breaking news
Hunsa village
-
నిజామాబాద్ జిల్లా హున్సాలో ఉద్రిక్తత
-
హోలీ వేడుకల్లో వింత ఆచారం
-
హోలీ వేడుకల్లో వింత ఆచారం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో బోధన్ మండలంలోని ఓ గ్రామంలో హోలీ వేడుకల్లో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన హున్సాలో హోలీ సందర్భంగా గ్రామస్తులు పిడిగుద్దులాట ఆడారు. ఈ ఆటలో పాల్గొన్న గ్రామస్తులు ఒకరినొకరు కొట్టుకున్నారు. హోలీ రోజు ఈ విధంగా కొద్దిసేపు పిడిగుద్దులాట ఆడటం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత గ్రామస్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని.. హోలీ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఒక చోటుకు చేరి కొట్టుకునే ఆటను నిర్వహిస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
హున్సాలో పిడిగుద్దుల వర్షం
బోధన్: హోలీ పండగ వేళ కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో గురువారం పిడిగుద్దులాట ఉత్కంఠ మధ్యసాగింది. సాయంత్రం 15 నిమిషాల పాటు పిడిగుద్దులాట ఆడారు. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఐదారు ఫీట్ల ఎత్తులో ఉన్న స్తంభాలు ఏర్పాటు చేసి, మధ్యలో బలమైన తాడును కట్టారు. బుధవారం రాత్రి కాముని దహనంతో హోలీ సంబరాలు ప్రారంభించారు. గురువారం ఉదయం రంగులాడారు. సాయంత్రం 4.30 గం.కు కుస్తీ పోటీలు నిర్వహించి అనంతరం పిడిగుద్దులాటకు సిద్ధమయ్యారు. గ్రామస్తులు మొదట డప్పువాయిద్యాలతో గ్రామ పెద్దల ఇంటింటి వెళ్లి వేదిక వద్దకు పిలుచుకుని వచ్చారు. గ్రామ పెద్దలు వేదిక వద్దకు చేరుకోగానే పిడిగుద్దులాట ప్రారంభించారు. తాడుకు ఇరువైపుల ముందువరుసలో ఉన్న గ్రామస్తులు ఎడమచేతితో తాడును పట్టుకుని కుడిచేతితో పిడికిలి బిగించి ప్రత్యర్థులపై బాధారు. ఒకరినినొకరు బిగి పిడికిలితో కొట్టుకున్నారు. ఆట ముగిసినంతరం తాడు ఇరువైపుల మోహరించిన గ్రామస్తులు ఒకరినొకరు ఆలంగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా, గతంలో పిడిగుద్దులాట గంటపాటు కొనసాగేది. పోలీసు అధికారుల సూచన మేరకు ప్రతి ఏటా సమయాన్ని కుదిస్తున్నారు. ఈ సందర్భంగా బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, టౌన్ సీఐ వెంకన్న నేతృత్వంలో బందో బస్తు నిర్వహించారు.