breaking news
jakir Syed Hussain
-
జాకీర్ హుస్సేన్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తుదిశ్వాస విడిచారు. జాకీర్ హుస్సేన్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.జాకీర్ హుస్సేన్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మరణించటం బాధ కలిగించింది. సంగీత విద్వాంసుడు అయిన జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
‘ఖాకీ’ దంపతుల కర్కశం!
కాళ్లు చేతులు కట్టేసి వేడి నూనె పోశారు.. మెదక్ జిల్లాలో ఘటన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి సంగారెడ్డి: ఓ హెడ్‌కానిస్టేబుల్ దంపతుల కర్కశానికి చిన్నారి బలైంది. కాళ్లు చేతులు కట్టేసి.. వేడి నూనె పోసి నరకయాతనకు గురిచేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. డీఎస్పీ ఎం.తిరుపతన్న కథనం మేరకు.. జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం హెడ్‌కానిస్టేబుల్ సయ్యద్ జాకిర్ హుస్సేన్ అహ్మద్, భార్య రజియా సుల్తానాతో కలసి కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో నివాసముంటున్నాడు. ఐదు నెలల క్రితం ఓ దర్గా నుంచి షాహిస్తా సబా (5)ను తీసుకువచ్చాడు. అయితే హెడ్‌కానిస్టేబుల్ దంపతులు ఆ బాలికను తరచూ చిత్రహింసలకు గురిచేసేవారు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం బాలిక చేతులు, కాళ్లకు వాతలు పెట్టారు. వేడి నూనె మీద పోయడంతో తీవ్రంగా గాయపడింది. ఇరుగుపొరుగువారి సమాచారం మేరకు గురువారం శిశు సంరక్షణ అధికారి ఎం.ఎస్.చంద్ర బాలికను సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడిని సంగారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ దంపతులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.