breaking news
hyderabad water supply
-
హైదరాబాద్ వాసులకు సువర్ణావకాశం..
సాక్షి, హైదరాబాద్: జలమండలి నీటి బకాయిల చెల్లింపునకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు మరో వారం రోజుల్లో ముగియనుంది. గడువు కాలంలో పెండింగ్ బిల్లులను చెల్లిస్తే ఆలస్య రుసుముతో పాటు వడ్డీపై రాయితీ పొందవచ్చు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించని వినియోగదారులకు జలమండలి సువర్ణావకాశం కల్పించింది. వినియోగదారులు సకాలంలో బకాయిలు చెల్లించే విధంగా విస్తృత ప్రచారం చేపట్టింది. బకాయిలున్న కనెక్షన్లు 7 లక్షలపైనే.. జలమండలి పరిధిలో సుమారు 13.50 లక్షలు నల్లా కనెక్షన్లు ఉండగా అందులో సుమారు 7.1 లక్షల కనెక్షన్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తమ్మీద దాదాపు రూ.1,706 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ఆలస్య రుసుముతో పాటు వడ్డీ రూపంలో ఉన్న రూ.1,189 కోట్ల బకాయిలు మాఫీ కానున్నాయి.చెల్లింపు విధానం ఇలా.. జలమండలి కార్యాలయాల్లోని క్యాష్ కౌంటర్లల్లో చెల్లించవచ్చు. ఆన్లైన్ విధానంలో.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా NEFT, RTGS, BPPS ద్వారా.. జలమండలి అధికారిక వెబ్ సైట్ hyderabadwater.gov.in/enకు లాగిన్‌తో.. లైన్మెన్లు గృహాలను సందర్శించినప్పుడు వారి దగ్గర ఉండే EPOS యంత్రం ద్వారా కూడా చెల్లించవచ్చు. మీ సేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా సై తం బిల్లు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. జలమండలి అందించే QR Code స్కాన్ చేసి చెల్లించవచ్చు.వడ్డీ మాఫీ పరిధి ఇలా.. నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు. మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ బిల్లు మాఫీ చేసే అధికారం ఉంది. మొబైల్ నంబర్లకు సమాచారం జలమండలి పెండింగ్ బిల్లుల వినియోగదారుల క్యాన్ నంబర్‌కు అనుసంధానమైన మొబైల్ నంబరుకు బకాయి మొత్తం, ఎంత చెల్లించాలి, ఎంత మాఫీ అవుతుంది తదితర వివరాలన్నీ సంక్షిప్త సమాచారం పంపిస్తోంది. సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్ బుక్, ఎల్రక్టానిక్ మీడియా, ఎఫ్ఎం రేడియో, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఓటీఎస్–2024 పథకం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.నిబంధనలు ఇలా.. u ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. u గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. u గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. u ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు. u తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు ఇలా.. u ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. u గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. u గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. u ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు. u తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: సైబర్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్నారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!సద్వినియోగం చేసుకోవాలిపెండింగ్ బిల్లుల వినియోగదారులు వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువులోగా పెండింగ్ బకాయిలు చెల్లించి.. ఆలస్య రుసుం, వడ్డీ నుంచి మినహాయింపు పొందాలి. – అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ -
హైదరాబాద్ తాగునీటికి రూ. 1900 కోట్లు!
జంటనగరాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మెరుగైన తాగునీటి సరఫరా కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రూ. 1900 కోట్లతో పనులు చేపడుతోందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధితో పాటు చుట్టుపక్కల మునిసిపాలిటీలు, 164 గ్రామ పంచాయతీలలోని 30 లక్షల మందికి అదనంగా తాగునీరు సరఫరా అవుతుందని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వివరించారు. నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆయన అధికారులకు సూచించారు. Hyderabad Metro Water Works would be taking up works worth Rs 1900 Crores, to augment the water supply in GHMC area. — Min IT, Telangana (@MinIT_Telangana) October 9, 2015 This would ensure clean drinking water to an additional 30 Lakh residents living in GHMC & surrounding municipalities & 164 gram panchayats — Min IT, Telangana (@MinIT_Telangana) October 9, 2015 Minister KTR instructed officials to ensure state-of-the-art technology is used in building infrastructure & supply of water. — Min IT, Telangana (@MinIT_Telangana) October 9, 2015