breaking news
IGI Delhi
-
IGI: ఇందిరాగాంధీ విమానాశ్రయం అరుదైన ఘనత
ఢిల్లీ: నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI) అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి హైడ్రో, సోలార్ పవర్ ఎయిర్పోర్ట్ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ మొత్తం హైడ్రో, సోలార్ పవర్‌తోనే నడుస్తోంది. 2030 నాటికి.. పునరుత్పాదక ప్రయత్నంతో పూర్తిస్థాయి కార్బన్ ఉద్గార రహిత ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకటించుకుంది. సుమారు రెండు లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంగా తెలిపింది. ఇదిలా ఉంటే.. 2036 దాకా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు హైడ్రోఎలక్ట్రిసిటీ సరఫరా చేసే ఉద్దేశంతో.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది డయల్. కిందటి ఏడాది భారత్‌తో పాటు మధ్య ఆసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు దక్కించుకుంది ఐజీఐ. -
సూపర్ హిట్ సినిమా ప్లాన్ ఫ్లాప్..
- ‘వీడొక్కడే’ తరహాలో డ్రగ్స్ స్మగ్లింగ్ - కడుపులో 8 కోట్ల విలువైన 61 హెరాయిన్ క్యాప్సూల్స్ - అవికాస్తా పగలడంతో యువకుడి దుర్మరణం - ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం న్యూఢిల్లీ: తెలుగు, తమిళంలో సూపర్ హిట్టైన సూర్యా సినిమా ‘వీడొక్కడే’ గుర్తుందా? డ్రగ్స్, డైమడ్స్ అక్రమ రవాణా దందాపై రూపొందించిన ఆ సినిమాలో.. కస్టమ్స్‌కు దొరకకుండా మనుషుల కడుపుల్లో కొకెయిన్ ప్యాకెట్లు సరఫరా చేస్తుంటారు. ఆలా పొట్టలోనే డ్రగ్స్ ప్యాకెట్లు పగిలిపోవడంతో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్(చిట్టీ) చనిపోతుంది. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. అఫ్ఘానిస్థాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ యువకుడు విమానాశ్రయంలో కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్కాన్ చేయగా, అతని పొట్టలో సుమారు రూ.8 కోట్ల విలువైన 61 హెరాయిన్ ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే ఆపరేషన్ చేసి వాటిని బయటికి తీసినప్పటికీ, ఆ యువకుడి ప్రాణాలు దక్కలేదు. చనిపోయిన యువకుడిని అఫ్ఘాన్ జాతీయుడైన హమీద్ మొహమ్మద్(19)గా గుర్తించామని నార్కోటిక్స్ అధికారులు చెప్పారు. సఫ్దార్ గంజ్ ఆస్పత్రిలో ఆపరేషన్ నిర్వహించి 61 క్యాప్సుల్స్ వెలికి తీశామని, ఒక్కోటీ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడవైన ప్లాస్టిక్ సంచుల్లో హెరాయిన్ నిండుగా నింపారని, కడుపులోని క్యాప్సుల్స్‌లో ఒకటిరెండు పగిలిపోవడంతో హమీద్ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడని వైద్యులు తెలిపారు. హమీద్ ప్రాణాలు నిలిపేందుకు చివరిదాకా ప్రయత్నించినా ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. మృతుడి శరీరంపై ఆపరేషన్ చేసిన ఆనవాళ్లేవీ లేనికారణంగా.. డ్రగ్స్ సంచుల్ని అతడు నోటి ద్వారానే తీసుకున్నట్లు భావిస్తున్నామని వైద్యులు చెప్పారు. గతంలోనూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.