breaking news
Hotel Facilities
-
హీరోలకు అండగా ఉందాం
‘‘ప్రస్తుతం అందరం కష్టకాలంలో ఉన్నాం. ఈ సమయంలో మనందరి కోసం పోరాడుతున్న హీరోలకు (వైద్య శాఖ, ఇతర అత్యవసర సిబ్బంది) మనం అండగా నిలబడాలి’’ అంటున్నారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. చెప్పినట్లే నిలబడుతున్నారు ఆయన. ముంబైలో సోనూకి ఓ హోటల్ ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల అది మూసివేశారు. అయితే ఆరోగ్యశాఖలో పని చేస్తున్నవాళ్లు వినియోగించుకునేందుకు వీలుగా ఆ హోటల్ ను తెరచి ఉంచబోతున్నట్టు ప్రకటించారు సోను. ‘‘వాళ్లు చేస్తున్న దానితో పోలిస్తే నేను చేస్తున్నది పెద్ద సహాయం కూడా కాదు. మనందరం కలసి ఈ సమస్య (కరోనా)ను దాటుదాం’’ అని పేర్కొన్నారు సోనూ సూద్. -
ప్రైవేట్ చేతికి ‘మహారాష్ట్ర సదన్’!
సాక్షి, ముంబై: ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐదు నక్షత్రాల ‘మహారాష్ట్ర సదన్’ నిర్వహణ భారంగా మారింది. దీంతో ఇందులో కొన్ని గదులను ఐదు నక్షత్రాల హోటళ్లకు అద్దెకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సదన్ ప్రారంభం నుంచి వివాదాస్పదంగా మారింది. విపరీతమైన అద్దె వసూలు చేయడంవల్ల దీని ఛాయలకు ఎవరూ రావడం లేదు. దీంతో 100 గదులను బీఓటీ పద్ధతిలో ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ పథకం అమలైతే ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.12 కోట్లు లాభం రావడంతోపాటు నిర్వహణ బెడద కూడా తప్పుతుంది. ప్రజాపనులు, కట్టడాల శాఖ (పీడబ్ల్యూడీ) పెత్తనానికి అడ్డుకట్టవేసేందుకే ఈ పథకం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడు జూన్ ఒకటో తేదీన ఈ భవనాన్ని పీడబ్ల్యూడీ నుంచి రెసిడెన్స్ కమిషనర్ బిపిన్ మాలిక్ స్వాధీనం చేసుకున్నారు. నాలుగో తేదీన ఈ భవనానికి ప్రారంభోత్సవం జరిగింది. కాని ఆనాటి నుంచి ఈ సదన్‌లో అనేక అసౌకర్యాలు ఉన్నట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రజా ప్రతినిధుల కోసం కనీసం రూ.100 నుంచి రూ.200 వరకు, ఇతరులకు కనీసం రూ.800-రూ.1200 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. కాని ఐదు నక్షత్రాల హోటల్ సౌకర్యాలు కావాలంటే ప్రజాప్రతినిధులు కనీసం రూ.3000- రూ.5000, ప్రైవేట్ వ్యక్తులైతే రూ.5000-8000 వరకు వసూలుచేయాలని ప్రతిపాదన రూపొందించారు. దీన్ని అందరూ వ్యతిరేకించడంతో 50 శాతం గదులు ప్రజాప్రతినిధులకు రిజర్వుచేసి, మిగిలిన గదులను ఐదు న క్షత్రాల హోటళ్లకు అద్దెకు ఇవ్వాలనే ప్రత్యామ్నాయ ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారు. దీని ద్వారా నిర్వహణ భారాన్నుంచి తప్పుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.