సెంట్రల్ వర్సిటీకి  కేంద్రం ఆమోదం
                  
	అనంతపురం అర్బన్ : బుక్కరాయసముద్రం మం డలం జంతులూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటీ) ఏర్పాటుకు  కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. వర్సిటీ ఏర్పాటుకు   500 ఎకరాల భూమిని  అధికారులు ఇప్పటికే సేకరించారు. ప్రహరీ నిర్మాణానికి అంచనాలు కూడా సిద్ధం చేసి.. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు అంటున్నారు.