breaking news
Indian-origin women
-
ఫోర్బ్స్ బిలియనీర్లు : మన ముగ్గురు
భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు అమెరికాలోని టాప్ సెల్ఫ్‌మేడ్ మహిళా బిలియనీర్ల ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. అమెరికాలో స్వయం ప్రకాశితమైన 80 మంది మహిళల జాబితాలో ముగ్గురు ప్రముఖంగా నిలిచారు. ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ రూపొందించిన ఈ లిస్ట్‌లో కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్, ఐటీ కన్సల్టింగ్ అండ్ ఔట్సోర్సింగ్ సంస్థ సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథి, స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ కంపెనీ కంఫ్యూయెంట్ సీటీవో నేహా నర్కెడే, తమ సత్తా చాటారు. ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్ 2019 జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. జయశ్రీ ఉల్లాల్ (58) : ఫోర్బ్స్ జాబితాలో 18వ స్థానంలో నిలిచిన జయశ్రీ ఉల్లాల్ సంపద విలువ 1.4 బిలియన్ డాలర్లు. లండన్‌లో పుట్టిన ఈమె భారత్‌లో పెరిగారు. ఇప్పుడు అమెరికాలో సంపన్నురాలిగా కొనసాగుతున్నారు. నీరజా సేథి (64) : 1980లో తన భర్త భరత్ దేశాయ్‌తో కలిసి కేవలం 2వేల డాలర్ల పెట్టుబడితో తన అపార్ట్మెంట్లో సింటెల్ కంపెనీ ప్రారంభించారు. ప్రస్తుత నికర విలువ 1 బిలియన్ డాలర్లు. 2019 అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఐటీ కంపెనీ ఎటోస్ ఎస్ఈ సింటెల్‌ను 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో ఈమె వాటా నికర విలువ 510 మిలియన్ డాలర్లుగా అంచనా. ఫోర్బ్స్ జాబితాలో ఈమె ర్యాంకు 23. నేహా నర్కెడే (34) : 60వ స్థానంలో నిలిచిన నేహా సంపద విలువ 360 మిలియన్ డాలర్లు. లింక్డిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆమె 2014లో సొంత కంపెనీని ప్రారంభించారు. గోల్డ్‌మాన్ సాచీ, నెట్‌ఫ్లిక్స్ ఉబెర్ లాంటి దిగ్గజాలను వినియోగారదారులుగా ఉన్నకంఫ్యూయెంట్ కంపెనీ నికర విలువ 2.5బిలియన్ డాలర్లు. ఇక ఈ జాబితాలో డయాన్ హెన్డ్రిక్స్ టాప్‌లో ఉన్నారు. ఏబీసీ సప్లై అనే కంపెనీ చైర్మన్ అయిన ఈమె సంపద విలువ 7 బిలియన్ డాలర్లు. మీడియా మొఘల్ ఒపెరా విన్ ప్రే 10వ ర్యాంకును సాధించగా ఫేస్బుక్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (12), రియాల్టీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ (23), ఫ్యాషన్ డిజైనర్ టోరీ బుర్చ్ (29), పాప్ స్టార్ రిహన్న (37), మడోన్నా (39), గాయకుడు బెయోన్స్ (51), రచయిత డేనియల్ స్టీల్ (56), టీవీ షో ఎల్లెన్ డెజనేర్స్ (63), టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ 80 వ స్థానంలో నిలిచారు. 21- 92 సంవత్సరాల వయస్సున్న సభ్యులకు ఈ జాబితాలో చోటు కల్పించగా, వీరి మొత్తం సంపద 81.3 బిలియన్ డాలర్లు. కనీస నికర విలువ 225 మిలియన్ డాలర్లుగా నిర్ణయించగా, రికార్డు స్థాయిలో 25 మంది బిలియనీర్లుగా నిలిచారు. గతంతో పోలిస్తే కొత్త వ్యాపారం సృష్టించడంతోపాటు మహిళలు వ్యాపారంలో బాగా రాణిస్తున్నారని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంపద సృష్టిస్తున్నారని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. -
అక్కడి అందాల పోటీల్లోనూ...!
న్యూఢిల్లీ: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లో ముందున్నారు. అదేవిధంగా అందాల పోటీల్లోనూ భారత సంతతి అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా న్యూజెర్సీలో నిర్వహిస్తున్న రెండు వార్షిక అందాల పోటీల్లో ఏడుగురు భారత సంతతి సుందరీమణులు పోటీ పడుతున్నారు. న్యూజెర్సీ రాష్ట్రం ప్రతి ఏడాది 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ', 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ' పోటీలను నిర్వహిస్తున్నది. ఇందులో 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ' పోటీలలో ఆరుగరు భారత సంతతి అమ్మాయిలు పోటీపడుతుండగా.. 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ' పోటీలో ఒకరు పోటీపడుతున్నారు. వనితా బుధాన్ (22), నికోల్ పటేల్ (23), నిహారా చక్రాల (24), సౌమ్యశర్మ (23), సుచిత్ర సింగ్ (24), ఛావి వర్గ్ (18)లు 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ'లో అదృష్టం పరీక్షించుకుంటుండగా.. 14 ఏళ్ల నేహా పసుపులేటి ఎడిసన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ'లో పోటీపడుతున్నారు. ఈ పోటీలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు గత శుక్రవారం, శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ అభివృద్ధి, ప్రేరణ, నైపుణ్య విశిష్టత వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారు అమెరికా జాతీయ అందాల పోటీలైన 'మిస్ యూఎస్ఏ', 'మిస్ టీన్ యూఎస్ఏ'లో పాల్గొంటారు. మిస్ యూఎస్ఏలో విజయం సాధిస్తే.. మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొనవచ్చు.