breaking news
idly cost
-
24 క్యారెట్స్ బంగారంతో చేసిన ఇడ్లీ.. మన హైదరాబాద్‌లోనే
హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన వంటలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఫేమస్ డిషెస్‌లో మరో కొత్త రకం వంటకం యాడ్ అయ్యింది. అదే గోల్డ్ ఇడ్లీ.. ఈ డిష్ ఇప్పుడు సిటీ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఈ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటి? దీని ధరెంత అన్నది ఈ స్టోరీలో తెలసుకుందాం.. సాధారణంగా ప్లేటు ఇడ్లీ ఎంత ఉంటుంది? మహా అయితే రూ.30-50 వరకు ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో అయితే కనీసం రూ.500 వరకు ఉంటుంది. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.. ఎందుకంటే ఈ ఇడ్లీ ధర ఏకంగా 1200 రూపాయలు. అంత స్పెషల్ ఏముంటుందబ్బా? అదేమైనా బంగారంతో చేశారా ఆని ఆలోచిస్తున్నారా? నిజమే మరి. ఇది బంగారు ఇడ్లీనే. 24 క్యారెట్స్ గోల్డ్ ఇడ్లీ అన్నమాట. బంగారు పూత పూసిన ఈ ఇడ్లీని గులాబీ రేకులతో చాలా కలర్ఫుల్గా గార్నిష్‌తో చేసి సర్వ్ చేస్తారు. ఈ డిఫరెంట్ ఇడ్లీని టేస్ట్ చేయాలంటే మాత్రం బంజారాహిల్స్‌లోని కృష్ణ ఇడ్లీ అండ్ దోస కేఫ్‌కు వెళ్లాల్సిందే. అక్కడ గోల్డ్ ఇడ్లీనే కాదండోయ్.. బంగారు దోశ, గులాబ్ జామూన్ బజ్జీ, మలై ఖోవా గులాబ్ జామున్ వంటి వెరైటీ నోరూరించే వంటలెన్నో ఉన్నాయి. ఇంకెందుకు లేటు ఈసారి బ్రేక్ ఫాస్ట్‌కి బంగారు వంటలను ఓ పట్టు పట్టండి. View this post on Instagram A post shared by Pooja♡ (@foodnlifestyleby_pooja) View this post on Instagram A post shared by Krishna’s Idli and dosa (@krishna_idli_dosa) -
ఒక్క రూపాయి.. ఎంత పని చేసింది!
బస్సుల్లో వెళ్లేటప్పుడు గానీ, ఏవైనా సరుకులు, మందుల కొనుగోలు సమయంలో గానీ ఒక్క రూపాయే కదా అని మనం వదిలేస్తాం. అవతలివాళ్లు చిల్లర ఇవ్వాల్సి ఉండి, లేదన్నా కూడా పెద్దగా పట్టించుకోం. కానీ, బిల్లులో చెప్పిన మొత్తం కంటే ఒక రూపాయి ఎక్కువగా తీసుకున్నారన్న కారణంగా ఓ లాయర్ గారు హోటల్‌ను కోర్టుకు లాగారు. రూ. 1100 పరిహారం కూడా పొందారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వాసుదేవ్ అడిగకు చెందిన ఫాస్ట్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ హోటల్‌కు టి. నర్సింహమూర్తి అనే లాయర్ వెళ్లారు. అక్కడ ఒక ప్లేటు ఇడ్లీలు తిన్నారు. వాటి ఖారీదు రూ. 24 అయితే.. హోటల్ వాళ్లు మాత్రం ఆయన దగ్గర రూ. 25 తీసుకున్నారు. దాంతో తన వద్ద నుంచి అన్యాయంగా, అక్రమంగా రూపాయి తీసుకున్నారంటూ ఆయన వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయింఆచరు. ఈ లెక్కన హోటల్‌కు రోజకు ఎంత మంది వస్తారు, వాళ్లందరి దగ్గర నుంచి రూపాయి చొప్పునప అదనంగా ఈ హోటల్ ఎంత తీసుకుంటోందన్న లెక్కలు కూడా వివరించారు. అయితే, తాము చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఆ రూపాయి తీసుకుంటున్నట్లు హోటల్ యాజమాన్యం వాదించినా.. ఫోరం మాత్రం దాంతో ఏకీభవించలేదు. అదనంగా వసూలు చేసినందుకు వంద రూపాయల నష్ట పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. మెనూ కార్డు మీదే ప్లేటు ఇడ్లీ ఖరీదు రూ. 25 అని చెప్పి ఉంటే తాను కచ్చితంగా చెల్లించేవాడినని, అక్కడ మాత్రం తక్కువ పెట్టి ఇక్కడ ఎక్కువగా ఎందుకు తీసుకుంటున్నారని లాయర్ నర్సిహమూర్తి ప్రశ్నించారు. హైకోర్టుకు వెళ్లినా.. వినియోగదారుల ఫోరం 2014లో ఈ ఆదేశాలిచ్చింది. దాన్ని సవాలుచేస్తూ సదరు హోటల్ చైన్ వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా వాళ్లకు చుక్కెదురే అయ్యింది. హైకోర్టు హోటల్ వాళ్ల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దిగువ కోర్టు ఇచ్చి ఆదేశాలను సమర్థించింది.