breaking news
iPad battery
-
స్టోర్‌లోనే పేలిన ఐప్యాడ్ బ్యాటరీ
శాన్ఫ్రాన్సిస్కో : స్మార్ట్ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా వాడటం, ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడంతో బ్యాటరీలు హీట్ ఎక్కి పేలడం చూస్తూ ఉన్నాం. కానీ అత్యంత సురక్షితమైన ఆపిల్ ఐప్యాడ్ బ్యాటరీ కూడా పేలిపోయింది. అది కూడా స్టోర్‌లో ఉన్న సమయంలోనే. ఐప్యాడ్ బ్యాటరీ పేలడంతో, ఆపిల్ తన ఆమ్స్టర్డ్యామ్ స్టోర్‌ను తాత్కాలికంగా మూసివేసింది. బ్యాటరీ పేలడంతో హానికరమైన కెమికల్స్ ఉత్పన్నమయ్యాయని ఆపిల్ పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా స్టోర్‌ను మూసివేశామని, ఈ పేలుడుతో స్టోర్‌లోని ముగ్గురు ఉద్యోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఆపిల్ తెలిపింది. ‘హానికరమైన కెమికల్స్ ఎక్కువగా విడుదల కావడంతో, స్టోర్‌ను మూసివేశారు. అగ్నిమాపకదళాలు, ఆ కెమికల్స్‌ను తొలగిస్తున్నారు’ అని 9టూ5మ్యాక్ రిపోర్టు చేసింది. గత కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి సంఘటనలే జరగడంతో, ఐఫోన్ బ్యాటరీల రీప్లేస్మెంట్ ప్రొగ్రామ్‌ను ఆపిల్ చేపట్టింది. ఐఫోన్ బ్యాటరీలతో థెర్మనల్ సంఘటనలు జరగడంతో, స్విట్జర్లాండ్, స్పెయిన్‌లో ఉన్న రెండు స్లోర్లను అంతకముందుకు ఆపిల్ ఖాళీ చేసింది. ఆమ్స్టర్డ్యామ్లో నేడు జరిగిన సంఘటనలో ఉద్యోగులకు అంత పెద్ద గాయాలేమీ కాలేదని, కానీ ఉద్యోగులు స్వల్పంగా గాయ పడినట్టు రిపోర్టు వెల్లడించింది. గత వారం చైనాలో డ్రైవ్ చేస్తున్న కారులో ఐఫోన్ 6 పేలింది. వెహికిల్ లోపల అమర్చిన డ్యాష్ క్యామ్‌లో ఐఫోన్ 6 పేలిన వీడియో రికార్డైంది. ఈ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
షాప్‌లోనే తగలబడిన ఐప్యాడ్ బ్యాటరీ!
హెల్సింకీ: ఏకంగా షాపింగ్ సెంటర్లోనే ఐప్యాడ్ బ్యాటరీ తగలబడటం ఫిన్లాండ్లో కలకలం రేపింది. బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు అంటుకొని.. భారీగా పొగ ఎగజిమ్మడంతో షాప్‌లోని వినియోగదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు. అధికారుల ప్రకారం.. రొవానీమిలోని ఓ ఫోన్ల దుకాణంలో ఈ ఘటన జరిగింది. ఓ వినియోగదారుడు తన ఐప్యాడ్‌లోని బ్యాటరీ మార్చేందుకు దుకాణానికి వచ్చాడు. రెండేళ్ల కిందటి అతని ఐప్యాడ్‌లో బ్యాటరీ మారుస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బ్యాటరీ నుంచి భారీగా పొగ ఎగజిమ్ముకుని షాప్‌లో అలుముకోవడంతో వినియోగదారులు బయటకు పరుగులు తీశారని జిన్హుహ వార్తాసంస్థ తెలిపింది.