breaking news
International Coffee Day
-
జోమాటో, ఫెవీకిక్ల కాఫీ డే సంబరాలు
చాలా మంది కాఫీ ప్రియులు కప్పు కాఫీతో రోజును ప్రారంభిస్తారు. పైగా చాలామంది ఆ రోజు కాఫీ తీసుకోనట్లయితే ఆ రోజంతా వారు ఏదో కోల్పోయినట్లుగా కూడా భావిస్తారు. అంతేకాదు దీనికోసం ప్రత్యేక రోజును ఏర్పాటు చేసి మరీ కాఫీ డే సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో అందరూ ప్రతి ఏటా అక్టోబర్ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే కాఫీ డేని పురస్కరించుకుని జోమాటో, ఫెవికాల్ తమదైన శైలిలో వినియోదారులను ఆకర్షించేలా మార్కెటింగ్ వ్యూహాలతో ఈ వేడుకలను నిర్వహిస్తోంది. (చదవండి: స్పైసీ మ్యాగీ మిర్చి గురూ) ఈ రెండు కంపెనీలు కాఫీ గురించి మాట్లాడే సినిమా సన్నివేశాల చిత్రాలతో పాటు 'కాఫీ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని ఎలా పెనవేస్తుందో' వంటి మనస్సుకు హత్తుకునే సందేశాలతో ట్విట్ చేస్తూ అలరిస్తున్నాయి. జోమాటో గుడ్డు భయ్యా నుంచి కలీన్ భయ్యా వరకు....ఫ్యామిలీ మ్యాన్ శ్రీకాంత్ తివారీ నుంచి కామెడీ హీరో ఉదయ్ శెట్టి వరకు ప్రతి ఒక్కరు కాఫీని ఆస్వాదిస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది. అంతేకాదు ప్రముఖ చిత్రమైన కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో షారుక్(రాహుల్ రాయ్‌చంద్), కాజల్(అంజలి) ఫోటోలుతో పాటు కాఫీ డే, స్మైల్ డే శుభాకాంక్షలంటూ సందేశాన్ని కూడా జోమాటో ట్విట్ చేసింది. సృజనాత్మక అడ్వర్టైస్మెంట్లతో అలరించే ఫెవికాల్ కంపెనీ తన బ్రాండ్ లోగోని రెండు కాఫీ కప్పులోని కాఫీ పై చిత్రించిన ఫోటోతోపాటు 'కాఫీ బలమైన బంధాల కోసం' అనే ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్ ఫిదా అవుతూ రకరకాలు ట్విట్ చేస్తున్నారు. ఏదిఏమైన మంచి వ్యాపార దృక్పథం ఉంటే ఇలాంటి ప్రత్యేక రోజుని వినియోగించుకుని తమదైన తీరులో వినియోగదారులను ఆకర్షించవచ్చు అనేలా మార్కెటింగ్ వ్యూహాలతో దూసుకుపోవచ్చు అన్నట్లుగా ఉంది కదూ. (చదవండి: ఆధార్ తప్పనిసరి కాదు) -
కాఫీ డే: రోజుకి ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
International Coffee Day 2021: మంచి నీటితో పోటీపడుతూ.. మనిషి జీవనంలో టీ, కాఫీలు ఒక భాగంగా మారిపోయాయి. అందుకే వీటి కోసమూ ప్రత్యేకంగా రోజులను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1న(ఇవాళ) అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి.. అదే విధంగా అతిగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడమే ఈరోజు ప్రత్యేకత. అలాగే కాఫీ వర్తకం గురించి చర్చిస్తూనే.. పనిలో పనిగా ‘కాఫీ’ని జీవనోపాధిగా చేసుకునే వాళ్లకు మద్దతు ప్రకటించే రోజు కూడా. ఇంతకీ రోజూ ఎన్ని కప్పుల కాఫీ తాగొచ్చు.. ఏం ఏం ప్రయోజనాలు ఉంటాయి. అతి వల్ల నష్టమేంటో చూద్దాం. ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవరసాయనాలుంటాయి. కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్ వంటివి బాడీని చురుకుగా ఉంచుతాయి. ఒక కప్పు కాఫీ తాగగానే బాడీలో కాస్తంతైనా తేడా కనిపిస్తుంది. అయితే ఇది మనుషులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి హైబీపీ (హైపర్‌టెన్షన్), ఒంట్లో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉండటం (హైపర్‌లిపిడేమియా) ఉన్నాయనుకుందాం. సాధారణ వ్యక్తుల్లో కాఫీ కనబరిచే ప్రభావానికీ, ఆ జబ్బులున్నవాళ్లలో చూపే ప్రభావానికీ తేడాలుంటాయి. అలాగే కాఫీ ఏరకానికి చెందింది, ఎలా తయారు చేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు అది ఫిల్టర్ కాఫీనా? సాధారణ కాఫీనా? అనే అంశం లాంటివన్నమాట. 2015 నుంచి ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కాఫీ డే నిర్వహిస్తూ వస్తోంది. కొన్నిదేశాల్లో ఇది వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నప్పటికీ.. ఎక్కువ దేశాలు మాత్రం అక్టోబర్ 1నే జరుపుతున్నాయి. ఈ కారణం వల్లే అక్టోబర్ 1ని అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా పాటిస్తున్నారు. కాఫీ సుగుణాలివే... © కాఫీలో బోలెడన్ని మంచి గుణాలున్నాయి. © కాఫీని పరిమిత మోతాదుల్లో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్‌ని) నివారిస్తుంది. © కాఫీలోని డైఫినాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. © కాఫీ బాడీని ఉత్తేజితంగా ఉంచుతుంది. © అయితే ఈ బెనిఫిట్స్ కోసం కేవలం రోజుకు రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తీసుకోవాలి. చదవండి: గర్భిణులకు కాఫీ సేఫేనా? కెఫిన్‌తో హెల్త్.. కాఫీలో ఉండే కెఫిన్ అనే ఉత్ప్రేరక పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. మనం కాఫీ తాగి తాగగానే... దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్‌ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే అది సాధారణం కంటే 8 ఎం.ఎం./హెచ్‌జీ ఎక్కువవుతుంది. అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్‌జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత కనీసం గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. © కాఫీలో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. లేకుంటే అవసరం లేని మాత్ర వేసుకుంటే కలిగిన సైడ్ ఎఫెక్ట్ కలిగినట్లే. © కాఫీ.. యాంగ్జైటీ మరింత పెంచుతుంది. కొందరిలో దేహాన్ని వణికేలా కూడా చేస్తుంది. © రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత గ్లకోమా (నీటి కాసులు) కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. కాఫీ.. మూడు కప్పులు మహాఅయితే నాలుగు కప్పులు మించకుండా తాగితేనే దేహానికీ, ఆరోగ్యానికీ మేలని గుర్తుంచుకోండి. ఎలా తాగితే అవి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తాయో తెలుసుకుని, అలా మాత్రమే వాటిని తాగండి. ఆరోగ్యంగా ఉండండి. హ్యాపీ కాఫీ డే టు కాఫీ లవర్స్.