breaking news
hundai global suv
-
టాప్‌గేర్‌లో ఆటో సేల్స్
జీఎస్టీ సంస్కరణలతో బలపడిన వృద్ధి ధోరణిని ఆసరాగా చేసుకొని ప్రముఖ ఆటో సంస్థలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, హ్యుందాయ్ మోటార్లు జనవరిలోనూ గణనీయమైన వాహన అమ్మకాలను నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జనవరిలో 1,74,529 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే ఏడాది అమ్ముడైన 1,73,599 వాహనాలతో పోలిస్తే 0.50% అధికంగా ఉన్నాయి. విదేశాలకు చేసిన ఎగుమతులు(51,020), ఇతర సంస్థలకు అమ్మకాలు(7,643) కలిపి మొత్తం విక్రయాలు 2,36,963 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘మునుపెన్నడూ లేనంతంగా నెలవారీ ప్రాతిపదికన మొత్తం 2,36,963 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్రతిరోజూ 9,000 నుంచి 10,000 బుకింగ్స్ నమోదవుతూ.., మొత్తం 2.78 లక్షలకు మించి బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి వార్షిక ప్రతిపాదికన ఇవి 25% అధికం. కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఎస్యూవీ విక్టోరిస్ అయిదు నెలల్లో 50వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. ఉత్పత్తి కొరతపై స్పందిస్తూ..., కొత్త ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీకి కొరత కష్టాలు తప్పవన్నారు.టాటా ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ జనవరిలో మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 46% వృద్ధి నమోదైంది.మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా 63,510 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే అక్టోబర్ అమ్మకాలు 50,659 యూనిట్లతో పోలిస్తే ఇవి 25% అధికంగా ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 59,107 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే జనవరిలో అమ్మిన 54,003 యూనిట్లతో పోలిస్తే ఇవి 9% అధికం.టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాల వృద్ధి 17% పెరిగి 26,178 నుంచి 30,630 యూనిట్లకు చేరింది.రెనో ఇండియా డీలర్ల పంపిణీ 34% పెరిగి 3,715 యూనిట్లకు చేరింది. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 2,780 యూనిట్లుగా ఉన్నాయి.కియా ఇండియా వార్షిక అమ్మకాల వృద్ధి 10% పెరిగి 27,603 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘కొత్త ఏడాది (2026) ప్రోత్సాహకర ప్రారంభం కియా బ్రాండ్‌పై కస్టమర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్త తరం సెల్టోస్‌కు లభిస్తున్న సానుకూల స్పందన, సోనెట్‌కు కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్, అలాగే కారెన్స్ క్లావిస్, క్లావిస్ ఈవీ మోడళ్లకు పెరుగుతున్న ఆదరణ పరిశీలిస్తే కియా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో బలం, సమతుల్యతకు అద్దం పడుతుంది’’ అని కియా ఇండియా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు.ఇదీ చదవండి: మార్కెట్లు జోరందుకుంటాయా? -
న్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనె.. ఏ కంపెనీకంటే..
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను తమ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. షారుక్ ఖాన్ తర్వాత దీపికా పదుకొనెను రెండో బ్రాండ్ అంబాసిడర్‌గా హ్యుందాయ్ ఇండియా నియమించుకున్నట్లు తెలిపింది. షారుక్ ఖాన్ స్థానంలో దీపికా పడుకొనె తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతుందా లేక ఇద్దరూ కలిసి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తారా అనే విషయంలో కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసాధారణ నైపుణ్యం, నటనా సామర్థ్యం కలిగిన గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపికా పడుకొనెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు ఆమె తిరుగులేని ఆకర్షణ శక్తి, అద్భుతమైన కెరియర్ హ్యుందాయ్ మోటార్ ఇండియాకు ఉపయోగపడుతుందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 2021 నాటికి భారతదేశంలో 17% మార్కెట్ వాటాను కలిగి ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని అనుబంధ సంస్థ కియాతో కలిసి 2022లో భారతదేశంలో 10 లక్షల కార్లను తయారుచేసింది. ఈ రెండు కంపెనీలు కలిసి ప్రస్తుతం దేశంలో దాదాపు 23% వాటాను కలిగి ఉన్నాయి. -
‘కియా’ చౌకధర ఎలక్ట్రిక్ వాహనాలు..!
న్యూఢిల్లీ: అతి తక్కువ ధరలతో ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్‌కు అందించాలని భావిస్తున్నట్లు దక్షిణ కొరియా సంస్థ కియా మోటార్స్ ప్రకటించింది. ఇందుకోసం హ్యుందాయ్ మోటార్స్‌తో కలిసి ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై సంస్థ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాన్–వూ పార్క్ మాట్లాడుతూ.. ‘తక్కువ ధరతో ఎలక్ట్రిక్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టాలనే అంశంపై దృష్టిసారించాం. భాతర ప్రభుత్వ మద్దతు విధానం, మౌలిక సదుపాయాల అంశాల ఆధారంగా తుది నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని అన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంస్థ ఇప్పటికే హైబ్రిడ్, ప్లగ్–ఇన్–హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్, ఫ్యూయల్ సెల్ వాహనాలను విక్రయిస్తోంది. -
మార్కెట్లోకి హ్యుందాయ్ గ్లోబల్ ఎస్యూవీ
హిమాయత్‌నగర్: హ్యుందాయ్ కొత్తగా ప్రవేశపెట్టిన గ్లోబల్–ఎస్యూవీ కారును సంస్థ సౌత్ రీజనల్ సేల్స్ మేనేజర్ ఎంఏ సలీమ్ అమీన్ గురువారం హిమాయత్‌నగర్‌లోని లక్ష్మీ హ్యుందాయ్ షోరూమ్‌లో మార్కెట్లోకి విడుదల చేశారు. సరికొత్త టుక్సాన్ డైనమిక్ లైనప్‌తో దీనిని ప్రవేశపెడుతున్నామన్నారు. అత్యాధునిక సాంకేతికత, ఉన్నత ప్రమాణాలతో నేటి తరం అభిరుచులకు అనుగుణంగా దీనిని రూపొందించామని సీఈఓ భాస్కరరాజు చెప్పారు. పెట్రోల్, డీజిల్ మోడల్స్‌లో ఈ కారు లభ్యమవుతుందన్నారు.


