breaking news
IMG-reliance
-
రిలయన్స్ మరో డీల్
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ మరో డీల్ కుదుర్చుకున్నారు. అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సింగపూర్ కుచెందిన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ జాయింట్ వెంచర్ ఐఎమ్జీ వరల్డ్‌వైడ్ ఎల్ఎల్సీలో మేజర్ వాటాను కొనుగోలు చేశారు. రూ .52.08 కోట్లకు 'ఐఎంజీ-ఆర్'లో 50శాతం వాటాను సొంతం చేసుకొంది. ఈ విషయాన్ని ఆర్ఐఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో జరిగింది. డీల్ పూర్తికాగానే రిలయన్స్ ఐంఎంజీ ఆర్‌ను రీబ్రాండింగ్ చేయనుంది. భారత దేశంలో క్రీడలు,ఫ్యాషన్ వినోద రంగాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం, మార్కెటింగ్ చేయడం కోసం 2010లో రిలయన్స్-ఐఎంజీ వరల్డ్‌వైడ్ సంయుక్తంగా సంస్థను ప్రారంభించాయి. ఆ తర్వాత నుంచి కంపెనీ భారత్‌లో పలు క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించి ప్రమోట్ చేసింది. 'షేర్ల కొనుగోలుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, రూ.52.08 కోట్లకు మించకుండా ఐఎంజీ సింగపూర్ పీటీఈ వాటాను కొనుగోలు చేస్తామని రిలయన్స్ తెలిపింది. ఈ డీల్ తర్వాత కంపెనీని రీబ్రాండింగ్ చేస్తామని వెల్లడించింది. ముందు చేసుకొన్న ఒప్పందం కావడంతో దీనికి ఎటువంటి క్లియరెన్స్‌లు అవసరం లేదని కూడా రిలయన్స్ తెలిపింది. ప్రస్తుతం ఐఎంజీ-ఆర్ ఏటా రూ. 25.79 కోట్లు జీఎస్టీతో సహా రూ.181.70 కోట్ల మేరకు వ్యాపారం నిర్వహిస్తోంది. వీటిల్లో నికర లాభం రూ.16.35 కోట్లుగా ఉంది. -
ఐఎస్ఎల్ నుంచి సన్ గ్రూప్ ఔట్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్‌కు ఆరంభానికి ముందే షాక్ తగిలింది. బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ సన్ గ్రూప్.. లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయానికి గల కారణాలను అటు ఆ సంస్థగానీ, ఇటు ఐఎస్ఎల్ నిర్వాహకులు గానీ ప్రకటించకపోయినా.. జె.ఎస్.డబ్ల్యు అనే సంస్థతో సన్ గ్రూప్ భాగస్వామ్యాన్ని ఐఎంజీ-రిలయన్స్ వ్యతిరేకించింది. దీంతో తాము లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు సన్ గ్రూప్ తెలిపింది. అయితే డ్రాఫ్ట్‌లో బెంగళూరు జట్టు ఎంపిక చేసుకున్న 14 మంది ఆటగాళ్లు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే జట్టుకు వారు ప్రాతినిధ్యం వహిస్తారని లీగ్ నిర్వాహకులు హామీ ఇచ్చారు. మాంచెస్టర్‌లో ఆవిష్కరణ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ ఆవిష్కరణ ఇంగ్లండ్‌లో జరగనుంది. సెప్టెంబర్ 6న అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రముఖుల సమక్షంలో మాంచెస్టర్‌లో వైభవంగా జరిగే కార్యక్రమంలో ఐఎస్‌ఎల్‌ను ఆవిష్కరించనున్నారు. 2017లో భారత్ ఆతిథ్యమివ్వనున్న అండర్-17 ప్రపంచకప్‌ను కూడా అదే వేదికపై ఆవిష్కరిస్తారు.