breaking news
Honor 8 Lite
-
హానర్ 8 లైట్ వచ్చేసింది..
హువావే తన పాపులర్ హానర్ 8 స్మార్ట్ ఫోన్ లో సరికొత్త వెర్షన్ ను లాంచ్ చేసింది. హానర్ 8 లైట్ పేరుతో కంపెనీ ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.17,999గా కంపెనీ పేర్కొంది. అందుబాటులోని అన్ని మొబైల్ స్టోర్ లలో ఈ ఫోన్ విక్రయానికి ఉండనుందని కంపెనీ తెలిపింది. హానర్ 8 లైట్ ఫీచెర్లెలా ఉన్నాయో ఓ సారి లుక్కేయండి.. ఆక్టాకోర్ సీపీయూ 4జీబీ ర్యామ్ 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం గ్లాస్, మెటల్ యునిబాడీ డిజైన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 7.0 నోగట్ డ్యూయల్ సిమ్, వాయిస్ఓవర్ సపోర్టు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 12 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా తొలుత ప్రీమియం బ్లాక్ రంగులో అందుబాటులో ఉండే ఈ ఫోన్, తర్వాత బ్లూ రంగులో కూడా అందుబాటులోకి వస్తోంది. -
హానర్ 8 లైట్ లాంచింగ్..రేపే
న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 8 లైట్'ను భారత మార్కెట్ లో రేపే (11 మే) విడుదల చేయనుంది. ఎప్పటినుంచో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలపై పలు వార్తలు వచ్చినప్పటికీ తాజాగా మూడు రోజుల్లో బిగ్ సర్ప్రైజ్ అంటూ హానర్ ఇండియా ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ హింట్ తో హానర్ 8 లైట్‌ను గురువారం లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. అయితే ఫీచర్లు, ధర, లాంచింగ్ పై కచ్చితమైన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ 8 లైట్ ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లో వినియోగదారులకు లభ్యం కానుందని తెలుస్తోంది. అలాగే బ్లూ,గోల్డ్, వైట్ అండ్ బ్లాక్ కలర్స్‌లో ఈ డివైస్‌ను అందుబాటులోకి తేనుంది. ఓన్లీ మొబైల్స్.కాం అందించిన సమాచారం ప్రకారం దీని ధర రూ. 17,999గా నిర్ణయించినట్టు సమాచారం. The big surprise unveils in just 3 days and we can barely curb the excitement! Stay tuned as it’s going to a great one. #LiveLite pic.twitter.com/3e6XsP1L7d — Honor India (@HiHonorIndia) May 9, 2017