breaking news
industry leaders
-
ఆ రోజులు... మాకొద్దు
బాబు పాలనపై జనం ఉలికిపాటు కరువు కరాళ నృత్యం సబ్సిడీల కోత.. చార్జీల వాత.. ఆపై ధరల మోత బతుకుదెరువు కోసం వలసబాట పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల నుంచి పదివేల కుటుంబాలకు పైగా వలస సాక్షి, మచిలీపట్నం : జాబు కావాలంటే బాబు రావాలి.. వ్యవసాయం బాగుండాలంటే బాబు రావాలి.. ఈ మాటలను టీడీపీ నేతలు చెప్పడానికి ఎలా ఉన్నా వింటున్న ప్రజలు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రం చంద్రబాబు పాలనలో తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసింది. సబ్సిడీల కోత, చార్జీల వాత, ధరల మోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఇది చాలదన్నట్టు బాబు ఏ ముహుర్తాన అధికారం చేపట్టారో గానీ వర్షాలు కురవక కరువు నెలకొంది. బాబు తొమ్మిదేళ్ల కాలంలో పల్లెలో ఒక పంట పండటం కూడా కష్టమైంది. తిండి గింజలు దొరక్క, వ్యవసాయం దెబ్బతిని కూలి పనలు లేక ప్రజలు అల్లాడిపోయారు. చివరకు పశువులకు ఎండి గడ్డి దొరకని దయనీయ స్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో చేసేది లేక ప్రజలు పిల్లలను బడి మాన్పించి వేల మంది వలస బాట పట్టారు. హైదరాబాద్, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లి చిరువ్యాపారులు, రోజువారీ కూలీలుగా మారిపోయారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందిన పదివేల కుటుంబాలకు పైగా వలస వెళ్లినట్టు సమాచారం. 1995 నుంచి 2004లోగా రాష్ట్రంలో దుర్బర పరిస్థితులు నెలకొంటే బాబు మాత్రం ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో మెలుగుతూ ప్రజలను ఆదుకోకపోగా సబ్సిడీల్లో కోత విధించారు. కరెంటు చార్జీలు, నిత్యావసర ధరలు భారీగా పెంచేశారు. వీటిని తగ్గించాలని ప్రజలు ఉద్యమించినా ఫలితం లేకపోవడంతో 2004 ఎన్నికల్లో బాబుకు గుణపాఠం నేర్పారు. 2004లో వైఎస్ సువర్ణయుగం ప్రారంభం కావడంతో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాయి. వలస వెళ్లిన కుటుంబాలు మళ్లీ ఊళ్లకు తిరిగొచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్లీ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆల్ ఫ్రీ హామీలు ఇస్తున్నా జనం మాత్రం బాబోయ్ ఆ పాలన తమకొద్దు అంటూ ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. కుటుంబం మొత్తం వలసవెళ్లాం చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో అష్టకష్టాలు అనుభవించాం. ఉపాధి లేక పూటగడవడం కూడా కష్టంగా ఉండేది. పిల్లలను చదువు మాన్పించి కుటుంబం సహా హైదరాబాదుకు వలస పోయాం. మూడేళ్లు అక్కడే చిన్నాచితకా పనులు చేసుకుని జీవించాం. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక మా ప్రాంతంలో మళ్లీ పూర్వపు రోజులు రావడంతో తిరిగి గ్రామానికి వచ్చేశాం. - కమ్మిలి లక్ష్మి, గుడిదిబ్బ, కృత్తివెన్ను మండలం తిండికి అల్లాడాం ఆ తొమ్మిదేళ్లు జీవనోపాధి లేక, గ్రామంలో పనులు దొరక్క తిండికి సైతం అల్లాడాం. నా ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి రెండేళ్లు తెనాలిలో తాపీ పనులకు వెళ్లాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన దగ్గర నుంచి మా గ్రామంలోనే ఉపాధి పుష్కలంగా దొరుకుతుండటంతో తిరిగి మళ్లీ గ్రామానికి వచ్చేశాం. ఆ మహానేతకు రుణపడి ఉన్నాం. - కె.కృపారాణి, కృత్తివెన్ను, కృత్తివెన్ను మండలం కన్నతల్లిలాంటి ఊరిని వదిలి వెళ్లాం కన్నతల్లి లాంటి ఊరును సైతం కన్నీళ్లతో వదిలి వెళ్లిపోయిన రోజులవి. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో పంటలు లేక పొలాలన్నీ బీడువారి ఉపాధి కరువైంది. నా పిల్లలు, భార్యతో కలిసి బతుకు తెరువు కోసం మూడేళ్లు విజయవాడకు వలసవెళ్లాం. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రావటంతో పల్లెలన్నీ సంతోషంతో కళకళలాడాయి. సొంత ఊరికి తిరిగి వచ్చేశాను. - పి.వెంకటరఘుపతిరావు, శీతనపల్లి, కృత్తివెన్ను మండలం -
ప్రచారం ఉధృతం
వైఎస్ఆర్సీపీ దెబ్బకు టీడీపీ నేతల పరుగులు సాక్షి, చిత్తూరు: మున్సిపోల్స్ ప్రచార పర్వం తారస్థారుుకి చేరుకుంది. నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రచారానికి దిగడంతో ఆయా పట్టణాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. వైఎస్ఆర్ సీపీ జోరుకు టీడీపీ నాయకులు కంగారుపడుతున్నారు. ప్రచారం ప్రారంభ మైనా చాలా మున్సిపాలిటీల్లో టీడీపీ నాయకుల్లో గందరగోళం వీడలేదు. చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏఎస్ మనోహర్ ఉదయం నాలుగు వార్డులు, సాయంత్రం నాలుగు వార్డుల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు గ్రూప్ తగాదాలను సర్దుబాటు చేసుకోవడంలోనే మునిగిపోయారు. ప్రధానమైన కఠారి మోహన్, జంగాలపల్లి గ్రూప్‌లు ఎవరి మద్దతుదారులను వారు గెలిపించుకునేందుకు పరిమితమయ్యాయి. పుంగనూరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సీపీ ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం చేసుకుంది. చాలా వార్డుల్లో ఏకపక్షంగా ముందు కు దూసుకెళ్తోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో మైనారిటీల మద్దతుతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందుంది. ఇద్దరు నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్న టీడీపీ ఇంత వరకు ఇక్కడ ప్రచారం లో వెనుకే ఉంది. దీంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటున్న అనిషారెడ్డి భర్త శ్రీనాథరెడ్డి రెండు రోజులుగా రంగంలోకి దిగారు. పుత్తూరు, నగరి మున్సిపాల్టీల్లో వెఎస్ఆర్ సీపీ నాయకురాలు ఆర్కే రోజా ఆధ్వర్యంలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారికి పోటీ ఇచ్చేందుకు, ప్రచారం ఉధృతం చేసేందుకు ఎమ్మెల్యే గాలి ముద్దుక్రిష్ణమనాయుడు తంటాలు పడుతున్నారు. వార్డు వార్డుకు వెళ్లేందుకు తన కుమారులను ప్రచారంలోకి దించారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఎమ్మేల్యే బొజ్జల గోపాల క్రిష్ణారెడ్డి వైఎస్ఆర్ సీపీ హవాను అధిగమించేందుకు ఏం చేయాలా? అని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డుల్లో ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రచారానికి ప్రజల్లో స్పందన లేదు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఇల్లిల్లు తిరుగుతున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్న సుభాష్ చంద్రబోష్, ఆయన తమ్ముడు బాలాజీ ప్రచారం కోసం పరుగులు పెడుతున్నారు. మదనపల్లె మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సీపీ తరఫున ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, సమన్వయకర్త షమీం అస్లాం వార్డుల్లో తిరుగుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్న గంగారపు రాందాస్‌చౌదరి సన్నిహితులతో కలిసి దేశం అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లోకి వెళ్తున్నారు.