breaking news
iit ranker
-
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
బిహార్ గయా జిల్లాలో పట్వాటోలి గ్రామాన్ని ‘ఐ.ఐ.టి. విలేజ్’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఐ.ఐ.టి ర్యాంకులు సాధించివారు విపరీతంగా ఉంటారు. ఐ.ఐ.టి 2025 రిజల్ట్స్‌లో ఏకంగా 40 మంది స్టూడెంట్స్ ర్యాంకులు తెస్తే వీరిలో అమ్మాయిలే అధికం. నేతవాళ్లు ఎక్కువగా ఉండే ఈ ఊరి నుంచి ఇంటికొక ఇంజనీర్ ఉండటం విశేషం. ఇదెలా జరిగింది?ఎవరో ఒకరిద్దరు తలుచుకుంటే ఏ మార్పూ రాదని కొందరు అనుకుంటారు. కాని ఒక మనిషి తలుచుకున్నా మార్పు వస్తుంది. వచ్చింది.1991.బిహార్‌లోని గయ జిల్లాలోని పట్వాటోలి అనే చిన్న గ్రామంలో జితేంద్ర పట్వా అనే అబ్బాయికి ఐ.ఐ.టి.లో ర్యాంక్ వచ్చింది. ఆ ఊరి నుంచి ఎవరికైనా అలాంటి ర్యాంక్ రావడం ఇదే ప్రథమం. ఊరంతా సంతోషించింది. ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు. స్థిరపడ్డాడు. కాని ఊరికే ఉండలేదు. ఊరికి ఏదైనా చేయాలనుకున్నాడు.దేనికంటే ఆ ఊరు అప్పటికే తన ప్రాభవం కోల్పోయింది.పట్వాటోలిని ఒకప్పుడు అందరూ ‘మాంచెస్టర్ ఆఫ్ బిహార్’ అని పిలిచేవారు. ఆ ఊర్లో అందరూ నేతపని వారే. నేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉన్న రోజుల్లో ఆ ఊరు ఒక వెలుగు వెలిగింది. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పులు వారిని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంచేశాయి. ఈ నేపథ్యంలో పిల్లలను మంచి చదువులవైపు మళ్లిస్తే ఊరి భవిష్యత్తు మారుతుందని భావించాడు జితేంద్ర పట్వా.2013లో అతడు ఊరికి వచ్చి ‘వృక్ష సంస్థాన్’ పేరుతో ఒక ఎన్.జి.ఓ మొదలెట్టాడు. పేద నేతగాళ్ల పిల్లలకు, దిగువ మధ్యతరగతి ఇతర వర్గాల పిల్లలకు ఉచితంగా ఐ.ఐ.టి కోచింగ్ ఇవ్వడమే ఆ సంస్థ లక్ష్యం. ఒకప్పుడు ఆ ఊరిలో టెన్త్ తర్వాత చదువు మానేసేవారు. ఇప్పుడు టెన్త్ సమయం నుంచే ఐ.ఐ.టి. కోచింగ్ మొదలెడుతున్నారు.అయితే ఇది ఆషామాషీగా జరగడం లేదు. విద్యార్థుల కోసం ఈ ఊరితో పాటు చుట్టుపక్కల కొన్ని లైబ్రరీలు స్థాపించారు. అవన్నీ ఐ.ఐ.టి. చదవడానికి అవసరమయ్యే పుస్తకాలతో నిండి ఉంటాయి. వాటిని ఏ పద్ధతిలో చదువుకుంటూ వెళ్లాలో గైడ్ చేస్తారు. అలాగే ఐ.ఐ.టి. చదివి ముంబై, ఢిల్లీలో స్థిరపడ్డ జితేంద్ర మిత్రులు ఇక్కడికొచ్చి క్లాసులు చెబుతారు. కొత్తల్లో వీరు క్లాసులు చెప్పినా ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ.ఐ.టి.కి వెళ్లినవాళ్లు క్లాసులు చెబుతున్నారు.అంటే ఈ ఫ్రీ కోచింగ్ ఎన్నాళ్లైనా కొనసాగే విధంగా ఇక్కడి విద్యార్థులే నిష్ణాతులయ్యారన్న మాట. వస్త్రాలు నేసి రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్న ఈ ఊరిలో జె.ఇ.ఇ.– 2025 రిజల్ట్స్‌లో 40 మంది ర్యాంకులు సాధించారు. వీరిలో శరణ్య అనే అమ్మాయి టాపర్‌గా నిలిచి 99.64 పర్సంటేజ్ సాధించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని పల్లెల నుంచి కూడా ఎందరో ఐ.ఐ.టి. సాధించారు. వారు ఇలాంటి అడుగు వేస్తే ప్రతి పల్లెటూరి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు గొప్ప చదువులకు వెళతారు. గ్రామాల దశను మారుస్తారు. -
గురుకులాల ఐఐటీ ర్యాంకర్లకు సీఎం జగన్ అభినందన
-
ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఐఐటీ ర్యాంకర్లకు సీఎం జగన్ అభినందన
-
ఇదే కృషితో ఐఏఎస్ కొట్టాలి
ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్న చోట రోజు వారీ సమావేశాల్లో ఐఏఎస్ అధికారులు కూర్చుంటారు. వారితో కలిసి వివిధ రంగాల్లో స్థితిగతులు, రాష్ట్రంలో పరిస్థితి, వివిధ పథకాల అమలుపై సమీక్షలు చేస్తాం. ఇప్పుడు ఏ స్ఫూర్తితో అయితే మీరు కష్టపడి ఐఐటీల్లో చేరడానికి మంచి ర్యాంకులు సాధించారో.. అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో, కష్టపడి ఐఏఎస్ అధికారులు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. అప్పుడు మీరూ ఇదే స్థానాల్లో కూర్చుని పరిపాలనలో భాగస్వాములు కావచ్చు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి ప్రతిష్టాత్మక ఐఐటీ ఇతర ఉన్నత విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ కృషిని ఇలాగే కొనసాగిస్తే కచ్చితంగా ఐఏఎస్ స్థానాల్లో కూర్చుంటారని విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్ధులు మంగళవారం సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి ల్యాప్‌టాప్‌లను బహూకరించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకున్నారు. విద్యార్థుల నేపథ్యాన్ని అడిగి తెలుసుకుని మరింత రాణించాలని ప్రోత్సహించారు. స్ఫూర్తి రగిలించే కథలు ఇక్కడే.. విద్యారంగంపై ప్రభుత్వాలు చూపే శ్రద్ధ, ధ్యాస పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యారంగాన్ని సంస్కరిస్తూ అమ్మఒడి, నాడు–నేడు సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే అధికారులు మన ముందే ఉన్నారన్నారు. ‘మీ ముందే ఇద్దరు ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే, సునీత మాట్లాడారు. వారు కూడా మీలాంటి వారే. ఐఏఎస్ అధికారులయ్యారు. మీరంతా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఇది అసాధ్యం కానే కాదు. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇది దాటితే ప్రపంచం మీకు మెరుగైన అవకాశాల రూపంలో ద్వారాలు తెరుస్తుంది. మీరు ఇప్పటికే ఒక స్థాయికి చేరుకున్నారు. తొలి అడుగు వేసినట్లే భావించండి’ అని విద్యార్థులనుద్దేశించి సీఎం పేర్కొన్నారు. దేవుడి దయతో కష్టపడి చదువుతున్నారని, ఇలాగే కొనసాగించి దృష్టి కేంద్రీకరిస్తే కచ్చితంగా ఐఏఎస్‌ల స్థానాల్లో కూర్చుంటారని భరోసా కల్పించారు. అత్యంత సాధారణ నేపథ్యాలే.. ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవని, సీఎంవోలో అదనపు కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజే దీనికి నిదర్శనమని సీఎం జగన్ చెప్పారు. ‘ముత్యాలరాజు జీవితం మన హృదయాలను కదిలిస్తుంది. వాళ్ల ఊరికి వెళ్లాలంటే పడవలే మార్గం. మనకు స్ఫూర్తినిచ్చే కథలు ఎక్కడో లేవు. ఇదే గదిలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల రూపంలో ఉన్నాయి. మీరు ఇదే కృషి కొనసాగిస్తే కచ్చితంగా ఆ స్థాయికి చేరుకుంటారు. నా పక్కనున్న స్థానాల్లో మీరు కనిపిస్తారు’ అని సీఎం పేర్కొన్నారు. కరోనా సమయంలో అడవుల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో.. 5 నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లి ఆన్లైన్లో చదువుకున్నామని చెప్పారు. తాము ఎలా, ఎంత కష్టపడిందీ వివరించారు. తమను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉన్నత చదువులకు అర్హత సాధించేలా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, గిరిజన సంక్షేమశాఖ ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సహాయం కావాలన్నా సరే.. తన వైపు నుంచి సీఎంవో అదనపు కార్యదర్శి ముత్యాలరాజు అందుబాటులో ఉంటారని, ఫోన్ నంబరు ఇస్తారని, ఎప్పుడు అవసరమున్నా.. ఏం కావాలన్నా సహాయంగా నిలుస్తారని విద్యార్థులకు సీఎం భరోసానిచ్చారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. ఈ అధికారులంతా మీ స్థాయి నుంచే వచ్చారు కాబట్టి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎలా పరిష్కరించాలి? ఏ రకంగా మీకు తోడుగా నిలవాలనే విషయాలు వారికి బాగా తెలుసని సీఎం విద్యార్థులతో పేర్కొన్నారు. మొత్తం వ్యవస్థే మారిపోతుంది.. గిరిజన ప్రాంతాల నుంచి, కర్నూలులోని ఎమ్మిగనూరు తదితర చోట్ల నుంచి విద్యార్థులు ఐఐటీలో ర్యాంకు సాధించడం గర్వించదగ్గ విషయమని సీఎం అభినందించారు. ‘నేను పాదయాత్ర చేసినప్పుడు ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఎంత వెనకబడి ఉన్నాయో చూశా. అలాంటి ప్రాంతం నుంచి ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరుగుతాయి. పెద్ద పెద్ద చదువులు చదవాలన్న తపన పెరుగుతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మార్గదర్శకంగా భావించి మెరుగైన చదువులు చదివే పరిస్థితి వస్తుంది. మొత్తం మార్పు కనిపిస్తుంది. ఇది జరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అంటూ సీఎం స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు. వైఎస్సార్ చొరవతో మూడేళ్లలోనే ఊరికి బ్రిడ్జి: ముత్యాలరాజు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా తన ప్రస్థానాన్ని తెలియజేయాలని సీఎం కోరడంతో సీఎంవో అదనపు కార్యదర్శి ముత్యాలరాజు తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ‘మాది కృష్ణా జిల్లా సరిహద్దులోని చిన్న గొల్లపాలెం. మా ఊరు ఒక దీవి. అటు పశ్చిమ గోదావరి ఇటు కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. చాలా మంది గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. నా సొంత చెల్లెలే ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నా. ఈ పరీక్షల్లో నాకు అఖిల భారత స్థాయిలో నంబర్ వన్ ర్యాంకు వచ్చింది. అప్పటి సీఎం వైఎస్సార్ పిలవడంతో నా తల్లిదండ్రులతో వెళ్లి కలిశా. ఏం కావాలని వైఎస్సార్ అడిగితే మా ఊరికి బ్రిడ్జి సదుపాయం కల్పించాలని కోరా. నేను రిటైర్ అయ్యేలోగా మా ఊరికి బ్రిడ్జి తేగలనేమోనని అనుకున్నా. వైఎస్సార్ చొరవతో మూడేళ్లలోనే బ్రిడ్జి వేయగలిగాం. దీనికోసం రూ.26 కోట్ల నిధులను ఆయన కేటాయించారు. ప్రస్తుతం విద్యా సంబంధిత అంశాలపై దృష్టిపెట్టా. అమ్మ ఒడి, నాడు–నేడు కార్యక్రమాలు చురుగ్గా చేయగలిగాం. ఏపీ చరిత్రలో ఇన్ని సీట్లు రాలేదు’ అని ముత్యాలరాజు తెలిపారు. ఇప్పటివరకూ 179 మందికి మంచి ర్యాంకులు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల నుంచి ఇప్పటివరకూ 179 మంది విద్యార్థులు వివిధ ఐఐటీలు, ఐఐటీల్లో ప్రిపరేటరీ కోర్సులు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. 2014లో ఒకే ఒక్క గిరిజన విద్యార్థి ఐఐటీకి ఎంపిక కాగా 2021లో 30 మంది సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల విద్యార్థులు సీట్లు సాధించేలా ర్యాంకులు తెచ్చుకోవడం గమనార్హం. వీరిలో 9 మంది నేరుగా ఐఐటీకి అర్హత సాధించగా 21 మంది విద్యార్థులు ప్రిపరేటరీ కోర్సు (ఏడాది పాటు ఐఐటీ నిపుణులతో శిక్షణ) అనంతరం మళ్లీ ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా ఐఐటీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందనున్నారు. 7 వేల లోపు ర్యాంకులు సాధించిన మరో 59 మంది ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఇంకా కౌన్సిలింగ్ జరుగుతున్నందున మరింతమందికి సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు నీట్ తదితర ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని, వాటిలో కూడా ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సీఎం ఉన్నారనే ధైర్యంతోనే చదువుకోగలిగాం మాది.. విశాఖ జిల్లా అనంతగిరి మండలం కోటపర్తివలస. జేఈఈ అడ్వాన్స్డ్ ఎస్టీ కేటగిరీలో నాకు 596వ ర్యాంక్ వచ్చింది. నేను ఈ ర్యాంకు సాధించడానికి సీఎం జగనన్నే నాకు స్ఫూర్తి. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. కరోనా కష్టకాలంలో మేము భయపడకుండా చదువుకోగలిగామంటే జగనన్న ఉన్నారన్న ధైర్యమే కారణం. సివిల్స్ సాధించి నాలాంటి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా ఉండటమే నా లక్ష్యం. – వరలక్ష్మి, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, మారికవలస, విశాఖపట్నం జిల్లా జగనన్న అమ్మఒడితో ఎంతో ప్రోత్సాహం.. మాది విజయనగరం జిల్లా కొట్టక్కి. జేఈఈ అడ్వాన్స్డ్ ఎస్టీ కేటగిరీలో నాకు 333వ ర్యాంకు వచ్చింది. అమ్మానాన్న వెదురుబుట్టలు అల్లుతారు. సీఎం సారే మాకు స్ఫూర్తి. నాలాంటి విద్యార్థుల సంక్షేమం కోసం మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి వంటి మంచి పథకాలు ప్రవేశపెట్టారు. వాటితో మా చదువులకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. – పార్ధసారధి, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం, విజయనగరం జిల్లా ‘నాడు–నేడు’తో మా కళాశాలను బాగా అభివృద్ధి చేశారు నాకు జేఈఈ అడ్వాన్స్డ్ ఎస్సీ కేటగిరీలో 507వ ర్యాంకు వచ్చింది. నేను ఎల్బీ చర్ల, నర్సాపురంలోని ఎస్సీ సంక్షేమ కళాశాలలో చదువుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో స్ఫూర్తి కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగపడింది. మంచి శిక్షణ అందించారు. ప్రభుత్వం నాడు–నేడు ద్వారా మా కళాశాలను చాలా బాగా అభివృద్ధి చేసింది. – బి.తరుణ్, గణపవారిగూడెం, లింగపాలెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మీ బీఎండబ్ల్యు మాకొద్దు బాబోయ్..
తన్మయ షెఖావత్ అనే కుర్రాడికి ఈ సంవత్సరం నిర్వహించిన ఐఐటీ జేఈఈ పరీక్షలలో జాతీయస్థాయిలో 11వ ర్యాంకు వచ్చింది. దాంతో అతడికి కోచింగ్ ఇచ్చిన సంస్థ యజమాని ఎంతగానో సంబరపడి.. తనవద్ద ఉన్న బీఎండబ్ల్యు కారును బహుమతిగా ఇచ్చారు. ఇది జరిగి సరిగ్గా ఇప్పటికి ఆరు నెలలు గడిచింది. ఇప్పుడు ఆ కుర్రాడు, అతడి తండ్రి కూడా తమకు ఆ కారు వద్దని, అది వెనక్కి తీసేసుకుని ఏదో ఒక చిన్న బహుమతి... కనీసం ఒక ల్యాప్‌టాప్ అయినా ఇవ్వాలని అడుగుతున్నారు. కారు అమ్మేసి డబ్బు ఇవ్వాలని, లేదా కారు ఆయన వద్దే ఉంచుకుని వేరే ఏదైనా చిన్న బహుమతి తన కొడుక్కి ఇవ్వాలని అడిగినట్లు తన్మయ తండ్రి రాజేశ్వర్ సింగ్ షెఖావత్ చెప్పారు. ఆయన రాజస్థాన్‌లో ఓ స్కూలు టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇంతకీ వాళ్లు కారు ఎందుకు వద్దన్నారో తెలుసా.. కారు ఖరీదు రూ. 28 లక్షలు. ఆ కారు తీసుకుంటే దాని విలువలో 33 శాతాన్ని పన్నుగా కట్టాల్సి ఉంటుంది. అంటే, 9 లక్షలు. ఆ మొత్తం ఎక్కడి నుంచి తేవాలి? పైగా, కారు మైలేజి చాలా తక్కువ. అంతేకాదు.. ఒక్కసారి సర్వీసింగ్ చేయిస్తే 85 వేల రూపాయలు అవుతుంది. ఈ ఖర్చంతటినీ భరించడం అంటే తెల్ల ఏనుగును మేపినట్లే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఈ విషయంలో ఐఐటీ కోచింగ్ ఇచ్చిన సమర్పణ్ కెరీర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆర్ఎల్ పూనియా వేరేవిధంగా చెబుతున్నారు. మొదట్లో వాళ్లు ఆ కారు ఉంచుకుందామనే అనుకున్నారని, తన్మయ మేనమామ ముంబైలో ఉంటారని.. ఆయనకు ఆ కారు ఇద్దామనుకున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు తన్మయ తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఆమెకు చికిత్స చేయించడానికే కారు అమ్మాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. కారు చాలా ఖరీదైనది కావడంతో.. దాన్ని అమ్మడం కూడా కష్టమేనని, కానీ తమ సంస్థ వ్యవస్థాపక దినం సందర్భంగా ఈనెల 15న వేలం వేస్తామని అన్నారు. తన్మయకు 11వ ర్యాంకు రావడంతో తమ సంస్థలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరిగిందని పూర్నియా తెలిపారు.