breaking news
Janga srinivas
-
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా శ్రీనివాస్
పంజగుట్ట: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్యపరచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కోరారు. బుధవారం మాల మహానాడు జాతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇటీవల మాల మహానాడు రాష్ట్ర కమిటీ రద్దు చేసిన నేపథ్యంలో నూతన రాష్ట్ర అధ్యక్షునిగా జంగా శ్రీనివాస్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాల మహేశ్, గ్రేటర్ అధ్యక్షునిగా బైండ్ల శ్రీనివాస్‌ను నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పీవీ రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయా లని, రాష్ట్రంలో మాలలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ముందుండాలని కోరారు. -
వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం తీవ్రతరం
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ప్రకటించారు. మాదిగలు చేపట్టనున్న ఉద్యమాలకు దీటుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 12వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హలో మాల-చలో ఢిల్లీ పేరుతో మహాధర్నాను నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్గీకరణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని ఆయన కోరారు. మహాధర్నాకు మాలలు, ఉప కులాలు, కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు మద్దతు పలకాలని కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గైని గంగారాం, సెక్రటరీ జనరల్ జంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.