breaking news
janaganamana-song
-
నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు
బెంగళూరు: సినిమాహాల్లో జాతీయగీతం ప్రదర్శించినప్పుడు కుర్చీల్లోంచి లేచి నిలబడలేదన్న కారణంతో నలుగురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 23న బెంగళూరులోని పీవీఆర్ ఓరియన్ సినిమాహాల్లో ప్రదర్శితమవుతోన్న తమిళ సినిమా ‘అసురన్’కు వచ్చిన ప్రేక్షకుల్లో నలుగురు సినిమాకు ముందుగా జాతీయగీతం ‘జనగణమన’ను ప్రదర్శించినప్పుడు లేచి నిలబడలేదు. దీంతో ఓ వ్యక్తి వారిని వీడియో తీశాడు. ఈ వీడియోను సినీ నటి బీవీ ఐశ్వర్య సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఆ నలుగురు వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, వారి పేర్లను అందులో పేర్కొనలేదు. -
గోటిపై ‘జనగణమన’
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపుపేట జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఖండవిల్లి విజయకుమార్ బొటనవేలి గోటిపై సూక్ష్మ అక్షరాలతో ‘జనగణమన’ గీతాన్ని రాశారు. గతంలో ఆయన సూక్ష్మ కళ ద్వారా అనేక చిత్రాలను గీసి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోటిపై జనగణమన గీతాన్ని రాసినట్టు ఆయన ఆదివారం విలేకరులకు తెలిపారు. - రామచంద్రపురం