ఉత్తర కొరియా అమెరికాల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. ఆ రెండు దేశాల మధ్య జరగాల్సిన అనధికారిక చర్చలను అమెరికా అధ్యక్షుడు పరిపాలన వర్గం రద్దు చేసింది. ఇందుకు అమెరికానే కారణం అయింది. చర్చలు జరిపేందుకు రావాల్సిన ఉత్తర కొరియా బృంద వీసాలకు ఆమోదం తెలిపే ప్రక్రియను ఉపసంహరించుకోవడంతో తాజాగా అమెరికాలో ఉత్తర కొరియా అధికార బృందం అడుగుపెట్టలేని పరిస్థితి తలెత్తింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాన్ నామ్ మలేషియాలో హత్యకు గురి అయిన నేపథ్యంలో ఈ టూర్ రద్దయినట్లు తెలుస్తోంది.