breaking news
I think
-
ఐ థింక్ లాజిస్టిక్స్
హైదరాబాద్: సాస్ ఆధారిత షిప్పింగ్ సేవల ప్లాట్‌ఫామ్ ‘ఐ థింక్ లాజిస్టిక్స్’.. దేశీ ఈ కామర్స్ విక్రేతల కోసం అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల దేశీ ఈ కామర్స్ విక్రేతలు (ఎంఎస్ఎంఈలు), డీ2సీ బ్రాండ్లు అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించొచ్చని సంస్థ తెలిపింది. ఐథింక్ లాజిస్టిక్స్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య సంస్థల ద్వారా ఇందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది. భారత్ నుంచి సీమాంతర షిప్పింగ్ సేవల విలువ 2025 నాటికి 129 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐథింక్ లాజిస్టిక్స్ భారత ఈ కామర్స్ విక్రేతల వృద్ధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఒక్క క్లిక్‌తో ఐథింక్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్.. అమెజాన్, ఈబే, షాపిఫై, మెజెంటో, వూకామర్స్ సంస్థలతో అనుసంధానించనున్నట్టు తెలిపింది. -
'మధ్య'లో ఎన్నాళ్లు మునగాలి
‘మధ్యమానేరు ప్రాజెక్ట్‌లో సర్వం కోల్పోతున్నాం. పిల్లజెల్ల సర్వం ఆగమైతంది. నాలుగు రేకులున్నోనికి నలభై వేలోస్తే.. లంకంత కొంప ఉన్నోనికి గవ్వే పైసలిచ్చిరి. ఇవేం లెక్కలు..? ఇదెక్కడి అన్యాయం..? గత సర్కారు నిండా ముంచింది. మన సర్కారు వస్తే బతుకులు బాగుపడతయంటిరి.. ఇప్పుడు మళ్లా గతే పాట పాడుతండ్రెందుకు..?’ అంటూ మధ్యమానేరు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న చీర్లవంచ ప్రజలు ఇరిగేషన్ ఈఈ గోవిందరావును నిలదీశారు. - సిరిసిల్ల రూరల్ మంగళవారం సిరిసిల్ల మండలం చీర్లవంచలో త్రిసభ్య కమిటి సభ్యులు ముంపు నిర్వాసితులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు పనులకు సహకరించాలని కోరారు. దీంతో నిర్వాసితులు ఒక్కసారిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు వంద ఇళ్లకు పరిహారం తక్కువ నమోదు చేశారని, ఇష్టం లేకున్నా రెవెన్యూ డిపాజిట్ చేశారని, వాటిని రద్దు చేసి ఇళ్లను రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఎక్కడా లేని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ సర్కారు వచ్చాక పూర్తి స్థాయిలో పరిహారం వస్తుందని ఆశించామని, మళ్లీ ఇప్పుడూ పాత పాటే ఎత్తుకోవడం విడ్డూరంగా ఉందని నిలదీశారు. ఇతర ప్రాజెక్టుల విషయం తమకు అవసరం లేదని, తమకెంత పరిహారం ఇస్తారో చెప్పాలని కోరారు. అధికారులను తప్పు పట్టడం లేదని, తమ త్యాగాలను గుర్తించాలని సూచించారు. ఈఈ గోవిందరావు మాట్లాడుతూ.. అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అయితే అవార్డు ఎంక్వైరీ అయ్యాక వాటిని మార్చే అధికారం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు, జీవోలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, నిర్వాసితుల డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హా మీ ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ కిషన్‌రావు, ఫా రెస్టు సబ్-డీఎఫ్‌వో అశోక్‌రావు, ఆర్డీవో భిక్షానాయక్, తహశీల్దార్ ప్రభాకర్, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీలు నర్మెట బాబు నిర్వాసితులు పాల్గొన్నారు.