informal meeting
-
11న మోదీ, జిన్‌పింగ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈనెల 11న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ ఈనెల 11-12 తేదీల్లో చెన్నైను సందర్శిస్తారని ఇరువురు నేతల మధ్య రెండో ముఖాముఖి జరగనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, వాణిజ్య అంశాలతో పాటు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై మోదీ-జిన్‌పింగ్‌లు ఈ భేటీలో చర్చిస్తారని చెప్పారు. ఇది లాంఛనప్రాయ సమావేశంగా సాగనుండటంతో ఎలాంటి ఒప్పందాలు, ఎంఓయూలు ఉండబోవని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైనా అధ్యక్షుడి వెంట ఆ దేశ విదేశాంగ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యులు భారత పర్యటనలో పాల్గొననున్నారు. తమిళనాడులోని మమల్లాపురం పట్టణంలో ఇరు దేశాధినేతల భేటీ జరగనుంది. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య తొలి లాంఛనప్రాయ భేటీ 2018 ఏప్రిల్ 27.28న చైనాలోని వుహన్‌లో జరిగింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంలో జిన్‌పింగ్ పర్యటన కీలక పాత్ర పోషించనుందని సమాచారం. మరోవైపు కశ్మీర్‌పై పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై రాద్ధాంతం చేస్తున్న క్రమంలో చైనా అధ్యక్షుడితో ప్రధాని భేటీ పాక్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. -
ఉత్తర కొరియా వర్సెస్ అమెరికా కొత్త లొల్లి
-
ఉత్తర కొరియా వర్సెస్ అమెరికా కొత్త లొల్లి
వాషింగ్టన్: ఉత్తర కొరియా అమెరికాల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. ఆ రెండు దేశాల మధ్య జరగాల్సిన అనధికారిక చర్చలను అమెరికా అధ్యక్షుడు పరిపాలన వర్గం రద్దు చేసింది. ఇందుకు అమెరికానే కారణం అయింది. చర్చలు జరిపేందుకు రావాల్సిన ఉత్తర కొరియా బృంద వీసాలకు ఆమోదం తెలిపే ప్రక్రియను ఉపసంహరించుకోవడంతో తాజాగా అమెరికాలో ఉత్తర కొరియా అధికార బృందం అడుగుపెట్టలేని పరిస్థితి తలెత్తింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాన్ నామ్ మలేషియాలో హత్యకు గురి అయిన నేపథ్యంలో ఈ టూర్ రద్దయినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా తరుపున అమెరికాలో విదేశీ వ్యవహారాలు చూస్తున్న డైరెక్టర్ చో సన్ హుయి మొత్తం ఆరు గురుమంది సభ్యులతో వచ్చే వారం న్యూయార్క్‌లో అమెరికాలోని మాజీ అధికారులతో సమావేశం జరపాల్సి ఉంది. ఈలోగా వీసాలకు ఆమోదం లభించలేదని, ఇరు దేశాల మధ్య చర్చలు నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయని పేర్కొంటూ ఉత్తర కొరియానుంచి అమెరికాకు బయలుదేరనున్న ఆరుగురు అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా సూచించారు. కిమ్ జాంగ్ నామ్‌పై దాడికి ఉపయోగించిన వీఎక్స్ నెర్వ్ అనే మందు ప్రజాసమూహాన్ని ధ్వంసం చేయగల అతిపెద్ద వినాశిని అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా వీసాలను ఆమోదించకుండా వెనక్కి వెళ్లి సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తుంది.