breaking news
india tennis
-
తొలి రౌండ్లోనే యుకీ భాంబ్రీ అవుట్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో భారత ఆటగాడు యుకీ భాంబ్రీ తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యుకీ 7-5, 6-1, 6-2 స్కోరుతో ప్రపంచ ఆరో ర్యాంకర్ థామస్ బెర్డిచ్ చేతిలో ఓటమి చవిచూశాడు. గంటా 45 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో యుకీ వరుస సెట్లలో మ్యాచ్‌ను కోల్పోయాడు. తొలిసెట్లో హోరాహోరీగా తలపడిన యుకీ ఆ తర్వాత థామస్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. -
ఫైనల్లో సానియా జోడి
మియామి : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో టైటిల్‌కు చేరువయింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్), సానియా జోడి మియామి ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం) జరిగిన సెమీస్‌లో టాప్‌సీడ్ సానియా జోడి 6-2, 6-4తో టిమియా బాబోస్, క్రిస్టినా మాలెనోవిచ్‌పై నెగ్గారు. ఫైనల్లో వీరు మకరోవా, వెస్నినా జోడితో తలపడతారు. రెండు వారాల క్రితం బీఎన్పీ పరిబాస్ ఓపెన్ ఫైనల్లోనూ మకరోవా-వెస్నినాపై గెలిచిన సానియా జోడీ టైటిల్ సాధించడం విశేషం.