breaking news
Infosys Q4 results
-
గణాంకాలు, ఫలితాలు కీలకం
♦ అంబేడ్కర్ జయంతి కారణంగా శుక్రవారం సెలవు ♦ ట్రేడింగ్ నాలుగు రోజులే ♦ ఇన్ఫోసిస్‌తో క్యూ4 ఫలితాల సీజన్ షురూ పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. సిరియాపై అమెరికా క్షిపణి దాడుల అనంతరం చెలరేగే భౌగోళిక–రాజకీయ పరిణామాలు కూడా ఈ వారం స్టాక్‌సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి. తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, గుడ్‌ప్రైడే సందర్భంగా ఈ శుక్రవారం(ఈ నెల 14న) స్టాక్ మార్కెట్‌కు సెలవు. అందుకని ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగనున్నది. కంపెనీల క్యూ4 ఫలితాలు, గణాంకాలు, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ మన మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. గణాంకాలు, ఆర్థిక ఫలితాల ఆధారంగా స్టాక్ సూచీల కదలికలు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అభ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. సిరియాలో భారీ స్థాయిలో ఏమైనా పరిణామాలు చోటు చేసుకుంటే అది అంతర్జాతీయంగా మార్కెట్లపై ప్రభావం చూపుతుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. క్యూ4 ఫలితాలు షురూ.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ గురువారం నాడు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించనున్నది. అదే రోజు బజాజ్ కార్ప్, రిలయన్స్ పవర్ క్యూ4 ఫలితాలు వస్తాయి. మంగళవారం(ఈ నెల11న) రిలయన్స్ డిఫెన్స్, రెప్కో హోమ్‌ఫైనాన్స్ ఫలితాలు, ఇక శుక్రవారం(ఈ నెల 14న) రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా, శనివారం(ఈ నెల 15న) రిలయన్స్ ఇన్ప్రా క్యూ4 ఫలితాలు వస్తాయి. ఇక ఈ నెల 12న(బుధవారం) పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఈ నెల 14న(శుక్రవారం) టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, ఈ నెల 12(బుధవారం) చైనా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఈ నెల 13న(గురువారం) అమెరికా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్(పీపీఐ) గణాంకాలు, ఈ నెల 14న(శుక్రవారం) అమెరికా వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, కోర్ రిటైల్ అమ్మకాల గణాంకాలు, రిటైల్ అమ్మకాల గణాంకాలు వెలువడతాయి. గత వారంలో స్టాక్ సూచీలు లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉండడం ఇది వరుసగా రెండో వారం. సెన్సెక్స్86 పాయింట్లు, నిఫ్టీ 25 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. రూపాయి 56 పైసలు లాభపడి 64.29 వద్ద ముగిసింది. నాలుగు రోజుల్లో రూ.15,877 కోట్లు భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ట్రేడింగ్ జరిగిన నాలుగు రోజుల్లో 245 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం.. ఎఫ్‌పీఐలు ఈ నెల 3–7 మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లో రూ.4,995 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.10,882 కోట్లు చొప్పున మొత్తం మన క్యాపిటల్ మార్కెట్లో రూ.15,877 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందడం, ఈ ఏడాది మార్చిలో భారత తయారీ రంగం ఐదు నెలల గరిష్టానికి పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడడంతో ఈ స్థాయి పెట్టుబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. గత నెలలో వచ్చిన రూ.56,944 కోట్ల విదేశీ పెట్టుబడులకు ఇది కొనసాగింపు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌పీఐలు మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.15,862 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ నాలుగు నెలల కాలానికి రూ.80,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
మ్యాజిక్ రిపీట్ చేసిన విశాల్..
ముంబై: ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సీఈవో విశాల్ సిక్కా తన మ్యాజిక్ ను కంటిన్యూ చేశారు. పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వరుస లాభాలతో సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల చేసిన 2016 త్రైమాసికంలో రూ 3,597 కోట్లు లాభంతో మరోసారి తన సత్తాను చాటుకున్నారు. దీంతోపాటుగా భారీ డివిడెండును ప్రకటించి ఇన్వెస్టర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. 2016 ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ షేరుకు రూ 14.25 ఫైనల్ డివిడెండ్ ను , రూ .5 ముఖ విలువ గల షేరుకుగాను షేర్ హోల్డర్స్ కు 285 శాతం తుది డివిడెండ్ చెల్లించనుంది. జూన్ 20 తేదీకల్లా దీన్ని చెల్లించనున్నారు. దీనికి ముందు, గత ఏడాది అక్టోబర్ లో రూ .10 మధ్యంతర డివిడెండ్ ను ఇచ్చింది. ఈ తాజా ఫలితాల నేపథ్యంలో ఈ షేర్ కు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు.