ఖర్గేకు పేస్‌మేకర్
బెంగళూరు: ఏఐసీసీ చీఫ్(AICC Chief) మల్లికార్జున ఖర్గే(83) ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇటు వైద్యులు, అటు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ని నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. జ్వరం, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడుతున్నట్లు తొలుత వైద్యులు ప్రకటించారు. అయితే.. ఆయనకు ఫేస్మేకర్(Kharge pacemaker) అమర్చాలని వైద్యులు సూచించారట. ఈ విషయాన్ని ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గ్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందన్న ఆయన.. ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. ప్రత్యేక వైద్య బృందం ఖర్గేకు చికిత్స అందిస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రికి వెళ్లి ఖర్గేను పరామర్శించారు. మరోవైపు.. Sri Kharge was advised pacemaker to be implanted and is admitted to the hospital for the planned procedure. He is stable and doing well.Grateful to all of you for your concern and wishes.— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) October 1, 2025ఖర్గే అస్వస్థత(Mallikarjun Kharge Hospitalised) వార్తతో కాంగ్రెస్ శ్రేణులు అందోళన వ్యక్తం చేశాయి. పార్టీ సీనియర్ నేతలు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 7వ తేదీన కోహిమా(నాగాలాండ్)లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ఖర్గే హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. పూర్తిగా కోలుకునేంత వరకు ఆస్పత్రిలోనే ఉంటారని ఖర్గే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఆ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు.పేస్‌మేకర్ అంటే.. హృదయ స్పందన (heart rhythm) సరిగ్గా లేకపోతే దాన్ని నియంత్రించేందుకు శరీరంలో అమర్చే చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. వయసు పైబడిన వాళ్లలో.. హార్ట్‌బీట్ మందగించిన సమస్యలుంటే దీనిని అమరుస్తారు. ఇదీ చదవండి: నన్ను ఏమైనా చేస్కోండి, కానీ..: టీవీకే విజయ్ ఆవేదన