breaking news
Jalis Ansari
-
నగరంలోనూ ‘డాక్టర్ బాంబ్’ ఛాయలు!
సాక్షి, సిటీబ్యూరో : అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ (టీఐఎం) పేరుతో ఉగ్రవాద సంస్థ ఏర్పాటు చేసి, హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 60 వరకు బాంబు పేలుళ్లకు పాల్పడిన ‘డాక్టర్ బాంబ్’ జలీస్ అన్సారీ శుక్రవారం పోలీసు, నిఘా విభాగాలకు ముచ్చెమటలు పట్టించాడు. ముంబైలోని ఆథర్ రోడ్ జైలు నుంచి నెల రోజుల క్రితం పెరోల్‌పై బయటికి వచి్చన అతను శుక్రవారం తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉండగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ ప్రకటించాయి. మధ్యాహ్నానికి ఉత్తరప్రదేశ్‌లో చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన జలీస్ అన్సారీ ముంబై యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత కొందరు అనుచరులతో ముఠా ఏర్పాటు చేసిన ఇతను 1993–94లో రాజస్థాన్, మహారాష్ట్ర, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఇందులో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువగా ఉన్నాయి. 1993లో జలీస్ అన్సారీ తన మాడ్యుల్ సాయంతో నగరంలోని ఐదు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒడిగట్టాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో నిపుణుడైన జలీస్ అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్ బాంబ్’ పేరుతో పిలుస్తుంటాయి. ఇతడు తయారు చేసిన బాంబుల్లో సల్ఫూరిక్ యాసిడ్‌నే టూమర్గా వాడేవాడు. 1994 జనవరి 12న ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి పీటీ వారెంట్‌పై రాజస్థాన్ పోలీసులు అజీ్మర్ తరలించారు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉండటంతో కేసుల విచారణ ముగిసి జీవిత ఖైదు కూడా పడింది. కొన్నాళ్ల క్రితం ముంబైలో నమోదైన కేసుల విచారణ కోసం ఆ పోలీసులు ఆథర్ రోడ్ జైలుకు తీసుకువచ్చారు. ఇతడికి సుప్రీం కోర్టు గత నెలలో నెల రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. దీంతో ముంబైలోని అగ్రిపాడ ప్రాంతంలోని తన ఇంటికి వచ్చాడు. పెరోల్ గడువు శుక్రవారం ఉదయం ముగియడంతో అతను ఆథర్ రోడ్ జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే తెల్లవారుజామున 5 గంటలకు ప్రార్థనల నిమిత్తం బయటికి వెళ్లిన అన్సారీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు అలెర్ట్ ప్రకటించారు. ఓపక్క దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు జరుగుతుండటంతో అన్సారీ అజ్ఞాతం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ... ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నిఘా వర్గాలు, ప్రత్యేక విభాగాలు అన్సారీ కోసం ముమ్మరంగా గాలించాయి. శుక్రవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లో చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జలీస్ అన్సారీకి ప్రధాన అనుచరుడు, ఆ మాడ్యుల్లో కీలక వ్యక్తిగా ఉన్న ఖాద్రీని 2010 అక్టోబర్‌లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు గోల్కొండ ప్రాంతంలో అరెస్టు చేశారు. ముంబైలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన ఖాద్రీ... 2003లో తన ఇంట్లో ఓ వ్యక్తిని హత్య చేసి, పూర్తిగా కాల్చేసి... తానే చనిపోయినట్లు పోలీసులను నమ్మించాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌కు వచ్చి గోల్కొండ ప్రాంతంలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పరిణామాలతో జలీస్ మిస్సింగ్ తర్వాత రాష్ట్ర నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. జలీస్ మాడ్యుల్ ఘాతుకాలివీ... ►ఆగస్టు 12న అబిడ్స్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి బాంబు విసిరారు. ఇది అక్కడి ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్‌కు తగిలి పేలడంతో సమీపంలోని వివేక్ వాచ్ కంపెనీ కాపలాదారుడు సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ► ఇదే రోజు హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి బాంబు విసిరారు. అదృష్టవశాత్తు ఎవరికీ, ఎలాంటి హానీ జరుగలేదు. ►సెపె్టంబర్ 12న సికింద్రాబాద్ రైల్వే రిజర్వేషన్ కాంప్లెక్స్ క్యాష్ రూమ్‌లో జ రిగిన బాంబు పేలుడులో క్యాషియర్లు బాలాజీ, బాల సుబ్రహ్మణ్యం మృతి చెందారు. మరో క్యాషియర్ చంద్రశేఖర్ క్షతగాత్రుడయ్యాడు. ►అక్టోబర్ 22న నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ ఫుట్‌పాత్‌పై బాంబు పేల్చారు. ఈ ఘటనలో ‘మదీనా’ వంట మనిషి మహ్మద్ పాషా మృతిచెందగా... కాపలాదారు ►యూసుఫుద్దీన్, స్వీపర్ మల్లమ్మ గాయపడ్డారు. ► డిసెంబర్ 6న మౌలాలి రైల్వేట్రాక్‌పై అమర్చిన బాంబులు పేలడంతో ఏపీ ఎక్స్‌ప్రెస్ వెళ్తున్న ఒకరు మృతిచెందగా...పలువురు క్షతగాత్రులయ్యారు. -
‘డాక్టర్ బాంబ్’కు జీవితఖైదే
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 43 బాంబు పేలుళ్లకు పాల్పడిన, ‘డాక్టర్ బాంబ్’గా పిలిచే జలీస్ అన్సారీకి జీవితఖైదే సరైందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజస్థాన్‌లో విధ్వంసానికి సంబంధించి అన్సారీ సహా 11 మందికి రాజస్తాన్‌లోని అజ్మీర్ న్యాయస్థానం విధించిన ఈ శిక్షను బుధవారం సుప్రీంకోర్టు సమర్థించింది. తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్(టీఐఎం) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అన్సారీ సృష్టించిన విధ్వంసాలు నగరంలోనూ ఐదు ఉన్నాయి. అన్సారీతో పాటు అప్పట్లో నగరంలో నివసించిన అబ్దుల్ కరీం తుండా సైతం ఇందులో కీలకపాత్ర పోషించాడు. తుండాను 2012లో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ముంబై ఏటీఎస్ అధికారులు 2010 అక్టోబర్‌లో గోల్కొండ ప్రాంతంలో అరెస్ట్ చేసిన మహారాష్ట్ర వాసి సయ్యద్ ముసద్ధిఖ్ వహీదుద్దీన్ ఖాద్రీ సైతం ఇతడి ప్రధాన అనుచరుడే. ముంబైకి అన్సారీ ముంబాయ్ వర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ విధ్వంసానికి ప్రతీకారంగా తుండా, అన్సారీ, కోల్‌కతాకు చెందిన అబ్దుల్లా మసూద్, వరంగల్ వాసి ఆజం ఘోరీ కలసి టీఐఎంను స్థాపించారు. ఈ మాడ్యుల్ 1993-94ల్లో రాజస్తాన్, మహారాష్ట్ర, హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 43 బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ మాడ్యుల్ టార్గెట్ చేసిన వాటిలో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువ. 1993లో అన్సారీ తన మాడ్యుల్ సాయంతో రాజస్తాన్, మహారాష్ట్రతో పాటు నగరంలోని ఐదు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒడిగట్టి.. నలుగురి ప్రాణాలు తీశాడు. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో దిట్ట అయిన అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్ బాంబ్’ అనే పేరుతో పిలుస్తుంటాయి. 1994 జనవరి 12న ముంబై పోలీసులు అన్సారీని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పీటీ వారెంట్‌పై అజ్మీర్ తరలించారు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉండటంతో సిటీలోని కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2012లో రాజస్తాన్‌లోని కేసుల విచారణ పూర్తికావడంతో ఆ పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చి మళ్లీ తీసుకువెళ్లారు. అన్సారీపై హైదరాబాద్‌లో నమోదైన కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. నగరంలో టీఐఎం ఘాతుకాలివి... 12.08.1993: అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ జంక్షన్ బాక్స్‌పై బాంబు విసిరారు. సుబ్బారాయుడు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇదే రోజు హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో మరో బాంబు పేలింది. 12.09.1993: సికింద్రాబాద్‌లోని రైల్వే రిజర్వేషన్ కాంప్లెక్స్ క్యాష్ రూమ్ వద్ద పేలుడు. బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం అనే ఇద్దరు మణించారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. 22.10.1993: నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద పేలుడు. ఇందులో మహ్మద్ పాషా అనే వ్యక్తి మరణించగా.. యూసుఫుద్దీన్, మల్లమ్మ తదితరులు గాయపడ్డారు. 6.12.1993: మల్కాజ్గిరి పరిధిలోని మౌలాలీ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్స్‌పై ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను టార్గెట్ చేసుకుని బాంబు పేల్చగా.. ఓ వ్యక్తి మరణించాడు. మరికొందరు గాయపడ్డారు.