టాటా ట్రస్టీస్, గ్లోబల్ ఫండ్ల ‘ఇండియా హెల్త్ ఫండ్’
న్యూఢిల్లీ: గ్లోబల్ ఫండ్‌తో కలిసి టాటా ట్రస్టీస్ ’ఇండియా హెల్త్ ఫండ్’ (ఐహెచ్ఎఫ్)ను ప్రారంభించింది. ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్‌లో ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సహా ఇరు సంస్థల ప్రతినిధులూ పాల్గొన్నారు. మలేరియా, టీబీ వంటి వ్యాధులపై పోరు ఈ ఫండ్ ఏర్పాటు ప్రధాన లక్ష్యమని టాటా ట్రస్టీస్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, భారత్ వెలుపల కోట్లాది మంది జీవితాలను మెరుగుపరచడానికి సంబంధించి దాతృత్వం కోణంలో నూతన అవకాశాలను కూడా ఫండ్ అన్వేషిస్తుందని గ్లోబల్ ఫండ్ డెరైక్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ క్రిస్టోఫ్ బెన్ పేర్కొన్నారు.