breaking news
introduced.
-
తొలిసారి భార్యను పరిచయం చేసి షాకిచ్చిన టాలీవుడ్ హీరో
Naveen Chandra Introduced His Wife On Valentines Day: 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా పరిచయం అయిన నటుడు నవీన్ చంద్ర. ఇటీవలె పరంపర వెబ్‌సిరీస్‌తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం అరవింద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే సినిమాల విషయం కాస్త పక్కన పెడితే నవీన్ చంద్ర ఇంతవరకు తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా ఫిబ్రవరి 14,వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్యను పరిచయం చేసి అందరికి షాకిచ్చారు. 'ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్ ఓర్మా' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు నవీన్ చంద్రకు పెళ్లి ఎప్పుడు అయ్యింది? ఏదైతేనెం శుభాకాంక్షలు అంటూ నవీన్‌కు ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Actor Naveen Chandra (@naveenchandra212) -
టీవీఎస్ మోటార్స్.. అపాచీ 200సీసీ బైక్
చెన్నై: ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ ‘టీవీఎస్ మోటార్స్’ కంపెనీ తాజాగా 200 సీసీ ‘అపాచీ ఆర్టీఆర్ 200 4వీ’ బైక్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీనితోపాటు 110 సీసీ ‘విక్టర్’ బైక్‌ను కూడా మార్కెట్లో తిరిగి ప్రవేశపెట్టింది. కార్బొరేటర్, ఏబీఎస్ అనే రెండు వేరియంట్లలో లభ్యంకానున్న ‘అపాచీ ఆర్టీఆర్ 200 4వీ’ బైక్ ధరలు వరుసగా రూ.88,990గా, రూ.1.15 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. ‘అపాచీ ఆర్టీఆర్ 200 4వీ’ బైక్ 3.9 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. కాగా, ‘విక్టర్’బైక్ డ్రమ్, డిస్క్ బ్రేక్ వెర్షన్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. డ్రమ్ బ్రేక్ వెర్షన్ ధర రూ. 49,490గా, డిస్క్ బ్రేక్ వెర్షన్ ధర రూ.51,490గా ఉందని పేర్కొంది. వినియోగదారులకు ఈ బైక్స్ ఫిబ్రవరి నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. టూవీలర్ మార్కెట్ వాటాను, ప్రధానంగా ప్రీమియం విభాగంలో అధిక వాటాను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువ చ్చామని కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తెలిపారు.