందుకే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూక్తిని అనుసరించి జర్మనీతో మంతనాలు ఆరంభించారు. ఆ క్రమంలోనే జతీన్‌కు ఒక అవకాశం కాళ్ల వరకు వచ్చింది. జర్మనీ యువరాజు 1912లో కలకత్తా వచ్చారు. జతీన్ ఎలాగో ఆయనను కలుసుకోగలిగాడు. భారతదేశం నుంచి ఇంగ్లండ్ జాతిని తరిమికొట్టేందుకు, సామ్యవాద దేశంగా ఏర్పాటు చేయడానికి సహకరించాలని; ఇందుకు సాయుధ పోరాటానికి ఆయుధాలు ఇప్పించాలని కోరారు. ఆయుధాలు పంపించడానికి ఆయన దగ్గర ప్రమాణం కూడా తీసుకున్నారు. అప్పటికే ఇక్కడ ఆయుధ సేకరణకు, ఇతర కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని సేకరించే బాధ్యత జతీన్ ఎంఎన్ రాయ్‌కి అప్పగించారు. జర్మనీ నుంచి ఆయుధాలతో వచ్చే నౌకను ఒడిశాలోని బాలసోర్ జిల్లా తీరంలో ఆపాలని నిర్ణయించారు. ఈ నౌక కోసం జతీన్ ఆయన సహచరులు ఎంతో ముందే కప్తిపడా అనే గ్రామం చేరుకుని రహస్యంగా జీవించారు. కానీ నౌక రాలేదు (ఈ ఉదంతం కూడా ఇండో జర్మన్ కుట్రకేసులో భాగం). జర్మనీ నుంచి ఆయుధాలు పంపాలన్న ఆలోచనలో, ఆ నౌక తూర్పు తీరంలో బాలసోర్ జిల్లా తీరంలో ఆగాలన్న నిర్ణయంలో లోపం లేదు. కానీ ఈ పథకం గురించి ఇ.వి. వోస్కా అనే చెక్ గూఢచారికి తెలిసిపోయింది. అతడు ఈ రహస్యాన్ని బ్రిటిష్ అధికారులకు అమ్ముకున్నాడు. ఈ బాలసోర్ పంపడానికి ఆయుధాలు అమ్మిన వ్యాపారి కూడా ఇలాగే వ్యవహరించాడు. నిజానికి ఆయుధాలతో జర్మనీ నుంచి నౌక బయలుదేరిన సంగతి కూడా జతీన్‌కు తెలిసింది. దీనితో జతీన్ బృందం కొండల మార్గంలో రెండురోజుల పాటు నడిచి మయూర్భంజ్ చేరుకుంది. బాలసోర్ దగ్గరే చషాఖండ్ అనే గ్రామంలో ఒక చిన్న కొండ ఎక్కి నౌక కోసం చూస్తున్నారు. అప్పుడే బలగాలు చుట్టుముట్టాయి. కలకత్తా, బాలసోర్లలో ఉండే పోలీసులు, భద్రక్ దగ్గరి చాంద్‌బలి నుంచి ఒక ఆర్మీ బృందం అందులో ఉన్నాయి. విప్లవకారుల దగ్గర మాసెర్ రివాల్వర్లు తప్ప పెద్ద ఆయుధాలు ఏమీ లేవు. కానీ బ్రిటిష్ బలగాలు శక్తిమంతమైన ఆయుధాలతో వచ్చాయి. రెండు గంటలే యుద్ధం జరిగింది. జతీన్ తీవ్రంగా గాయపడ్డారు. మరునాడే బాలసోర్ ఆస్పత్రిలో చనిపోయారు. కొద్దిమందే అయినా జతీన్ బృందం కూడా వీరోచితంగా పోరాడి కొందరు బ్రిటిష్ సిబ్బందిని మట్టుపెట్టగలిగింది. జతీన్ వంటి గొప్ప యోధుడు, చింతనాపరుని గురించి కూడా సరైన సమాచారం చరిత్ర పుస్తకాలలో దొరకకపోవచ్చు. కానీ నాటి కథనాలు, అందులో జతీన్ గురించి వ్యక్తమైన అభిప్రాయాలు గమనిస్తే ఆయన ఎంతటి సమున్నతుడో తెలుస్తుంది. మింటో, హార్డింజ్ అనే ఇద్దరు గవర్నర్ జనరళ్లు కూడా ఆయన కార్యకలాపాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చార్లెస్ అగస్టస్ టెగ్రాట్ నాటి ప్రముఖ పోలీసు అధికారి. ఇతడు, ఇంగ్లండ్‌లో కనుక పుట్టి ఉంటే, ట్రెఫాల్గర్ కూడలిలో అతడి విగ్రహాన్ని నెల్సన్ విగ్రహం పక్కన నెలకొల్పేవారు అని వ్యాఖ్యానించాడు. జతీన్ ఉత్తర, తూర్పు భారతాలలో విప్లవ కార్యకలాపాల కోసం పునాదులు వేసుకుంటూ, ఆగ్నేయాసియా, అమెరికా, ఐరోపాలలో భారతీయులు జరుపుతున్న బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలను సమన్వయం చేయడానికి కృషి చేశారు. జర్మనీ నుంచి సాయం అందిన తరువాత దేశమంతటా ఒకేసారి తిరుగుబాటు చేయాలని స్నేహితుడు రాస్ బిహారీ బోస్‌తో కలసి ఆయన ఆలోచించాడు. ఈ తరం త్యాగాలు చేస్తేనే భవిష్యత్తరాలు తలెత్తుకు బతకగలవన్న సిద్ధాంతంతోనే జతీన్ ముందుకు న డిచారని ఆయన మనుమడు, జీవిత కథ రచయిత పృథ్విన్ ముఖర్జీ రాశారు. జతీన్ బాహాబాహా తలపడి ఒక క్రూరమృగాన్ని చంపారు. మనిషి రూపంలో ఉన్న ఈ బెంగాల్ టైగర్‌ను చుట్టుముట్టి చంపవలసి వచ్చింది. - డా. గోపరాజు నారాయణరావు -
మృత్యువులోనూ చిరంజీవి జతిన్
ఆ బాలుడు మరణిస్తూ కూడా ఆరుగురికి జీవితాల్ని ఇచ్చాడు. మృత్యువుతో పోరాటంలో ఓడినా తన అవయవ దానంతో అందరి హృదయాల్లో చిరంజీవి అయ్యాడు. ఓ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన బాలుడు జతిన్ ఇప్పుడు నిజంగా రియల్ హీరోగా వేనోళ్ల కీర్తి పొందుతున్నాడు. మానవత్వంఉన్న ప్రతి గుండెను కదిలించే ఆ కథనం.. - ఖైరతాబాద్ ఖైరతాబాద్ డివిజన్లోని జాగీర్దర్బాడాలో నివాసముండే బి.కృష్ణ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. రెండో సంతానమైన బి.జతిన్(14) స్థానికంగా ఉన్న మాస్టర్ ట్యాలెంట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వీరి ఇంటి పక్కనే నల్గొండ జిల్లా తిరుగలపల్లి గ్రామానికి చెందిన సైదులు, ఈశ్వరమ్మలు ఎన్టీఆర్గార్డెన్లో మాలీలుగా పనిచేస్తున్నారు. వీరికి గణేష్ యాదవ్(14) ఒక్కగానొక్క సం తానం. ఇద్దరూ ఒకే స్కూల్లో సహ విద్యార్థులు కావడం, ఇరుగుపొరుగులవ్వడంతో ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. ప్రమాదం జరిగిందిలా.... ఈ నెల1వ తేదీన గణేష్‌యాదవ్ అన్న మల్లేష్ ఉదయం 8 సమయంలో హీరోహోండా స్ల్పెండర్ప్లస్పై ఇంటికి వచ్చా డు. వద్దంటున్నా గణేష్ ఇప్పుడే వస్తానంటూ ఆ బండిపై బయటకు వచ్చాడు. జతిన్ కలవడంతో ఇద్దరు కలిసి బైక్‌పై నిమజ్జనం అయిన ఖైరతాబాద్ మహాగణపతిని చూసేం దుకు బయలుదేరారు. ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో బైక్ అదుపు తప్పి డ్రైవింగ్ చేస్తున్న గణేష్‌యాదవ్, జతిన్లు ఫుట్‌పాత్‌పై పడ్డారు. దాంతో వీరి తలలకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరినీ గాంధీ హాస్పిటల్‌కు తరలిం చారు. చికిత్స పొందుతూ అదే రోజు గణేష్‌యాదవ్ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం జతిన్‌ను ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అయితే బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు ఆదివారం ధ్రువీకరించారు. జతిన్ కిడ్నీలు, గుండె, కార్నియాలు, కాలేయాన్ని సేకరించారు. గుండెను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. అవయవదానం చేసిన జతిన్‌కు పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఘన నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం పంజగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి.