breaking news
Interest payments
-
పారిశ్రామిక రంగం పరపతి మెరుగుపడుతుంది
న్యూఢిల్లీ: భారత పరిశ్రమల పరపతి డిసెంబర్ త్రైమాసికంలో మెరుగుపడుతుందని, రుణాలపై వడ్డీ చెల్లింపుల కవరేజీ 4.5–5 రెట్లు పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు మెరుగుపడడాన్ని ఇందుకు అనుకూలించే అంశంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) 601 లిస్టెడ్ కంపెనీల (ఫైనాన్షియల్ సరీ్వసులు మినహా) బ్యాలన్స్ షీట్లను విశ్లేíÙంచిన అనంతరం ఇక్రా ఈ వివరాలు వెల్లడించింది. కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3.98 శాతం, అంతకుముందు త్రైమాసికంతో పోల్చిచూస్తే 0.64 శాతం మెరుగుపడినట్టు తెలిపింది. కమోడిటీల ధరలు శాంతించడాన్ని సానుకూలంగా పేర్కొంది. ముడి పదార్థాల ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ ఇవి చారిత్రకంగా చూస్తే, ఇంకా ఎగువ స్థాయిల్లోనే ఉన్నట్టు పేర్కొంది. భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు ఇంకా చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకోవాల్సి ఉందని వివరించింది. -
ప్రభుత్వం చేతికి వొడాఐడియా!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్యాకేజీ ఎఫెక్ట్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 10 విలువలో ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది. ప్రభుత్వ వాటా ఇలా.. ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్‌గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్‌యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది. షేరు భారీ పతనం... ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది. టాటా టెలీలోనూ వాటా.. వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా బాటలో ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం! కాగా.. ఎన్పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్ 14కల్లా డాట్ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు తుదిగా డాట్ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉంది. షేరు జూమ్... ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే. -
‘స్వశక్తి’కి సాధికారత ఏదీ?
-
‘స్వశక్తి’కి సాధికారత ఏదీ?
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏళ్లకేళ్లుగా అందని వడ్డీ సొమ్ము ♦ మూడేళ్లపాటు అరకొర విదిలింపు.. ♦ రెండేళ్ల నుంచి పూర్తిగా నిలిపివేత ♦ పేరుకుపోయిన బకాయిలు రూ.1,280 కోట్లు ♦ నెలనెలా పూర్తి వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకర్లు ♦ పల్లెల్లో కుదేలవుతున్న మహిళా సంఘాలు ♦ వాయిదాలు కట్టడం కోసం అప్పులు చేస్తున్న మహిళలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల (ఎస్‌హెచ్‌జీల)కు సాధికారత కరువవుతోంది.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడాల్సిన సర్కారే వారి ముందరి కాళ్లకు బంధం వేస్తోంది.. బ్యాంకు లింకేజీ కింద రుణం పొందే మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ మాఫీ సొమ్మును విడుదల చేయకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు పూర్తి స్థాయిలో వడ్డీ వసూలు చేస్తుండటంతో గ్రామాల్లో మహిళా సంఘాలు కుదేలవుతున్నాయి. వడ్డీలేని రుణాల పథకం కింద గత ఐదేళ్లలో తొలి మూడేళ్లపాటు అరకొరగా నిధులు విడుదల కాగా.. గత రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.25 లక్షల మహిళా సంఘాలకు సంబంధించి రూ.1,280 కోట్ల మేర వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల స్థితిగతులు, మహిళల సమస్యలపై ‘సాక్షి’ బృందం రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, నల్లగొండ, సంగారెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. పావలా వడ్డీతో.. స్వయం సహాయక మహిళా గ్రూపులు (ఎస్‌హెచ్‌జీలు) ఏర్పడిన తొలినాళ్లలో రుణాలు పొందినవాటిలో 40 శాతం సంఘాలు రుణాలు సరిగా చెల్లించలేదు. కరువు నెలకొనడం, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం, తీసుకున్న రుణాలు పలు వ్యక్తిగత అవసరాలకు ఖర్చు కావడం తదితర కారణాలతో డిఫాల్ట్‌గా మారాయి. దాంతో బ్యాంకులు సరిగా రుణాలివ్వక, ప్రభుత్వ సహాయం అందక ఆ సంఘాలు ఇబ్బందులు పడ్డాయి. అనంతర కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలపై దృష్టి పెట్టి పావలా వడ్డీ పథకాన్ని అమల్లోకి తేవడం, ఉపాధి కల్పనను మెరుగుపర్చడంతో మహిళలకు కొంతమేర ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. దీనికితోడు వ్యవసాయం, అనుబంధ వృత్తులు కలసి రావడంతో ఎస్‌హెచ్‌జీలు నిలదొక్కుకున్నాయి. మరింత మేలు కోసం.. మహిళా స్వయం సహాయక సంఘాలకు మరింతగా సాయం అందించడం, రుణ వితరణ పెంచడం లక్ష్యంగా 2012లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ‘వడ్డీ లేని రుణాలు’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద బ్యాంకు లింకేజీతో రుణాలు తీసుకునే మహిళా సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) రుణాన్ని సకాలంలో వడ్డీతో సహా చెల్లించేస్తే... ప్రభుత్వం తిరిగి ఆ వడ్డీ సొమ్మును సదరు సంఘం ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకంతో రుణాలు తీసుకునే మహిళా సంఘాల సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వడ్డీ లేని రుణాల పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొద్ది మేర నిధులు విడుదల చేసింది. కానీ 2015 తరువాత ఈ పథకానికి పూర్తిగా నిధులు నిలిపేసింది. ఎస్సీ, ఎస్టీ ఎస్‌హెచ్‌జీలకు 2015 జూన్ వరకు.. బీసీ, ఓసీ, మైనారిటీ సంఘాలకు 2015 మే వరకు మాత్రమే వడ్డీ డబ్బులు విడుదలయ్యాయి. వికలాంగ ఎస్‌హెచ్‌జీలకు సెప్టెంబర్ 2015 వరకు వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ చేశారు. ఇలాగైతే కష్టమే? రాష్ట్రవ్యాప్తంగా 4.22 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉన్నాయి. వాటిల్లో 50 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 3.25 లక్షల ఎస్‌హెచ్‌జీల సభ్యులు నెలనెలా క్రమం తప్పకుండా బ్యాంకు రుణ వాయిదాలు తిరిగి చెల్లిస్తున్నారు. ప్రభుత్వం వీరందరికి సంబంధించిన వడ్డీని లెక్కగట్టి తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ చేయాలి. కానీ అలా జరగటం లేదు. వాస్తవానికి ఇప్పుడిప్పుడే బ్యాంకులు మహిళా సంఘాలకు కోరినంత రుణాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ తీరుతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గాలిపల్లిని చూస్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాలిపల్లిని పరిశీలిస్తే.. ఈ గ్రామంలో 58 స్వయం సహాయక సంఘాలుండగా.. వాటిలో 720 మంది సభ్యులున్నారు. మహిళా సంఘాలకు 2012–13, 2013–14 సంవత్సరాల్లో కలిపి రూ.4.50 కోట్లు, 2015–16లో రూ.2.55 కోట్లు కలిపి మొత్తంగా రూ. 7.05 కోట్లు రుణంగా అందింది. మహిళా సంఘాలు ఈ రుణాల అసలు రుణంతోపాటు 11 శాతం వార్షిక వడ్డీ (నెలకు నూటికి 92 పైసలు) చొప్పున.. ఐదేళ్ల కాలానికి రూ. 2.76 కోట్లను బ్యాంకులకు చెల్లించాయి. గ్రామంలో ఒక్క మహిళా సంఘం కూడా రుణం కట్టకుండా ఎగవేయలేదు (డిఫాల్ట్ కాలేదు). అన్ని సంఘాల సభ్యులు 100 శాతం రుణాలు చెల్లిస్తున్నారని ఎస్బీఐ గాలిపల్లి బ్రాంచి మేనేజర్ జి.రాజేంద్రప్రసాద్ కూడా చెప్పారు. అయితే ప్రభుత్వం ఏటా ఈ వడ్డీ సొమ్మును లెక్కగట్టి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. కానీ రెండేళ్ల కిందటి వరకు రూ.98 లక్షలు మాత్రమే ఇచ్చింది. మిగతా రూ.1.78 కోట్ల వడ్డీ సొమ్ము చెల్లించాల్సి ఉంది. దీనిపై శ్రీ ఆంజనేయ మహిళా గ్రూప్ లీడర్ అరుకూటి పద్మను స్పందన కోరగా.. ‘‘సంఘంతో మేం ఆర్థికంగా ఎదిగాం.. నేను చికెన్ దుకాణం నడిపిస్తున్నా. నెల నెలా వాయిదాలు కడుతున్నా. కానీ ఐదేళ్ల నుంచి వడ్డీ డబ్బులు రాకపోవటంతో ఇబ్బంది అవుతోంది..’’అని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ మాత్రమే కాదు.. గ్రామంలోని శివపార్వతి సంఘం లీడర్ అన్నాడి నిర్మల, శివాని సంఘం లీడర్ రేణుక, ప్రియదర్శిని సంఘం లీడర్ బట్టు పద్మ అందరూ తమ ఇబ్బందులను ఏకరువుపెట్టారు. అప్పులు చేసి వాయిదాల చెల్లింపు జోగుళాంబ గద్వాల జిల్లా ఐజా, మానవపాడు, అలంపూర్, సంగారెడ్డి జిల్లా ఝరా సంఘం, మనూరు, నారాయణఖేడ్ మండలాల్లోని గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల్లో రుణం ఎగవేత కాస్త ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో మహిళలు సంఘం రుణ వాయిదా కట్టడానికి నెలకు నూటికి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఇక్కడ బ్యాంకు లింకేజీతో తీసుకున్న రుణాలను గృహ అవసరాలు, వ్యవసాయ అవస రాల కోసం వాడుకున్నారు. ఉపాధి సరిగా లేక తిరిగి కట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. వీరి దుస్థితిని గద్వాల జిల్లాలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యాపారులు, సంగారెడ్డి జిల్లాలో కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. బంగారం లేదా ఇతర వస్తువులు తాకట్టు పెట్టుకొని అడ్డగోలు వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. ఇలా అప్పులు తీసుకుంటున్న మహిళలు అటు బ్యాంకుకు వడ్డీ కట్టడంతోపాటు ఇటు వ్యాపారులకూ వడ్డీ కడుతూ నిండా మునిగి పోతున్నారు. దీనిపై ఐజా పట్టణానికి చెందిన మణె మ్మ అనే మహిళను పలకరిస్తే.. ‘‘మూడేళ్ల కింద రూ.50 వేలు సంఘం అప్పు తీసుకున్న. ఇన్ని డబ్బులు ఇంటి ఖర్చులకు, ఇంకొన్ని వ్యవసాయానికి పెట్టిన. నెలకు రూ.1,500 లెక్కన వాయిదాలు కట్టాలె. ఇప్పుడంటే చేన్లలో పని దొరు కుతోంది. కానీ ఎండాకాలంల పని దొరకక అప్పు తెచ్చి వాయిదాలు కట్టిన..’’అని వాపోయింది. ఇప్పటికైనా చెల్లించాలి మా మండల పరిధిలో 1,002 మహిళా గ్రూపులున్నాయి. 10,912 మంది సభ్యులు ఉన్నారు. అందులో 96 గ్రూపులకు బ్యాంకు నుంచి 2.79 కోట్ల రుణాలు అందాయి. రెండేళ్లుగా సకాలంలో రుణ వాయిదాలు చెల్లించాం. కానీ ఇప్పటికీ వడ్డీ సొమ్ము అందలేదు. నెలల తరబడి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వడ్డీ సొమ్ము చెల్లించాలి. – సునంద, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మిరుదొడ్డి మండలం