ఏపీ సర్కారు కార్యాలయాలకు ఫిబ్రవరి2న సెలవు
-జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సాధారణ సెలవు
-ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఐ.వై.ఆర్.
హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ వచ్చే నెల 2వ తేదీన సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 2వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఆ రోజు సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు శుక్రవారం జీవో జారీ చేశారు.