breaking news
Intermediate Practical Tests
-
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో ఫిబ్రవరి 4 నుంచి జరిగిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీ క్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 117 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నామని జిల్లా అధికారులు చెప్పినా రికార్డు స్థారుులో మొత్తం 155 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించడం గమనార్హం. నాలుగు విడతలగా జరిగిన ఈ ప్రాక్టికల్స్‌కు ఎంపీసీ, బైపీసీ, బ్యాక్లాగ్ విద్యార్థులు కలిపి మొత్తం 17506 మంది హాజరుకావాల్సి ఉంది. అయితే 1636 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో తొలి విడతగా 34 కేంద్రాల్లో జరిగిన ప్రాక్టికల్స్‌కు 452 మంది గైర్హాజరు కాగా.. రెండో విడత 33 కేంద్రాల్లో 365 మంది, మూడో విడత 42 కేంద్రాల్లో 581మంది, నాల్గవ, ఆఖరి విడత 46 కేంద్రాల్లో 238 మంది డుమ్మా కొట్టినట్లు అధికారికంగా వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రంగాం ఊపిరిపీల్చుకుంది. నామమాత్రపు తనిఖీలే... ప్రాక్టికల్ పరీక్షలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు బోర్డుతో పాటు జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కానీ నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టేశారు. ఆర్ఐవో పాపారావుతో పాటు హైపవర్ కమిటీ సభ్యులు బొడ్డేపల్లి మల్లేశ్వరరావు, డీఈసీ కమిటీ సభ్యులు ఎస్.ఈశ్వరరావు, ఐ.శంకరరావు, జి.వి.జగన్నాధరావులతో పాటు డీవీఈవో ఆర్.పున్నయ్య కూడా తనిఖీలను నిర్వహించారు. మరో 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, మరోక ప్రత్యేక పరిశీలకుడు సైతం ఆరోపణలున్న కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అందినంత దండుకున్నారు.. ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజ్ ఇస్తుండటంతో పాటు పాత పద్ధతి(నాన్‌జంబ్లింగ్)లోనే ప్రాక్టికల్స్ జరగడంతో శతశాతం మార్కులకు కార్పొరేట్‌తో పాటు ప్రైవేటు కళాశాలలు, ఇటు ప్రభుత్వ కళాశాలలు సైతం వెంపర్లాడాయి. ప్రభుత్వ కళాశాలల సంగతి కాసేపు పక్కనెడితే కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అందినంత దోచేశారు. డిపార్ట్మెంటల్ అధికారులు, ఎగ్జామినర్లుకు భారీగా ఆఫర్లు తీర్చారు. తనిఖీలకొచ్చిన అధికారులకు సైతం జేబులు నింపారు. అందరి సహకరాంతోనే.. ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం గా ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, లోసుగులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాం. హైపవర్, డీఈసీ కమిటీ, సిబ్బంది, ప్రిన్సిపాళ్లు అందరూ సహకరించడంతో విజయవంతంగా పూర్తి చేశామని సాక్షికి చెప్పారు. కాగా మంగళవారం జరిగిన ప్రాక్టికల్స్‌కు ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆయన ధృవీకరించారు. - పాత్రుని పాపారావు,ఆర్ఐవో -
తుది దశకు ప్రాక్టికల్స్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఆఖరి, నాలుగో విడత పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. 46 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నాలుగో విడత ప్రాక్టికల్స్ జరగనున్న 46 కేంద్రాల్లో 13 ప్రేవేటు కాగా 24 ప్రభుత్వ, 7 సోషల్వెల్ఫేర్, మరో రెండు ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా కళాశాలల విద్యార్థుల హాల్‌టిక్కెట్లతోపాటు ప్రశ్నా, జవాబుపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, నామినల్‌రోల్స్‌ను కేంద్రాలకు చేరవేశారు. ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఎక్స్‌ట్రనల్ ఎగ్జామినర్ల నియామక ప్రక్రియ సైతం ముగిసింది. ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్లపై ఆర్ఐఓ పాత్రుని పాపారావు హైపవర్ కమిటీ సభ్యుడు బి.మల్లేశ్వరరావు, డెక్ కమిటీ సభ్యులు ఎస్.ఈశ్వరరావు, ఐ.శంకరరావు, జి.వి.జగన్నాథరావులతో గురువారం సమీక్షించారు. కాగా గురువారం 13 కేంద్రాల్లో మూడో విడతగా జరిగిన ప్రాక్టికల్స్‌కు 407 మందికి 25 మంది విద్యార్థులు గైర్హాజరైట్టు అధికారులు పేర్కొన్నారు.