breaking news
IRCTC packages
-
శృంగేశ్వర్‌పూర్..గంగారామాయణ యాత్ర..
దక్షిణాది వాళ్లకు ఉత్తరాదికి యాత్రలంటే...కాశీ విశ్వనాథుడు... విశాలాక్షి దర్శనాలు. అయోధ్య బాల రాముడు... సరయు నది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం...నైమిశారణ్యం పర్యటన... ఇవే ప్రధానం. రాముడు పడfనెక్కిన శృంగేశ్వర్‌పూర్..? గంగారామాయణ యాత్రలో ఇది ప్రత్యేకం!తొలి మూడు రోజులు..మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. బోన్గిర్, జనగాన్, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దారోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కోయింజహార్ రోడ్, భద్రక్, బాలాసోర్‌ల మీదుగా మూడవ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు బనారస్‌కు చేరుతుంది. హోటల్ గదికి చేరిన తర్వాత సాయంత్రం వీలును బట్టి స్వయంగా వారణాసిలో ప్రదేశాలను చూడవచ్చు లేదా విశ్రాంతి తీసుకోవచ్చు.నాల్గోరోజు..ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాశీ విశ్వనాథ కారిడార్‌లో విహారం, ఆలయ దర్శనం, విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాల సందర్శనం. సాయంత్రం గంగాహారతి వీక్షణం, ఆ తర్వాత రాత్రి బస.విశ్వానికి నాథుడుకాశీలో శివుడి పేరు విశ్వనాథుడు. ఇక్కడ శివలింగాన్ని భక్తులు తాకవచ్చు. తెల్లవారు ఝామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఐదు దాటిన తర్వాత గర్భగుడిలోకి అనుమతించరు. గది ఇవతల నుంచే దర్శనం చేసుకోవాలి. కొత్తగా నిర్మించిన ఆలయం గంగానది తీరం వరకు విస్తరించి చాలా చక్కగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో పోలీసు గస్తీ కూడా బాగుంటుంది. ఇక్కడ దర్శనం క్యూలో ఉన్నంత సేపు పక్కనే ఉన్న జ్ఞాపవాపి ని చూడవచ్చు. అందులో ఉన్న నంది విశ్వనాథుడి ఆలయంలో ఉన్న శివలింగానిక అభిముఖంగా ఉంటుంది. కాశీ నగరం ప్రాచీనమైన నివాస ప్రదేశం కావడంతో ఆర్గనైజ్డ్గా ఉండదు. ఒక్క మనిషి మాత్రమే నడవగలిగినంత ఇరుకు రోడ్లుంటాయి. విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ, వారాహి ఆలయాలకు వెళ్లాలంటే ఇరుకు రోడ్ల మధ్య మనం ఊహించనన్ని మలుపులు తిరుగుతూ వెళ్లాలి. తెల్లవారు ఝామున విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఐదున్నరకు గంగానది తీరానికి చేరితే నది నీటిలో ప్రతిబింబించే సూర్యోదయాన్ని ఆస్వాదించవచ్చు. రాత్రి బస కాశీలో కాబట్టి ముందురోజు సాయంత్రం గంగాహారతిని కూడా వీక్షించవచ్చు. కాశీలో టీ దుకాణాల్లో ఉదయం పూట మట్టి ప్రమిదలో తాజా మీగడలో చక్కెర వేసిస్తారు. చాలా రుచిగా ఉంటుంది. ఐదోరోజుఉదయం ఏడు గంటలకు రూమ్ చెక్ అవుట్ చేసి వారణాసి రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రైలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయోధ్యలోని అయోధ్యధామ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి రామజన్మభూమి, హనుమాన్‌గరి చూసిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ కావడం, రాత్రి బస.రాముడు పుట్టిన అయోధ్యరాముడు పుట్టిన ప్రదేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఆలయాన్ని ఆద్యంతం కనువిందు చేస్తుంది. కళ్లు వి΄్పార్చుకుని చూస్తే తప్ప తృప్తి కగలదు. ఆలయ ప్రాంగణం అంతా తిరిగి చూసిన తర్వాత క్యూలో వెళ్లి బాలరాముడిని దర్శించుకున్నప్పుడు భక్తులు తమ ఇంటి బిడ్డను చూసిన అనుభూతిని పొందుతారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత సరయు నదిని తప్పకుండా చూడాలి. సరయు నది గుప్త ఘాట్‌లో మునిగి రాముడు అంతర్థానమయ్యాడని చెబుతారు. ఇక్కడి కనకభవన్ భారీ నిర్మాణం కాదు కానీ ప్రాచీన కాలం నాటి నిర్మాణశైలి గొప్పగా ఉంటుంది. రాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన త్రేతా కీ ఠాకూర్ ప్రదేశాన్ని, సీత వంటగది, దశరథ్ భవన్లను చూడడం మరువద్దు. హనుమాన్ గరి నుంచి చూస్తే అయోధ్య నగరం మొత్తం కనిపిస్తుంది. ఆరోరోజు..ఉదయం హోటల్ గది చెక్ అవుట్ చేసి రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. ఏడు గంటలకు రైలు బాలామావ్ వైపు సాగి΄ోతుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాలామావ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి ఆ రోజంతా నైమిశారణ్య సందర్శనం. చక్రతీర్థ, హనుమాన్ టెంపుల్, వ్యాసగద్ది చూసుకుని తిరిగి రైల్వేస్టేషన్‌కి వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి పదకొండు గంటలకు బాలామావ్ నుంచి ప్రయాగ్‌రాజ్ వైపు సాగిపోతుంది.పురాణాల పుట్టిల్లునైమిశారణ్యం అంటే మన పురాణాల్లో కనిపిస్తుంటుంది. దాదాపు ప్రతి పురాణమూ శుక మహర్షి నైమిశారణ్యంలో సనకసనందాది మునులతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు అనే ఉపోద్ఘాతంతో మొదలవుతుంది. ఇక్కడి ప్రధాన పర్యాటక ప్రదేశం నైమిశనాథ్ విష్ణు టెంపుల్. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఉంది. వైష్ణవ అళ్వారులు చెప్పిన 108 దివ్యదేశాలలో ఇదొకటి. ఈ ఆలయ నిర్మాణం దక్షిణాది ఆలయ నిర్మాణశైలిలో ఉంటుంది. లోపలి మందిరం, గర్భాలయం మాత్రం ఉత్తరాది నిర్మాణశైలిలో ఉంటుంది. మూడు గర్భాలయాలుంటాయి. అందులో ఒకటి విష్ణువు, ఒకటి లక్ష్మీదేవి కోసం ఉండగా మరొకటి రామానుజాచార్యుల గర్భాలయం. దేవీదేవతలతోపాటు సమాజానికి సమానత్వం, ఆధ్యాత్మికత మార్గదర్శనం చేసిన గురువుకి కూడా స్థానం లభించడం గుర్తించాల్సిన విషయం. ఆలయం ఆవరణలోని చక్రతీర్థాన్ని పుణ్యతీర్థంగా భావిస్తారు. గోమతి నది స్నానం చేయవచ్చు. ఆదిశంకరాచార్యుడు, మహర్షి సూరదాసు కూడా ఇక్కడ స్నానమాచరించి చక్రతీర్థాన్ని దర్శించుకున్నారని చెబుతారు. ఇక ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం వ్యాసగద్ది. వేదవ్యాసుడు ఇక్కడ నివసించిన సమయంలో ఇక్కడ ఉన్న మర్రిచెట్టు కింద ఉన్న రాయి మీద కూర్చునేవాడని నమ్ముతారు. వ్యాసుని గౌరవార్థం ఆ ప్రదేశంలో చిన్న నిర్మాణం చేశారు. ఈ మర్రిచెట్టు ఐదువేల ఏళ్ల నాటిది.ఏడో రోజుఉదయం ఏడు గంటలకు ప్రయాగ సంగమం చేరుతుంది. హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం రిఫ్రెష్మెంట్ తర్వాత త్రివేణి సంగమానికి చేరాలి. నదిలో విహారం, స్నానమాచరించడం, నీటిని బాటిళ్లలో పట్టుకోవడం, ఇతర క్రతువులు పూర్తి చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న హనుమాన్ మందిర్, ఆదిశంకరాచార్య విమానమంటపాలకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం తరవాత రోడ్డు మార్గాన శృంగ్వేర్పూర్కు వెళ్లాలి. ఇది ప్రయాగ్‌రాజ్ నుంచి 40 కి.మీ.ల దూరాన ఉంది. ఓ గంట ప్రయాణం. ఆ దర్శనం పూర్తి చేసుకుని తిరిగి ప్రయాగ్‌రాజ్‌కి వచ్చి రైలెక్కాలి. రాత్రి ఏడున్నరకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.అరణ్యవాసానికి దారిశృంగ్వేర్పూర్ పెద్దగా ప్రచారం సంతరించుకోని యాత్రాస్థలం. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంది. రామలక్ష్మణులు సీతాదేవి అయోధ్య నుంచి అరణ్యవాసం వెళ్లేటప్పుడు గంగానదిని దాటింది ఇక్కడేనని చెబుతారు. ఈ ప్రదేశాన్ని పాలిస్తున్న నిషధరాజు మత్స్యకారుడు. అతడు రామలక్ష్మణసీతాదేవికి తన రాజ్యంలో ఆతిథ్యమిచ్చి మరుసటి రోజు పడవ ఎక్కించి సాగనంపాడు. ఇది ఇలా ఉంటే ఈ ప్రదేశానికి ఈ పేరు శృంగి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకోవడం వల్ల వచ్చింది. ఇతిహాస కథనం ఇలా ఉంటే చారిత్రక ఆధారాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. పురాతన శృంగ్వేర్పూర్ నిర్మాణాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ ప్రదేశం అయోధ్య నగరానికి 170 కిమీల దూరాన ఉంది.ప్యాకేజ్ వివరాలుగంగారామాయణ పుణ్యక్షేత్ర యాత్ర (ఎస్‌సీజెడ్‌బీజీ44). భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్యాకేజ్‌లో ఇది (గంగారామాయణ పుణ్యక్షేత్ర యాత్ర) తొమ్మిది రోజుల యాత్ర. ఈ టూర్లో వారణాసి, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్‌రాజ్, శృంగ్వేర్పూర్ క్షేత్రాలు కవర్ అవుతాయి. టికెట్ ధరలు కంఫర్ట్ కేటగిరీ (సెకండ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 35 వేల రూపాయలు, స్టాండర్డ్ కేటగిరీ (థర్డ్ ఏసీ)లో 26,500, ఎకానమీ కేటగిరీ (స్లీపర్ క్లాస్)లో 16,200 రూపాయలవుతుంది. ఈ ప్యాకేజ్‌లో ట్విన్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ అవకాశం లేదు.కంఫర్ట్ కేటగిరీకి ఏసీ హోటల్ గది, లోకల్ జర్నీకి ఏసీ వాహనాలు. స్టాండర్ట్ కేటగిరీకి ఏసీ గదులు, నాన్ ఏసీ వాహనాలు. ఎకానమీకి నాన్ ఏసీ గదులు, నాన్ఏసీ వాహనాలలో ప్రయాణం. అన్ని రోజులూ ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న, రాత్రి శాకాహార భోజనాలు ఉంటాయి.ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్, ట్రైన్లో సెక్యూరిటీ ఉంటుంది. పర్యాటకులకు అవసరమైన సర్వీసుల సహాయం ఏర్పాటు చేయడం కోసం టూర్ మేనేజర్ ఆద్యంతం ప్రయాణిస్తారు. పైన చెప్పుకున్నవన్నీ ప్యాకేజ్ ధరలో వర్తిస్తాయి. ఇక ఇప్పుడు చెప్పుకునేవి ఆ ధరలో వర్తించవు. బోటు విహారం, స్పోర్ట్స్, పర్యాటకప్రదేశాల ఎంట్రీ టికెట్లు, ప్యాకేజ్‌లో ఇచ్చిన భోజనం కాకుండా వేరే ఆర్డర్ చేసుకుంటే ఆ ఖర్చులు, ప్యాకేజ్‌లో లేని ఇతర పానీయాలు తీసుకున్నా విడిగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం.https://www.irctctourism.com/pacakage_description?package– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే.. ) -
ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర
ఇది తొమ్మిది రోజుల యాత్ర... దక్షిణాదిలో దివ్యమైన యాత్ర. మూడు కడలి తీరాలను చూద్దాం... తొమ్మిది ప్రదేశాలను వీక్షిద్దాం. అరుణాచలం... శ్రీరంగం... మధురై... కన్యాకుమారి... రామేశ్వరం..కోవళమ్... త్రివేండ్రమ్... తంజావూరులతో తీర్థయాత్ర పరిపూర్ణం.దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ (ఎస్‌సీజెడ్‌బీజీ42). ఇది 9 రోజులు ప్యాకేజ్. సికింద్రాబాద్‌లో మొదలై సికింద్రాబాద్‌కి చేరడంతో పూర్తయ్యే ఈ ప్యాకేజ్‌లో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రమ్, తంజావూరు కవర్ అవుతాయి. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో మే నెల 22వ తేదీన టూర్ మొదలవుతుంది.తొలిరోజు తిరు యాత్ర షురూ!మధ్యాహ్నం పన్నెండు గంటలకు సికింద్రాబాద్‌లో మొదలైన ప్రయాణం రెండవ రోజు ఉదయం ఏడున్నరకు తిరువణ్ణామలైకి చేరుతుంది. ఈ మధ్యలో భోన్గిర్, జన్‌గాన్, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణం సాగుతుంది. ఈ ప్యాకేజ్‌లో బుక్ చేసుకున్న వాళ్లు సికింద్రాబాద్‌లోనే రైలెక్కాల్సిన తప్పనిసరి ఏమీ ఉండదు. ఈ రైలు ఆగే ఈ జాబితాలో ఎవరికి వారు తమకు సౌకర్యంగా ఉన్న స్టేషన్లో జాయిన్ కావచ్చు. అలాగే పర్యటన పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ తమకు అనువైన చోట దిగవచ్చు. అయితే మధ్యలో ఎక్కినా, దిగినా టికెట్ ధరలో కన్సెషన్ ఉండదు. సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్‌కి బుక్ చేసుకోవాల్సిందే.రెండోరోజు తొమ్మిది గోపురాల తిరువణ్ణామలైతిరువణ్ణామలై స్టేషన్లో దిగిన తర్వాత హోటల్ రూమ్‌లో చెక్ ఇన్ కావడం. రిఫ్రెష్మెంట్ తర్వాత అరుణాచలం ఆలయ దర్శనం. ఇతర దర్శనాలు పూర్తయిన భోజనం చేసుకుని స్టేషన్‌కి వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి పదింటికి బయలుదేరుతుంది. తిరువణ్ణామలై ఆలయంలోని దేవుడు అరుణాచలేశ్వరుడు కావడంతో దీనిని అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని పాతిక ఎకరాల్లో నిర్మించారు. బయటి ప్రహరీ గోడకు నాలుగు ప్రాకారాలు, లోపల మరో ప్రహరీ కి నాలుగు ప్రాకారాలతోపాటు గర్భాలయగోపురం మొత్తం తొమ్మిది గోపురాల ఆలయం ఇది. గణపతి మందిరం దగ్గర నేల మీద వలయాకారంలో పెయింట్ చేసి ఉంటుంది. ఆ వలయంలో నిలబడి చూస్తే తొమ్మిది గోపురాలనూ చూడవచ్చు. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే గిరి ప్రదక్షిణ చేసే అరుణాచలం కొండ చుట్టూ ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాల అష్ట లింగాల ఆలయాలుంటాయి. ఇక్కడ రమణమహర్షి ఆశ్రమాన్ని కూడా తప్పకుండా చూడాలి. అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షణ చేయాలనుకునే వారు చేయవచ్చు. కాలి నడకన చేయలేని వారి కోసం ఆటోలు ఉంటాయి. గిరి ప్రదక్షణలో భాగంగా అష్ట లింగాల ఆలయాల దగ్గర ఆపుతారు. వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణాన్ని కొనసాగించాలి.మూడో రోజు రాముడు కొలిచిన శివుడు (రామేశ్వరం)ఉదయం ఆరున్నరకు రైలు కుదాల్నగర్ చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన రామేశ్వరానికి చేరి అక్కడ హోటల్లో చెక్ ఇన్. రిఫ్రెష్మెంట్ తర్వాత స్థానికంగా ఉన్న ఆలయాలు, ఇతర పర్యాటక ప్రదేశాలను చూసుకోవాలి. రాత్రి బస రామేశ్వరంలోనే.రామేశ్వరం మనదేశ భూభాగానికి దూరంగా బంగాళాఖాతం– హిందూమహాసముద్రం మధ్యలో ఉన్న దీవి. రామాయణం ప్రకారం రాముడు... రావణాసురుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి శివలింగాన్ని స్థాపించి పూజించాలనుకున్నాడు. హిమాలయాల నుంచి శివలింగాన్ని తీసుకురావలసిందిగా హనుమంతుడిని ఆదేశిస్తాడు. హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడం ఆలస్యం కావడంతో విశేషఘడియలు ముగిసేలోపు రాముడు సముద్రపు ఇసుకతో లింగాన్ని చేసి ప్రతిష్ఠించాడు. రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ శివుడికి రామేశ్వరుడనే పేరు వచ్చింది. పన్నెండు జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి. రామేశ్వరం అనే పేరుకు ముందు ఆ దీవి పేరు పంబన్. రామేశ్వరానికి – భారత్ ప్రధాన భూభాగానికి మధ్య నిర్మించిన వంతెనకు పంబన్ బ్రిడ్జి అని పేరు పెట్టారు. పంబన్ బ్రిడ్జి మీద రామేశ్వరానికి చేరతాం. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 18 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉంది.నాలుగో రోజు కనువిందైన మధురైమధ్యాహ్నం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్‌లో వెళ్లాలి. సాయంత్రానికి మధురై చేరడం, మీనాక్షి దర్శనం, షాపింగ్ చేసుకుని బస్‌లో కుదాల్నగర్ స్టేషన్‌కి చేరాలి. రాత్రి పదకొండున్నరకు రైలు కదులుతుంది. కన్యాకుమారి వైపు సాగిపోవాలి.మధుర మీనాక్షి ఆలయాన్ని చూసిన తర్వాత ఎవరికైనా కలిగే ఫీలింగ్ ఒక్కటే. ఈ ఆలయాన్ని చూడక΄ోయి ఉంటే జీవితంలో గొప్ప సంతోషాన్ని మిస్ అయ్యేవాళ్లం... అనే గొప్ప అనుభూతి అది. మీనాక్షీ సుందరేశ్వర ఆలయం వైష్ణవం– శైవాల మధ్య మైత్రిబంధానికి ప్రతీక. వధువు మీనాక్షి అమ్మవారి చేతిని శివుడి చేతిలో పెడుతున్నది స్వయానా విష్ణుమూర్తి. మధురై ఆలయంలోకి కెమెరాలు, సెల్ఫోన్లను అనుమతించరు. కంటి నిండా చూసి మదినిండా గుర్తుంచుకోవాల్సిందే. మీనాక్షి– సుందరేశ్వరుల వివాహాన్ని విష్ణుమూర్తి తన చేతుల మీదుగా జరిపిస్తున్న శిల్పాన్ని చూడడం మరిచిపోవద్దు. వైష్ణవం– శైవ మతాల మధ్య సోదరబంధాన్ని తెలియచేసే శిల్పం అది. సున్నితమైన ఆభరణాలను సునిశితంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి సలామ్ అనాల్సిందే.ఐదో రోజు మూడు సముద్రాల కలయికఉదయం ఎనిమిది గంటలకు రైలు కన్యాకుమారికి చేరుతుంది. రూమ్‌కి వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత బయలుదేరి వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ చూసుకుని రాత్రికి గదికి చేరాలి. రాత్రి బస కన్యాకుమారిలో. మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటాం. మూడు సముద్రాలు కలుస్తున్న ప్రదేశాన్ని ఏమనాలి? మూడు కడలుల సంగమం అంటే ముక్కడలి తీరం అందామా! చిరు అలలతో సొగసుగా కదిలే అరబిక్కడలి అందాన్ని మాత్రమే కాదు, ఉవ్వెత్తున ఎగిసిపడే బంగాళాఖాతం దుడుకుతనాన్ని చూస్తూ, ధీరగంభీరంగా ఉండే హిందూ మహాసముద్రం నీటితో పాదాలను అభిషేకించుకుందాం. కన్యాకుమారి అంటే ప్రకృతి ప్రేమికులకు గుర్తొచ్చేది మూడు సముద్రాల మీద సూర్యోదయం, సూర్యాస్తమయం. వీటితోపాటు తమిళ కవి వళ్లువార్ విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్‌ని కూడా చూడాలి. అలాగే 2004, డిసెంబర్ 26వ తేదీ చేదు జ్ఞాపకానికి స్మారక స్థూపం సునామీ మెమోరియల్‌ని చూడడం మర్చిపోకూడదు.ఆరో రోజు సంపన్న దేవుడు పద్మనాభుడుఉదయం హోటల్ గది చెక్ అవుట్ చేసి కన్యాకుమారి రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రైలు తొమ్మిది గంటలకు కొచ్చువెలి వైపు వెళ్తుంది. పన్నెండన్నరకు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన త్రివేండ్రమ్‌కు వెళ్లాలి. పద్మనాభ స్వామి దర్శనం, కోవళం బీచ్ విహారం తర్వాత తిరిగి రైల్వే స్టేషన్‌కు చేరి అదే రైలెక్కాలి. రాత్రి తొమ్మిదిన్నరకు రైలు తిరుచ్చికి బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.తిరువనంతపురం దేవుడు అనంత పద్మనాభుడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడు. ట్రావెన్కోర్ రాజవంశం నిర్వహణలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం బంగారుమయం. 108 దివ్యదేశాల్లో ఇదొకటి. ఇది కేరళ– తమిళ వాస్తుశైలి సమ్మేళనం. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే డ్రెస్‌కోడ్‌ను అనుసరించాలి. భారత సంప్రదాయ వస్త్రధారణలో ఉండాలి. ఏడో రోజు యునెస్కో రంగనాథుడు... బృహదీశ్వరుడుతెల్లవారుజామున ఐదింటికి తిరుచ్చిలో రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్. రిఫ్రెష్మెంట్ తర్వాత శ్రీరంగం ఆలయ దర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత తంజావూరు (60 కిమీలు). బృహదీశ్వరాలయ దర్శనంతో పర్యటన పూర్తవుతుంది. ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటలకు తిరుగుప్రయాణం మొదలవుతుంది.శ్రీరంగం అంటే చాలా మంది కావేరీ తీరాన ఉన్న పట్టణం అనే అభి్ర΄ాయంలో ఉంటారు. కానీ ఇది కావేరీ నదికి దాని ఉప నది కొల్లిదమ్ నదికి మధ్యనున్న ద్వీపం. తిరుచిరా పల్లికి సమీపంలోని ఈ దీవిలో ఉన్న రంగనాథ ఆలయం పేరుతో ఈ దీవికి శ్రీరంగం అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ వైష్ణవాలయం కూడా 108 దివ్యదేశాల్లో ఒకటి. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సైట్ కూడా. ఈ ఆలయంలో 21 ఎత్తైన గోపురాలున్నాయి. ప్రపంచంలో ఆంగ్‌కోర్‌వాట్ తర్వాత అత్యంత పెద్ద హిందూ ఆలయాల్లో ఇదొకటి.ఎనిమిదో రోజు దక్షిణాది కృష్ణుడుతంజావూరులో ఉన్న ఆలయాలన్నింటిలోకి పెద్ద ఆలయం బృహదీశ్వరాలయం. వెయ్యేళ్ల నాటి ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి మొదటి రాజరాజ కట్టించాడు. రాజ్యంలో రాజకీయ సంక్షోభం, సంక్లిష్టతలు ఎదురైనప్పుడు కళలకు ప్రీధాన్యం తగ్గి΄ోతుందనడానికి నిదర్శనం కూడా ఈ ఆలయాన్ని చెప్పవచ్చు. శిఖరం ఎత్తు 216 అడుగులు. శివలింగం 29అడుగులు. నంది కూడా పెద్దదే. ఈ నిర్మాణంలోని ప్రతి అంగుళమూ చోళుల కళాభిరుచికి అద్దం పడుతుంది. ఆలయనిర్మాణం పూర్తయ్యే సమయానికి యుద్ధం వచ్చింది. కొత్తగా నిధుల కేటాయింపు తగ్గి΄ోయింది. ఉన్న డబ్బుతో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. దాంతో ప్రవేశ గోపురం ఎత్తును ముందు అనుకున్నట్లు ఆలయగోపురానికి దీటుగా నిర్మించలేక΄ోయారు. ఈ గోపురం కింది భాగం విశాలంగా ఉంటుంది, గోపురం ఎత్తు తక్కువగా ఉంటుంది. ఖర్చు, సమయం దృష్ట్యా ఎత్తు తగ్గించి రాజీ పడ్డారు. కానీ చేసిన పనిలో శిల్పనైపుణ్యంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆలయంలోపల ఉన్న చిత్రకళ నాయకరాజుల అభిరుచికి నిదర్శనం. ఆలయం పై కప్పుకు రాగి ఆకులో కృష్ణుడి చిత్రం ఉంది. దానిని బాగా పరిశీలించి చూడండి. ఆ కృష్ణుడి ముఖంలో దక్షిణాది పోలికలు ముఖ్యంగా తమిళుల ముఖకవళికలు కనిపిస్తాయి. ఎత్తులో పై కప్పుకు ఉన్న చిత్రాన్ని పరిశీలించడానికి వీలుకాక΄ోతే ఫొటో తీసుకుని జూమ్ చేసి చూడవచ్చు. ‘గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్’గా గుర్తింపు పొందిన ఆలయం ఇది. యునెస్కో ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ల జాబితాలో చేర్చింది.తొమ్మిదో రోజు..ఇక ఇంటిదారిఉదయం తొమ్మిది గంటలకు రేణిగుంటకు చేరుతుంది. వెళ్లిన క్రమంలోని స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ తొమ్మిదవ రోజు మధ్యాహ్నం రెండున్నరకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. ఎవరికి అనువైన స్టేషన్లో వాళ్లు దిగిపోవడమే. (చదవండి: అనారోగ్య మృతుల్లో... పురుషులే ఎక్కువ! అధ్యయనంలో షాకింగ్ విషయాలు) -
ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక ప్యాకేజ్..! ఏమేమి దర్శించొచ్చంటే..
ఉడుపి శ్రీకృష్ణుడిని చూడాలి. శృంగేరి శారదామాతను దర్శించాలి. కుక్కె సుబ్రహ్మణ్యం... మంగళాదేవి...కుద్రోలి గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయం. కద్రి... ధర్మస్థల మంజునాథులనూ చూడాలి.అన్నింటినీ ఓకే ట్రిప్‌లో చుట్టేయవచ్చు. ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక ప్యాకేజ్ ఉంది. పై వాటితోపాటు మాల్పె... తన్నేర్‌బావి బీచ్‌లు. మినీ గోమఠేశ్వరుడు ఈ టూర్లో బోనస్.మొదటి రోజుఈ రైలు హైదరాబాద్‌లో బయలుదేరి తెలంగాణలో జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, డోన్, గుత్తి, యరగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి కాట్పాడి, జోలార్‌పేట, సేలం జంక్షన్, ఈ రోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్ తర్వాత కేరళలో అడుగుపెట్టి పాలక్కాడ్, షోర్నూర్, తిరూర్, కోళికోద్, వాడకర, తలస్సెరి, కన్నూరు, పయ్యనూర్, కన్హాగాడ్, కాసర్గోడ్ దాటిన తర్వాత కర్నాటకలో ప్రవేశించి మొత్తం 33 గంటలకు పైగా ప్రయాణించి 1532 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ఐదు దక్షిణాది రాష్ట్రాలను చుట్టేస్తుందన్నమాట. ఇది కేవలం మన గమ్యాన్ని చేరే ప్రయాణంగా భావిస్తే మంగళూరు చేరేలోపే బోర్ కొడుతుంది. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, కంటికి కనిపించిన అన్నింటినీ గమనిస్తూ, మనోనేత్రంతో విశ్లేషించుకుంటూ సాగితే ఐదు రాష్ట్రాల వైవిధ్యాన్ని, ప్రజల జీవనశైలిని ఒకే ప్రయాణంలో ఆస్వాదించవచ్చు.రెండోరోజుఉదయం తొమ్మిదన్నరకు మంగళూరుకు చేరుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉడుపికి ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్. శ్రీకృష్ణ ఆలయ దర్శనం, మాల్పే బీచ్ విహారం తర్వాత రాత్రి బస ఉడుపిలోనే. ఉడుపిలోని శ్రీకృష్ణుడిని ద్వైత తత్వాన్ని బోధించిన మధ్వాచార్యుడు స్థాపించాడు. ఈ ఆలయానికి వెళ్లినప్పుడు కళ్లు మూసుకుని స్మరించుకుని వెనక్కి వచ్చేశారంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించాలి. దర్శనం కోసం క్యూలో ఉన్నంత సేపు ఆలయ ప్రాంగణాన్ని, అక్కడి ఆచార సంప్రదాయాలను గమనించాలి. బయటకు వచ్చిన తర్వాత గోపురాన్ని, శిల్పాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వెనుదిరగాలి. ఎందుకంటే ఈ నిర్మాణం ఓ వైవిధ్యం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. శ్రీకృష్ణుడి దర్శనం తర్వాత మాల్పె బీచ్ విహారానికి వెళ్లవచ్చు. దీనిని ఒక అడ్వెంచర్ పార్క్ అని చెప్పాలి. స్టాల్స్‌లో దొరికే కన్నడ చిరుతిళ్లను రుచి చూస్తూ అరేబియా తీరాన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ సమయం గడపవచ్చు. టైమ్ ఉంటే సెయింట్ మేరీ ఐలాండ్‌కు వెళ్లిరావచ్చు. ఉడుపిలో ఉన్న రోజు మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనంలో రకరకాల ఉడుపి రుచులను ఆస్వాదించడం మర్చిపోవద్దు. ఉడుపి హోటళ్లలో శాకాహారంతోపాటు మాంసాహారంలో స్థానిక స్పెషల్ వంటకాలను రుచి చూడాలి. ఎప్పుడూ సందడిగా ఉంటాయి. దేశమంతటా విస్తరించిన ఉడుపి హోటళ్లు ఎప్పుడూ సందడిగా ఉంటాయి. అలాంటిది ఉడుపిలో అసలు సిసలైన ఉడుపి రుచులను అసలే మిస్ కాకూడదు. ఇక్కడ తుళు భాష ఎక్కువగా మాట్లాడతారు. తుళు అంటే... దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగును ప్రశంసించిన కృష్ణదేవరాయల మాతృభాష.మూడోరోజుశృంగగిరి చల్లదనం..శారదామాత వీక్షణంశృంగేరిలోని శారదాపీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో ఒకటి. రామాయణంలోని బాలకాండలో రుష్యశృంగుడి గురించిన ప్రస్తావన ఉంది. ఆ రుష్యశృంగుడు తపస్సు చేసుకున్న కొండ కావడంతో దీనికి శృంగగిరి శృంగేరి అనే పేరు వచ్చింది. ఎండకాలం చల్లగా ఉంటుంది. విద్యాశంకర ఆలయ నిర్మాణ కౌశలాన్ని ఆస్వాదించి, శారదామాత దర్శనంతో ఆశీస్సులు పొందిన తర్వాత ఆది శంకరాచార్యుని ఆలయం, శృంగేరి మఠం చూడాలి. హోటల్ గది చెక్ అవుట్ చేసి శృంగేరి వైపు సాగి΄ోవాలి. శారదాంబ ఆలయ దర్శనం తర్వాత మంగళూరుకు ప్రయాణం. రాత్రి బస మంగళూరులో.నాల్గోరోజునేత్రానందం మంజునాథాలయంధర్మస్థలకు ప్రయాణం, మంజునాథ ఆలయ దర్శనం, ఆ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని సాయంత్రానికి మంగుళూరు చేరాలి. ఆ రాత్రి బస కూడా మంగళూరులోనే. ఇక ధర్మస్థల... నేత్రావతి నది తీరం. ఇక్కడ మంజునాథ ఆలయంతోపాటు మంజూష మ్యూజియాన్ని కూడా చూడాలి. ఇది పరిశోధన గ్రంథాల నిలయం. మాన్యుస్క్రిప్ట్‌లు, పెయింటింగ్‌లున్నాయి. పక్కనే ఒక కొండ మీద 39 అడుగుల గోమఠేశ్వరుడిని చూడాలి. ఇది యాభై ఏళ్ల కిందట చెక్కిన శిల్పం. బాహుబలిగా చెప్పుకునే అసలు గోమఠేశ్వరుడి విగ్రహం కాదిది. అసలు గోమఠేశ్వరుని ప్రతిరూపాలు మరో నాలుగున్నాయి కర్నాటకలో. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వింటేజ్ కార్ మ్యూజియాన్ని కూడా విజిట్ చేయవచ్చు. పరశురాముడి క్షేత్రంకుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం... ఇది కుమారధార నది తీరాన ఉంది. ఐదు వేల ఏళ్ల నాటి ఆలయం. ఇది కార్తికేయుడి ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి పేరుతో పూజలందుకుంటున్నాడు. గరుడుని బారి నుంచి తప్పించుకోవడానికి వాసుకి ఇక్కడకు వచ్చాడని చెబుతారు. పురాణేతిహాసాల ప్రకారం ఈ ప్రదేశం పరశురాముడు స్థాపించిన ఏడు క్షేత్రాల్లో ఇదొకటి.ఐదోరోజుమంగళాదేవి ఆలయం విశాలంగా ఉంటుంది. చక్కటి గోపురం, లోపల నిర్మాణాలకు ఎర్ర పెంకు పై కప్పు, వర్షపునీరు జారి΄ోవడానికి వీలుగా ఏటవాలుగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది. కద్రి మంజునాథ ఆలయ గోపురం ప్రత్యేకమైన వాస్తుశైలిలో ఉంటుంది. ఇక టూర్లో సేదదీరే ప్రదేశం తన్నేర్‌బావి బీచ్. ఇది పర్యటనకు అనువైన ప్రదేశంగా బ్లూ ప్లాగ్ గుర్తింపు పొందిన బీచ్. వీలైతే సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. ఇక చివరగా కుద్రోలి గోకర్ణనాథేశ్వర ఆలయం కొత్తది. రాజులు నిర్మించినది కాదు. కేవలం వందేళ్ల దాటింది. కన్నడ సంప్రదాయ యక్షగాన కళాకారుడు, యుద్ధవిద్య గారడి విన్యాసాలు చేసేవాళ్లు సమూహంగా మారి నిర్మించుకున్నారు. ఆరవ రోజురాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కాచిగూడకు చేరుతుంది. పర్యటన అలసట తీరే వరకు విశ్రాంతి తీసుకున్న తర్వాత టూర్ మొదటి రోజు చూసిన ప్రదేశాల విండో టూర్‌ను మరోసారి ఆస్వాదించవచ్చు.ప్యాకేజ్ ఇలా...ప్యాకేజ్‌లో బస త్రీ స్టార్ హోటల్లో ఉంటుంది. ఏసీ వాహనాల్లో ప్రయాణం. మూడు రోజులు బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. భోజనాలు, ట్రైన్లో కొనుక్కునే తినుబండారాలు, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్ – హార్స్ రైడింగ్ వంటి వినోదాల ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు. ఈ రైలు వారానికొకసారి మాత్రమే ఉంటుంది. ప్రతి మంగళవారం కాచిగూడలో బయలుదేరుతుంది.సింగిల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపు 39 వేలవుతుంది. ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలవుతుంది.డివైన్ కర్నాటక (ఎస్హెచ్ఆర్086). ఇది ఆరు రోజులు ఐదు రాత్రుల టూర్ ప్యాకేజ్. ఇందులో ప్రధానంగా ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడిపి కవర్ అవుతాయి.– వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్ ప్రతినిది (చదవండి: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..! స్పెషాలిటీ ఏంటంటే..) -
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలంటే గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి ఉంటుంది. నిత్యం భక్తుల రద్దీగా ఉండే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలగాలంటే అంత సులభం కాదు. అయితే గంటల కొద్దీ.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా కేవలం ఒక్కరోజులోనే స్వామి దర్శనం చేసుకునేలా ఐఆర్సీటీసీ ‘గోవిందం’ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ‘గోవిందం టూర్’లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేస్తారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నెంబర్ 12734లో సాయంత్రం 5.25 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 6.10గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి నల్గొండకు రాత్రి 7.38 గంటలకు చేరుతుంది. తెలంగాణ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాల మీదుగా ‘గోవిందం టూర్’ రైలు ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి హోటల్‌కు భక్తులు వెళ్లి చెక్ ఇన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరుతారు. ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6.25 గంటలకు ట్రైన్ నెంబర్ 12733 ఎక్కుతారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, అక్కడ నుంచి లింగంపల్లికి ఉదయం 7.35గంటలకు చేరుకుంటుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణీకులకు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఏసీ వాహనంలో రవాణా, హోటల్లో బసతో పాటు, వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం స్పెషల్ ఎంట్రీని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. ఈ టూర్లో బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ తరహా టూర్ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. కేటగిరీ వారిగా ధరలు..సింగిల్ షేరింగ్: 3(ఏసీ): రూ.6790లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.4940లుట్విన్ షేరింగ్3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.3800లుత్రిపుల్ షేరింగ్3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.3800లుపిల్లలకు బెడ్(5 నుంచి 11 ఏళ్లు)3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.2890లు పిల్లలకు బెడ్ లేకుండా3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.2890లు (చదవండి: -
ఇలా చేస్తే ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు! ఖర్చు ఎంతవుతుందో తెలుసా?
IRCTC Entire Train Or Coach Booking In Online: భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు విమానాలను మాత్రమే కాకుండా ట్రైన్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. కుటుంబం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు ముందుగా రిజర్వ్ చేసుకున్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో చోట సీట్లు అలాట్ చేస్తారు. కానీ మీరందరూ కలిసి వెళ్లాలనుకున్నప్పుడు ఒక కోచ్ మొత్తమ్ బుక్ చేసుకోవచ్చు. ఇది 'ఐఆర్సీటీసి'లో ఎలా బుక్ చేసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుక్ చేసుకునే విధానం ఏదైనా టూర్ వెళ్లాలనుకుని ఒక బృందం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు 'పుల్ టారిఫ్ రేట్' అనే బుకింగ్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసు కింద ఒక కోచ్ లేదా మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఒక ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటివి క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం మీరు https://www.ftr.irctc.co.in/ftr/ అనే వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఈ విధంగా మీరు తర్వాత మీరు మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవాలా.. లేదా ఒక కోచ్ మాత్రమే బుక్ చేసుకోవాలా.. అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని అవసరమైన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ పే చేసిన తరువాత మీ బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇందులో మీరు ఏసీ ఫస్ట్ క్లాస్,ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, స్లీపర్ కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం, మీరు ఒక కోచ్ బుక్ చేసుకోవాలనుంటే ముందుగా రూ. 50,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది మీరు ప్రయాణించే దూరం, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకవేళా ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు రూ. 9 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇలాంటి బుకింగ్ కోసం కనీసం 30 రోజులు లేదా 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. -
పర్యాటకులకు శుభవార్త.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పర్యాటకులు, తీర్థయాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ–అరకు–విశాఖ (రైల్ కం రోడ్ ) ఈ టూర్ ప్రతిరోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్లో అరకు వ్యాలీ (ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, ధింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరి అదేరోజు రాత్రి విశాఖపట్నానికి చేరుస్తారు. తిరుమల దర్శన్ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు) ఈ టూర్ ప్రతిశుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి తీసుకువెళ్లి, మళ్లీ అదే రైలులో విశాఖ తీసుకొస్తారు. సదరన్ డివైన్ టెంపుల్ టూర్ (ఫ్లైట్ ప్యాకేజీ) ఈ టూర్ ఆగష్టు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మొత్తం 5రాత్రులు, 6పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో దక్షిణాదిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, త్రివేండ్రం వంటి దర్శనీయ స్థలాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో గానీ, 0891–2500695, 8287932318 నంబర్లలో గానీ సంప్రదించాలని చంద్రమోహన్ సూచించారు. -
ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ టి.మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ స్వదేశ్ దర్శన్‌లో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్సర్ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నెల 27న రేణిగుంట–తిరుపతి నుంచి బయల్దేరే రైలు విజయవాడ, సికింద్రాబాద్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని ఏడు రాత్రులు, 8 పగళ్లు ప్రయాణించి వచ్చే నెల 3న గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. భోజన వసతితో పాటు స్లీపర్ క్లాస్ ప్రయాణ ధర రూ.18,120, థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.22,165గా ఉంటుందన్నారు. వారణాసి, ప్రయాగ సంగమ్, గయ యాత్రకు సెప్టెంబర్ 15న సికింద్రాబాద్ నుంచి మహాలయ పిండ్‌దాన్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 5 రాత్రులు, 6 పగళ్లు స్లీపర్ క్లాస్ ప్రయాణ ధర రూ.14,485, థర్డ్ ఏసీ రూ.18,785గా నిర్ణయించినట్టు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో ప్రయాణికులు రైలు ఎక్కే సౌకర్యం ఉంటుందన్నారు. మరోవైపు విజయ గోవిందం ఎక్స్‌ప్రెస్ పేరుతో తిరుమల, తిరుచానూరుకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నామన్నారు. 2 రాత్రులు, 3 పగళ్లు ప్రయాణ టికెట్ ధర విజయవాడ నుంచి రూ.3,410, రాజమండ్రి–సామర్లకోట నుంచి రూ.3,690 ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఆసక్తి గలవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 8287932312, 9701360675 ఫోన్ నంబర్లు లేదా విజయవాడ రైల్వే స్టేషన్‌లోని కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరారు. పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రత్యేక రైళ్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే నాన్–టెక్నికల్ కేటగిరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రాంతీయ విమాన ప్యాకేజీలు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి ప్రాంతీయ విమాన టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలి పారు. ఈ నెల 27న అల్టిమేట్ ఉత్తరాఖండ్ పేరుతో డెహ్రాడూన్, హరిద్వార్, ముస్సోరి, రుషికేష్ చుట్టివ చ్చేలా రూ.23,635తో ప్రత్యేక ప్యాకేజీ రూపొందించామన్నారు. 29న రాయల్ నేపాల్‌యాత్రలో భాగం గా ఖాట్మండు, పోఖరా ప్రయాణానికి రూ.40 వేల నుంచి టికెట్ ధర ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 12, 14, 19, 21, 26, 28 తేదీల్లో తిరుపతి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమలతో కలిపి రూ.12,260తో విమాన ప్యాకేజీని నిర్వహిస్తున్నట్టు వివరించారు. చదవండి: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. నెల గ్యాప్ తర్వాత రూ.50 పెంపు -
విశాఖపట్నం టూ ఢిల్లీ టూర్.. ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు ఇవే
సాక్షి,విశాఖపట్నం: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు డిప్యూటీ జనరల్మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ తెలిపారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ లోని వీఐపీ లాంజ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరులసమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా యాత్రలకు సంబంధింన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.ఐఆర్సీటీసీ ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలు, ఉత్తర భారతయాత్రలను విజయవంతంగా పూర్తిచేసిందని ఆయన తెలిపారు. రానున్న రెండు నెలల్లో రెండు ప్రత్యేక రైళ్లునడుపుతున్నట్టు ఆయన చెప్పారు. మొత్తం 13 కోచ్‌ల రైళ్లను కేవలం ఈ యాత్రల కోసమే నడుపుతున్నట్లు, రైలుమొత్తం 1300 ఉన్నప్పటికీ కోవిడ్ నేపథ్యంలో కేవలం సగం ఆక్యుపెన్సీతో మాత్రమే ఈ రైళ్లు నడుపుతామన్నారు. ప్రయాణికులకు ప్రతి రోజూ కోవిడ్ కిట్లు అందజేస్తామన్నారు. ఈ రైళ్లలో బయటవారికి ఏ విధమైనఅనుమతి లేకుండా ఈ టూర్ ప్యాకేజిలో ఉన్న వారికి ప్రత్యేక ఐడీ కార్డులు ఇచ్చి వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. ఇటువంటి తీర్థయాత్రలను వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని, దీనికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తక్కువ చార్జీలతోనే సందర్శించే అవకాశం కల్పిస్తుందని సిబ్బంది తెలిపారు. ఈసమావేశంలో స్టేషన్ మేనేజర్ సురేష్, స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ,సిబ్బంది పాల్గొన్నారు. ఈ యాత్రల గురించి మరింత సమాచారం కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో గేట్ నం.1 వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 82879 32318 / 82879 32281 / 7670908300 / 0891 2500695 నంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. ఉత్తర భారత యాత్ర ఈ యాత్ర మొత్తం 10 రాత్రుళ్లు 11 పగళ్లు ఉంటుంది. ఈ యాత్రలో ఆగ్రా, వైష్ణోదేవి, స్వర్ణదేవాలయం, వాఘాసరిహద్దు, మానస దేవి మందిరం, గంగా ఆర్తి, ఎర్రకోట, అక్షర్ధామ్ టెంపుల్, కుతుబ్మీనార్, లోటస్ టెంపుల్,ఇండియా గేట్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈటూర్ ఆగస్టు 27 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 6వతేదీన ముగుస్తుంది. ఈ టూర్లో ప్రయాణించాలనుకునేవారు విజయవాడ లేదా గుంటూరులో రైలెక్కాల్సి ఉంటుంది. స్లీపర్‌క్లాస్–10,400/–, థర్డ్ ఏసీ–17,330/–(ఒక్కొక్కరికి) జీఎస్టీతో కలిపి ఈ టూర్ చార్జీలు ఉంటాయి. మహాలయ పిండదాన్ తర్పణ్ ఈ యాత్ర మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈయాత్రలో వారణాసి, ప్రయాగరాజ్, గయ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమై అక్టోబరు 1వ తేదీతో ముగుస్తుంది.ఈ టూర్లో చేరాలనుకునేవారు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బ్రహ్మపూర్లలో రైలెక్కవచ్చు. ఈ టూర్లో స్లీపర్‌క్లాస్–6620/–, థర్డ్ ఏసీ–11,030/–(ఒకొక్కరికి) జీఎస్టీతో కలిపి చార్జీలు నిర్ణయించారు. ఈ స్పెషల్ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారికి రైలెక్కినది మొదలు దిగే వరకు అన్ని ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. స్లీపర్‌క్లాస్ వారికి హాల్స్, ధర్మశాలలు, డార్మెటరీలలోవసతి కల్పిస్తారు. థర్డ్ ఏసీ వారికి డబులు, లేదా త్రిబుల్ షేరింగ్ హోటల్లో రూంలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం,సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, సైట్ సీయింగ్ అన్నిప్యాకేజీలు పైన నిర్ణయింన ధరలలోనే ఉంటాయన్నారు. -
హైదరాబాద్ నుంచి గోవా టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
పర్యాటకం పంథా మారింది. ఎక్కడికైనా సరే రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేందుకు పర్యాటక ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో పర్యాటకుల అభిరుచి మారింది. గంటలు, రోజుల తరబడి బస్సులు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకొని ఎక్కువ ప్రాంతాలను సందర్శించే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. గోవా, కాశ్మీర్, హంపీ తదితర ప్రాంతాలతో పాటు కొత్తగా లద్దాక్, లేహ్, డార్జిలింగ్ వంటి ఇతర ప్రాంతాలపైనా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ఐఆర్సీటీసీ ఎయిర్ప్యాకేజీలను అందజేస్తోంది. సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రియులు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకు విమాన ప్రయాణానికే ఓటేస్తున్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ అనంతరం గత 2 నెలల్లో సుమారు 20 ఎయిర్ ప్యాకేజీలను నిర్వహించినట్లు ఐఆర్సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ నర్సింగ్‌రావు తెలిపారు. కోవిడ్ మొదటి ఉధృతి అనంతరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 38 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. 2019లో హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఏకంగా 175 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వేలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అదే సమయంలో రైల్ టూర్లు, ఉత్తర, దక్షిణాది పర్యాటక రైళ్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇవిగో ఎయిర్‌ప్యాకేజీలు... గోవా టూర్ సెప్టెంబర్ 24న ప్రారంభంకానుంది. విమాన ప్రయాణంతో పాటు రోడ్డు, రవాణా, గోవాలో హోటల్ సదుపాయం, తదితర అన్ని ఏర్పాట్లు ఐఆర్సీటీసీ అందజేస్తుంది. ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ గోవాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ (మూడు రాత్రులు..నాలుగు పగళ్లు)ఒక్కరికి ర.15,780 చొప్పున ఉంటుంది. ♦ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పర్యటన ప్యాకేజీ(ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) విలువ ర.23,150. అక్టోబర్ 1వ తేదీన ఈ పర్యటన మొదలవుతుంది. అహ్మదాబాద్, ద్వారక, సోమ్‌నాథ్ ఆలయాలతో పాటు సర్ధార్ వల్లభ్‌బాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించవచ్చు. ♦ హౌస్‌బోట్ సదుపాయంతో కూడిన కశ్మీర్ పర్యటన సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో( ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గావ్, సోన్మార్గ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ ప్యాకేజీ రూ.24.480 చొప్పున ఉంటుంది. ♦ రాయల్ రాజస్థాన్ యాత్ర (ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. జైపూర్, జోథ్‌పూర్, పుష్కర్, ఉదయ్‌పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ర.23,900 చొప్పున ఈ పర్యటన ప్యాకేజీ ఉంటుంది. ఉత్తరభారత యాత్ర... ♦ ట్రైన్లో వెళ్లే పర్యాటకుల కోసం ఉత్తర భారత యాత్ర, వారణాసి–గయ–ప్రయాగ్‌రాజ్, దక్షిణభారత యాత్ర రైళ్లను సిద్ధం చేసింది. ఉత్తర భారత యాత్ర, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, హరిద్వార్, దిల్లీ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఒక్కొక్కరికి అన్ని సదుపాయాలతో ర.10,400 చొప్పున ఉంటుంది. ♦ దక్షిణభారత యాత్ర అక్టోబర్ 19న ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుచురాపల్లి, తంజావూరు,రామేశ్వరం, మధురై, కన్యాకువరి, మహాబలిపురం, కాంచీపురం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీ రూ.6,620 చొప్పున ఉంటుంది. -
ఐఆర్సీటీసీ.. ఇక లోకల్ టూర్స్
ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ పర్యటనలనునిర్వహించే ఐఆర్సీటీసీ కోవిడ్ దెబ్బకు కుదేల్ అయింది.లాక్డౌన్ కారణంగా ఐఆర్సీటీసీ ప్యాకేజీలు పూర్తీగా రద్దయ్యాయి. ప్రస్తుతం నిబంధనలను సడలించడంతో స్థానిక పర్యటనలపై అధికారులు దృష్టి సారించారు. సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్థానిక పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు త్వరలో ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సైట్ సీయింగ్‌తోపాటు, భద్రాచలం, శ్రీశైలం, విశాఖ, తిరుపతి వంటి పర్యటనలకే పరిమితం కానున్నారు. సాధారణంగా ఐఆర్సీటీసీ దేశీయ పర్యటనల కోసం రైళ్లను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో పర్యటన వారం నుంచి 15 రోజుల వరకు కూడా కొనసాగుతుంది. అయితే కోవిడ్ దృష్ట్యా రోడ్డు మార్గంలోనే పర్యటనలు ఏర్పాటు చేయనున్నారు. 30 మంది ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సుల్లో 20 మంది టూరిస్టుల చొప్పున తీసుకెళ్లనున్నట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టిన వెంటనే పర్యాటక ప్యాకేజీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా స్థానిక పర్యటనలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థతో పాటు ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. కోవిడ్ ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఆర్సీటీసీ సైతం లోకల్ టూర్ రంగంలోకి ప్రవేశించడం గమనార్హం. ప్రజల అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా పర్యటనలను రూపొందించి నిర్వహించేందుకు అధికారులు వ్యూహరచన చేస్తున్నారు. 50 ప్యాకేజీలు రద్దు... వేసవి సెలవుల్లో నగరవాసులు పెద్ద ఎత్తున జాతీయ అంతర్జాతీయ పర్యటనలకు వెళ్తారు. ఊటీ, సిమ్లా, కులుమనాలి, గోవా, జమ్ము కశ్మీర్, న్యూఢిల్లీ, ఆగ్రా, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిర్వహించే సుమారు 50కి పైగా ప్యాకేజీలు రద్దు కావడంతో 10 వేల మందికి పైగా తమ పర్యటనలను ఉపసంహరించుకున్నారు. జాతీయ పర్యటనలతోపాటు చైనా, శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, నేపాల్ తదితర దేశాలకు సైతం వేసవిలో నిర్వహించే పర్యటనలను ఐఆర్సీటీసీ ఈ ఏడాది రద్దు చేసింది. సుమారు రూ. 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ కారణంగా అంతర్జాతీయ, జాతీయ పర్యటనల స్థానంలో స్థానిక పర్యటనలపైన అధికారులు తాజాగా దృష్టి సారించడం గమనార్హం. -
తిరుపతి, శ్రీనగర్లకు ఐఆర్సీటీసీ ఫ్లయిట్ ప్యాకేజీలు
హైదరాబాద్ : పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా విమాన సర్వీసులను ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఆ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీనగర్లకు వెళ్లే పర్యాటకుల కోసం తాజాగా రెండు ఫ్లయిట్ ప్యాకేజీలను ఆ సంస్థ గురువారం ప్రకటించింది. తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని శీఘ్రదర్శనం ప్యాకేజీలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో తీసుకెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించే సదుపాయం కల్పిస్తారని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు నెలలో రెండు దఫాలుగా అంటే 6, 27వ తేదీల్లో ఈ పర్యటన ఉంటుందని తెలిపింది. ఈ పర్యటన చార్జీ రూ.9,152 గా నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా కాణిపాకం దేవాలయం, శ్రీనివాస మండపం, తిరుమల హిల్స్, శ్రీ వెంకటేశ్వర శీఘ్రదర్శనం ఉంటాయని చెప్పింది. ఈ పర్యటనలో హైదరాబాద్- తిరుపతి- హైదరాబాద్ విమాన సదుపాయంతో పాటు, ఒక రాత్రి ఏసీ హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తదితర సదుపాయాలన్నీ ఉంటాయి. జమ్ము, శ్రీనగర్ పర్యటన... ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండే ఈ పర్యటన హైదరాబాద్ నుంచి ఆగస్టు 13వ తేదీన ప్రారంభమవుతుంది. శ్రీనగర్-గుల్మార్గ్ ,పహల్గామ్, సోన్మార్గ్, తదితర ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతుంది. ఒక గ్రూపులో 15 మంది పర్యాటకులు ఉంటారు. ఈ పర్యటన ప్యాకేజీ రూ.32,442 ఉంటుంది. శ్రీనగర్‌లో హౌస్‌బోట్, దాల్ సరస్సులో బోట్ రైడింగ్, శంకరాచార్య టెంపుల్ దర్శనం, మొఘల్ గార్డెన్స్ సందర్శన తదితర ప్రాంతాలు ఉంటాయి. హోటల్ వసతి, గైడ్, తదితర అన్ని సదుపాయాలతో ఈ ప్యాకేజీని రూపొందించారు. వివరాలు, బుకింగ్ కోసం పర్యాటకులు ఫోన్ : 040-277012407, 040-23800580, 9701360647 నంబర్లను సంప్రదించవచ్చు. -
రైల్వే ‘విదేశీ టూర్'
* మలేసియా, సింగపూర్‌లకు ఐఆర్సీటీసీ ప్యాకేజీలు * హైదరాబాద్, వైజాగ్‌ల నుంచి పర్యటించే సదుపాయం హైదరాబాద్: భారతీయ రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్సీటీసీ) పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీ టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో థాయ్‌లాండ్ పర్యటనతో విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఐఆర్సీటీసీ ఈసారి మలేసియా, సింగపూర్ పర్యటనలకు ప్రణాళికలను సిద్ధం చేసింది. హైదరాబాద్, విశాఖపట్నంల నుంచి ఈ అవకాశాన్ని పర్యాటకులు వినియోగించుకోవచ్చు. సెప్టెం బర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు ఆరు రాత్రులు, ఐదు పగళ్లతో ఈ యాత్ర సాగుతుంది. ఆసక్తిగల వారు వివరాలను ఐఆర్సీటీసీ వద్ద నమోదు చేసుకోవచ్చు. ఈ టూర్లో మలేసియాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాసాక్ అండ్ మ్యూజియం, ట్విన్ టవర్స్, పార్లమెంట్ హౌస్ తదితర ప్రాంతాలు.. సింగపూర్‌లోని నైట్ సఫారి, సిటీ టూర్, లయన్ సిటీ, సివిక్ డిస్ట్రిక్ట్, పడాంగ్, క్రికెట్ క్లబ్, పార్లమెంట్ హౌస్ తదితర ప్రాంతాలను చూడొచ్చు. టూర్ లో భాగంగా పర్యాటకులకు త్రీస్టార్ హోటల్లో వసతి కల్పిస్తారు. ఈ పర్యటనకు హైదరాబాద్ నుంచి వె ళ్లేవారు ఒకరికి రూ.72,040 (డబుల్ఆక్యుపెన్సీ) నుంచి రూ.87,350 (సిం గిల్ ఆక్యుపెన్సీ) వరకు చార్జీలు వసూలు చేస్తారు. పిల్లలకు రూ.57,410 చొప్పున చార్జీ ఉంటుంది. వైజాగ్ నుంచి రూ.72,760 నుంచి రూ.88,070 చార్జీ లుంటాయి. పిల్లలకు రూ.58,126 చార్జీ ఉంటుంది. థాయ్‌లాండ్ పర్యటన.. వచ్చే ఆగస్టు 22 నుంచి 26 వరకు అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండు విడతలుగా సాగే థాయ్‌లాండ్ పర్యటన సదుపాయం హైదరాబాద్ నుంచి మాత్రమే ఉంది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగే ఈ పర్యటనలో బ్యాంకాక్‌లో రెండు రాత్రులు, పట్టాయిలో రెండు రాత్రులు ఉంటారు. టైగర్ జూపార్కు, ఆల్కజార్ షో, కోరల్ ఐలాండ్, నాంగ్చూక్ ట్రాఫికల్ గార్డెన్, జెమ్స్ గ్యాలరీ, వాట్ఫో (బుద్ధ దేవాలయం), మార్బుల్ టెంపుల్ తదితర ప్రాంతాలను ఈ పర్యటనలో చూడొచ్చు. ఈ ప్యాకేజీకి ఒక్కోరికి రూ.43,460 (డబుల్ ఆక్యుపెన్సీ) నుంచి రూ.47,340 (సింగిల్ ఆక్యుపెన్సీ) వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. పిల్లలకు రూ.37,440 చొప్పున చార్జీ ఉంటుంది. ప్రత్యేక రైలు యాత్రలు: ఐదు రాత్రులు, ఆరు పగళ్లపాటు కొనసాగే ప్రత్యేక రైలుయాత్రలో రామేశ్వరం, కన్యాకుమారి, మధురై యాత్రలుంటాయి. జూలై 29న కాచిగూడ నుంచి రైలు బయలుదేరుతుంది. ఆగస్టు 3న తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ పర్యటన చార్జీలను రూ.13,600 (డబుల్ ఆక్యుపెన్సీ), రూ.15,940 (సింగిల్ ఆక్యుపెన్సీ), రూ.13, 160(ట్రిపుల్ ఆక్యుపెన్సీ)గా నిర్ణయించారు. పిల్లలకు రూ.10,880 తీసుకుంటారు. వివరాలకు 040-27702407, 040-27800580 నంబర్ ఫోన్లలో సంప్రదించవచ్చు.