breaking news
Jammalmadugu
-
ప్రేయసికి పెళ్లి చేశారని..
జమ్మలమడుగు: తాను ప్రేమించిన అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారనే మనస్థాపంతో జమ్మలమడుగు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ఆదినారాయణ(18) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన జి.ఆదినారాయణ, దువ్వూరు మండలం మన్నెరాంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వారం రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకొని వచ్చారు. దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు దువ్వూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లి చేసుకున్న యువతీ యువకులిద్దరు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే వీరిద్దరూ మైనర్లు అని ఈ వివాహం చెల్లదని పోలీసులు తేల్చి చెప్పారు. మూడు సంవత్సరాల వరకు ఎవరూ వివాహం చేయకూడదని పోలీసులు ఇరువర్గాల పెద్దల అంగీకారంతో అగ్రిమెంట్ రాశారు. మూడు సంవత్సరాల తర్వాత ఆ యువతిని తాను ప్రేమించిన యువకుడినే వివాహం చేసుకుంటానని చెబితే అప్పుడు వివాహం జరిపించాలి. లేదంటే ఎవరంతట వారు ఉండాలని పోలీసులు సూచించారు. అయితే అగ్రిమెంట్‌ను కాదని యువతి తల్లిదండ్రులు సోమవారం ఆమెకు వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆదినారాయణ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు మైనర్‌కు వివాహం చేశారని, తమ కుమారుడి మరణానికి అమ్మాయి తల్లిదండ్రులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి
-
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు రణరంగంగా మారింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలను పరిశీలించేందుకు వెళ్లిన కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ కౌన్సిలర్లు అవినాష్ రెడ్డి కళ్లల్లో కారం చల్లారు. అవినాష్ రెడ్డికి గాయాలవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశంతో సాయంత్రం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అంతకుముందు పోలీసులపైనా టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఎస్ఐ సహా ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి భాష్పాయువు ప్రయోగించారు.