breaking news
husbend condition serious..
-
భార్య మృతి...భర్త పరిస్థితి విషమం
సాక్షి, శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగుడి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు ముందు వెళుతున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో స్కూటీపై వెళుతున్న భార్య అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రంగారెడ్డి జిల్లా వేములునర్వ గ్రామానికి చెందిన దంపతులు రాములు, సుగుణ స్కూటీపై వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుగుణ సంఘటన స్థలంలో మృతిచెందగా, రాములు తీ‘ంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాల నేపథ్యంలో..
– నిద్రమాత్రలు మింగి దంపతుల ఆత్మహత్యాయత్నం – భర్త పరిస్థితి విషమం.. – గుంటూరు తరలింపు కారంచేడు: కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. భార్యను చీరాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరగగా బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కుబుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. కారంచేడు పంచాయతీ కార్యాలయం ఎదురు రోడ్డులో బోయన నాగేశ్వరరావు, సుధారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఉదయం 10 గంటలైనా తలుపులు తెరవక పోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు చెరచి చూడటంతో ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందివ్వడంతో వారు వచ్చి చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరు తీసుకెళ్లారు. సుధారాణి చీరాలలోనే చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి పూర్తి వివరాలు తెలియకున్నా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.