breaking news
Honor 6X
-
డిస్కౌంట్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు
హువావే తన హానర్ బ్రాండులోని రెండు స్మార్ట్ఫోన్లపై పరిమిత కాల వ్యవధిలో డిస్కౌంట్లను ప్రకటించింది. హానర్ 6 ఎక్స్, హానర్ 8 ప్రొలపై అమెజాన్.ఇన్‌లో డిస్కౌంట్లను అందించనున్నట్టు పేర్కొంది. హానర్ 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ, 64జీబీ వేరియంట్లపై రూ.2000 డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొనగా.. హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4వేల దాకా డిస్కౌంట్ అందిస్తోంది. మంగళవారం నుంచి డిసెంబర్19 మంగళవారం వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. హానర్ 6 ఎక్స్ స్మార్ట్‌ఫోన్ జనవరిలో లాంచ్ అయింది. డిస్కౌంట్ అనంతరం హానర్ 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్ రూ.9,999కు అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ ధర అంతకముందు 11,999 రూపాయలుగా ఉండేది. అదేవిధంగా రూ.13,999గా ఉన్న హానర్ 6ఎక్స్ 64జీబీ వేరియంట్ రూ.11,999కు లభ్యమవుతుంది. హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.25,999కు లభ్యమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 29,999 రూపాయలు. హానర్ 6ఎక్స్, హానర్ 8 ప్రొలపై డిస్కౌంట్లు ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. అంతకముందు కూడా హానర్ ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. -
హువాయ్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: హువాయ్ తనకొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎక్స్ సిరీస్ లో 5 ఎక్స్ తో విజయం సాధించిన కంపెనీ ఇపుడు 'హానర్ 6 ఎక్స్'ను లాంచ్ చేసింది. 3 జీబీ వేరియంట్ ధరను రూ.12,999 గా కంపెనీ నిర్ణయించింది. 3 జీబీ 4 జీబీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అమెరికాలో విడుదలైన దీని ధర సుమారు రూ.16,996గా ఉంది. హానర్ 6 ఎక్స్ ఫీచర్లు 5.50 అంగుళాల స్క్రీన్ ఆక్టా కోర్ ప్రాసెసర్ 1080x1920 రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 4 జీబీ ర్యామ్64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 3340ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ