breaking news
Indira Shobhan
-
ఇది సఫ(బ)ల తెలంగాణ
మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. అలాంటి మహిళకు తెలంగాణ వచ్చాక ఎలాంటి ఆదరణ లభించలేదు. సంక్షేమ పథకాల నుంచి మొదలుకొని కేబినెట్ బెర్త్‌ల దాకా అడుగడుగునా అన్యాయమే. కానీ 2023 డిసెంబర్ 7న గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. ఆడబిడ్డల మోములపై నవ్వులు చిందుతుండగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక తమ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయనుకున్న యువత, ముఖ్యంగా మహిళల ఆశలు అడియాసలే అయ్యాయి. బీఆర్ఎస్ మొదటి కేబినెట్లో ఒక్క మహిళను కూడా తీసుకోకుండా అతివలను అతి ఘోరంగా అవమానించింది. ఇతర పదవులూ ఇవ్వలేదు. కానీ... కాంగ్రెస్ సర్కారు మహిళలకు పెద్దపీట వేసింది. కేబినెట్లోకి ఆదివాసీ బిడ్డ ధనసరి సీతక్కను, బీసీ బిడ్డ కొండా సురేఖను తీసుకున్నది. అలాగే, ‘తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’, ‘తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్’ల చైర్మన్లుగా, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలిగా అతివలకు అవకాశం కల్పించింది. తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అతివల ఇంటి కష్టాలను తీర్చుతున్నది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం విద్యార్థులు, పోలీసుల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించింది. దీంతో మహిళలకు స్థిరమైన ఆదాయం వస్తున్నది. అలాగే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నది. దీంతోపాటు ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల దాకా స్వయం ఉపాధికి సాయం అందజేస్తున్నది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగడమే కాదు... ఆ బస్సులకు వారినే ఓనర్లను చేసే మరో మహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 150 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించింది. మరో 450 బస్సులను కూడా అద్దెకు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదీ చదవండి: World Bicycle Day 2025 డయాబెటిస్‌కు, ఊబకాయానికి చెక్మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసింది. ఈ బజార్లు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్‌ను అందిస్తాయి. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతున్నది. అలాగే, మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 196 ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు’ ఏర్పాటు చేసింది. ఈ క్యాంటీన్లు మహిళలకు స్వయం ఉపాధిని అందిస్తున్నాయి. మహిళలంతా ఒకేచోట చేరి తమ పురోగతికి ప్రణాళికలు రచించుకునేలా 22 ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలను నిర్మించింది. ఇవి మహిళలకు కార్యాలయాలుగా, వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మహిళలకు ‘మీ సేవా’ కేంద్రాలను అప్పగించి, వారికి ఉపాధి కల్పిస్తున్నది. డైరీ సహకార రంగంలో 40 వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ఆర్థిక భద్రతకు భరోసానిస్తున్నది. ఇలా నేటి ప్రభుత్వం మహిళా సాధికారతకు పాటుపడటంతో పాటు ఆర్థికంగా ఆగమైపోయిన రాష్ట్రాన్ని అత్యంత క్రమశిక్షణతో ఒక్కో పువ్వేసి బతుకమ్మను పేర్చినట్టు పునర్నిర్మిస్తున్నది. -ఇందిరా శోభన్కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు -
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరాశోభన్
ఢిల్లీ: తెలంగాణకు చెందిన సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ ఢిల్లీ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాగారు ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సౌత్ ఇండియా ఇన్ చార్జీ సోమ్ నాథ్ భారతి, ఇందిరాశోభన్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాశోభన్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సౌత్ ఇండియా ఇన్ చార్జీ సోమ్ నాథ్ భారతిలకు ఇందిరాశోభన్ కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు విద్యా, వైద్యంతోపాటు అన్ని రంగాల్లో అండగా నిలిచిన ఆప్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అన్ని విషయాల్లో జాతీయ పార్టీ నేతలు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఏడేళ్ల పాలనలో అధికార టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని ఇందిరాశోభన్ విమర్శించారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ అంటే బడా జూటా పార్టీ అని పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్ కొడుకుపై పోల్ వ్యవహారం.. మల్లన్నపై బీజేపీ మండిపాటు, చర్యలు?