breaking news
Hypothecation
-
మోటారు వాహన ఫీజుల మోత
-
మోటారు వాహన ఫీజుల మోత
► లైసెన్సు, హైపోథికేషన్ , ఫిట్నెస్ చార్జీలను భారీగా పెంచిన కేంద్రం ► వీటికి అదనంగా ప్రభుత్వ ఫీజులు ► కసరత్తు చేస్తున్న అధికారులు ► రెండు మూడు రోజుల్లో అమల్లోకి.. సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చార్జీల మోత మోగించింది. ఇంతకాలం నామమాత్రంగా ఉన్న ఫీజులను భారీగా పెంచింది. ఇప్పటికే రోడ్డు భద్రత చట్టంలో భాగంగా నిబంధనలను ఉల్లంఘించేవారికి పెనా ల్టీలను భారీగా పెంచే కసరత్తు జరుగు తుండగా... ఏ మాత్రం సమాచారం లేకుండా లైసెన్సు, ఫిట్నెస్ రెన్యూవల్ వంటి ఫీజులను పెం చేసింది. ఈమేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్ అందింది. ఆ మేరకు స్థానికంగా ఫీజులను సవరించేందుకు రవాణా శాఖ కసరత్తు ప్రారం భించింది. అదనంగా రాష్ట్ర ఫీజులు సాధారణంగా కేంద్రం నిర్ధారించిన ఫీజు లకు అదనంగా ఇతర రుసుములు జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంటుంది. అందువల్ల ఇప్పటికే కేం ద్రం అమలు చేస్తున్న ఫీజులకంటే ఎక్కువగా మన రాష్ట్రంలో రవాణా శాఖ ఫీజులు ఉన్నాయి. తాజాగా కేంద్రం పలు ఫీజులను పెంచిన నేపథ్యంలో... రాష్ట్రంలో ఆయా ఫీజులు ఏవిధంగా ఉండాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో కొత్త ఫీజులను ఖరారు చేసే అవకాశముంది. ఆ వెంటనే అవి అమల్లోకి వస్తాయి. సాధారణంగా కేంద్రం ఇలాం టి ఫీజులు సవరించేటప్పుడు భారీగా పెంచకుండా ఉంటుంది. కానీ ఈ సారి వందల్లో ఉన్న ఫీజులను వేలల్లోకి మార్చి వాహనదారులపై భారం మోపింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యూవల్ అంశం ప్రస్తుత ఫీజు కొత్త ఫీజు మోటార్ సైకిల్ 100 200 (మాన్యువల్) 400 (ఆటోమేటెడ్) మూడు చక్రాల వాహనం 100 400 (మాన్యువల్) 600 (ఆటోమేటెడ్) మీడియం/హెవీ వెహికిల్ 300 600 (మాన్యువల్) 1,000 (ఆటోమేటెడ్) (ఇవి కేంద్రం నిర్ణయించిన ఫీజులు..వీటికి రాష్ట్ర ప్రభుత్వం మరింత చేర్చి ఫీజులు నిర్ణయిస్తుంది) లైసెన్సు, మోటారు వాహనాల పాత, కొత్త ఫీజులు (రూ.లలో) (కేంద్రం నిర్ణయించిన మేర) అంశం ప్రస్తుత ఫీజు కొత్త ఫీజు తాత్కాలిక లైసెన్స్ (లెర్నర్) 30 150 డ్రైవింగ్ లైసెన్స్ 200 200 అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ 500 1,000 లైసెన్స్ రెన్యూవల్ 50 200 డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్లో ఆలస్యమైతే 100 300 (గ్రేస్ పీరియడ్ గడువు దాటితే ప్రతి సంవత్సరానికి రూ.1,000 చొప్పున అదనంగా చెల్లించాలి) డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ 2500 10,000 డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ 1,500 5,000 అభ్యంతరాలపై అప్పీలుకు ఫీజు 100 500 హైపోథికేషన్ ఒప్పందం మోటార్ సైకిల్ 100 500 మూడు చక్రాల వాహనం 100 1,000 మీడియం/హెవీ వెహికిల్ 100 3,000