breaking news
inter college sports
-
చాంప్ రాజేంద్రనగర్ కాలేజి
ఇంటర్ కాలేజి స్పోర్ట్స్ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అగ్రికల్చరల్ కాలేజి స్పోర్ట్స్ మీట్లో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల సత్తా చాటుకుంది. బాలుర విభాగంలో ఈ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. బాలికల ఈవెంట్లో అశ్వరావు పేట అగ్రికల్చరల్ కాలేజి చాంపియన్‌షిప్ సాధించింది. ఇదే కాలేజికి చెందిన రాజేశ్ అథ్లెటిక్స్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 వ్యవసాయ కాలేజీలకు చెందిన 550 మంది బాలబాలికలు పాల్గొన్నారు. మొత్తం 17 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్ర మానికి వర్సిటీ డీన్ కె.ఎస్. డాంగి, పాలకమండలి సభ్యులు మనోహర్ రావు, సురేందర్ రాజు, అసోసియేట్ డీన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇన్చార్జి ఫిజికల్ డైరెక్టర్ విద్యాసాగర్, శ్యామ్యూల్, మృణాళిని, సుజాత, చేరాలు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి వైవీయూ అంతర్ కళాశాలల పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్లో యోగివేమన యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రీడా పోటీలను గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్ అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్క్రీడా మైదానంలో, టెన్నీస్ జార్జికారొనేషన్ క్లబ్, బ్యాడ్మింటన్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో విద్యార్థులకు పోటీలు జరపనున్నారు. ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో జరగనున్న పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైవీయూ రిజిష్టార్ నజీర్ అహ్మద్ పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బిరెడ్డి తెలిపారు.