breaking news
Home furniture
-
పాతకాలం వుడెన్ వస్తువులే.. అయినా ఇంత అందంగా!
రీసైక్లింగ్ అనేదిప్పుడు గృహాలంకరణలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. కలపే కాదు ఫ్యాబ్రిక్ కూడా అందులో భాగమైంది. రీసైకిల్ వుడెన్ ఫర్నిచర్‌తోపాటు పాతకాలం వుడెన్ వస్తువులు కొద్దిపాటి మార్పుచేర్పులతో అద్భుతమైన షోపీసెస్గా అమరిపోతున్నాయి.ఇంట్లోని రకరకాల ఫ్యాబ్రిక్స్ కూడా! పలు కళాత్మక రూపాలుగా కొలువుదీరి ఇంటి హోదాను.. విలువను పెంచుతున్నాయి. ఇలా రీసైక్లింగ్ మెటీరియల్‌తో విండో బ్లైండ్స్ నుంచి ఆరుబయట అలంకారాల వరకు ప్రతీదాంట్లోనూ మనదైన సృజనను చూపించవచ్చు.విండోస్‌కి జూట్, ఆకులతో అల్లిన చాపలను ఉపయోగించవచ్చు. వెదురుతో చేసిన రకరకాల వస్తువులు, ఫర్నిచర్‌ను బాల్కనీలో అమర్చుకోవచ్చు. వీటివల్ల ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అనుభూతి కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యామనే ఆనందమూ మిగులుతుంది.ఇవి చదవండి: అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు -
‘ఫర్నిచర్ స్టోరేజ్’కు కలిసొచ్చిన కరోనా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్ ఐటీ ఉద్యోగి. హైదరాబాద్‌లో ఫ్యామిలీతో కలిసి అద్దెకుంటున్నాడు. గతేడాది కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో కంపెనీ వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ ఇచ్చింది. పరిస్థితులు మాములుగా మారితే మళ్లీ రావొచ్చులే అనుకొని సొంతూరుకు వెళ్లిపోయాడు. ఏడాదిన్నర దాటినా సేమ్ సీన్. నగరంలో అద్దె భారం భరించలేక.. ఇంట్లోని ఫర్నిచర్‌ను తక్కువ అద్దె వసూలు చేసే స్టోరేజ్ గోడౌన్‌కు షిప్ట్ చేశాడు. హైటెక్‌సిటీలోని ఓ కంపెనీ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ బాధ్యతలు అప్పగించింది. మరి, ఆఫీసులోని ఏసీలు, ఫ్యాన్లు, ఇతరత్రా ఫర్నిచర్‌ను అలాగే వదిలేస్తే నిర్వహణ భారమవుతుందని, స్టాఫ్ లేని ఆఫీసుకి అద్దె చెల్లించడం అనవసరమని ఫర్నిచర్ మొత్తాన్ని స్టోరేజ్ గోడౌన్‌కు తరలించింది.. ఇలా కరోనా నేపథ్యంలో ఫర్నిచర్ స్టోరేజ్ కంపెనీలకు గిరాకీ పెరిగింది. ఇల్లు, ఆఫీసుల్లోని ఫర్నిచర్ కోసం ప్రతినెలా వేల రూపాయల అద్దెను చెల్లించడం భారమైన ఉద్యోగులు, కంపెనీలకు ఫర్నిచర్ స్టోరేజ్ గోడౌన్ సర్వీసులు యూజ్‌ఫుల్‌గా మారాయి. అద్దెలో సగం కంటే తక్కువ ఖర్చుకే స్టోరేజీ, బీమా, భద్రత సేవలను అందిస్తున్నాయి. డిమాండ్ పెరిగింది.. ఫర్నిచర్ స్టోరేజ్ సర్వీస్‌లు కొత్తమీ కాదు. గతంలో వినియోగదారులు, బిజినెస్ టూరిస్ట్‌లు హోమ్ రెనోవేషన్ లేదా కంపెనీలు రీలొకేషన్ సమయంలో ఫర్నిచర్ స్టోరేజ్ సర్వీస్‌లను వినియోగించుకునేవి. కానీ, ఇప్పుడు కరోనా, లాక్‌డౌన్‌తో సొంతూర్లకు వెళ్లినవారు రెండేళ్లయినా తిరిగిరాని పరిస్థితి. ఇక్కడ ఉన్నా లేకున్నా ఇంటి అద్దెలు చెల్లించాల్సిందే. చాలామంది రెంట్ భారం తగ్గించుకునేందుకు ఇళ్లను ఖాళీ చేసి సామాన్లను వేర్‌హౌస్‌లో పెడుతున్నారు. వస్తువులను బట్టి ధరలు ఉండటం, కాలపరిమితి లేకపోవటం, బీమా, భద్రత ఏర్పాట్లు ఉండటంతో డిమాండ్ ఏర్పడింది. కరోనా కంటే ముందు ఈ రంగం వృద్ధి ఏటా 20–30 శాతంగా ఉండేది.. ప్రస్తుతం 50–60 శాతంగా ఉంది. వస్తువులను బట్టి చార్జీలు.. స్టోనెస్ట్, సేఫ్స్టోరేజ్, స్టోర్గనైజ్ వంటి వందలాది కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాలలో సేవలను అందిస్తున్నాయి. శివారు ప్రాంతాలలో వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేసి ఫర్నిచర్‌ను భద్రపరుస్తున్నాయి. స్టోనెస్ట్‌కు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే నాలుగు నగరాలలో కలిపి 5 లక్షల చదరపు అడుగు (చ.అ.)లలో, సేఫ్‌స్టోరేజ్‌కు 7.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో వేర్‌హౌస్‌లున్నాయి. 4 నగరాల్లో స్టోనెస్ట్‌కు 1000 కంపెనీలు, 10 వేల మంది కస్టమర్లున్నారు. సేఫ్‌స్టోరేజ్‌కు 300 కంపెనీలు, 12 వేల మంది యూజర్లున్నారు. వస్తువుల సైజ్‌ను బట్టి స్టోరేజీ ధరలుంటాయి. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీ, టీవీ, బెడ్, పరుపు, కప్‌బోర్డ్స్, అల్మారా, సోఫా, డైనింగ్ టేబుల్ వంటి పెద్ద సైజు ఫర్నిచర్లకు ఒక్కో దానికి నెలకు రూ.130, కుర్చీలు, వాటర్ప్యూరిఫయ్యర్, ఎయిర్ కూలర్, టేబుల్ ఫ్యాన్లు వంటి మిడియం సైజ్ అప్లియెన్సెస్‌కు రూ.70, పాదరక్షలు, బట్టలు, బెడ్షీట్లు, గ్యాస్ స్టవ్, సీలింగ్ ఫ్యాన్లు, కుక్కర్, మైక్రోవేవ్ వంటి స్మాల్ అప్లియెన్సెస్‌కు రూ.35 చార్జీలుంటాయి. కంపెనీలకు చ.అ.లను బట్టి ధరలుంటాయి. నెలకు 300 చ.అ.లకు రూ.21 వేలు, 450 చ.అ.లకు రూ.28 వేలుగా ఉన్నాయి. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌లతో భద్రత.. ప్యాకింగ్, మూవింగ్, స్టోరేజ్ అంతా కంపెనీలే చూసుకుంటాయి. ఆర్డర్ రాగానే స్టోరేజ్ కంపెనీకి చెందిన బృందం కస్టమర్ల ఇంటికి వెళ్తుంది. కస్టమర్ రాలేకపోతే బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా కానీ షిఫ్టింగ్ టైమ్‌లో ఉండాలని చెప్తారు. ఎవరూ లేకపోతే కస్టమర్‌కు వీడియో కాల్ చేసి వారి చెప్పిన వస్తువులను ప్యాకింగ్ చేసి గోడౌన్‌కు తరలిస్తారు. అక్కడ కస్టమర్ పేరు రాసి సామన్లను భద్రపరుస్తారు. సీసీటీవీ కంట్రోల్లో ఉంచడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు. వస్తువులకు డ్యామేజీ జరిగితే రూ.3–5 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. నెలకొకసారి పెస్ట్ కంట్రోల్ చేయడం, ఫర్నిచర్ ఫొటోలు, వీడియోలు తీసి కస్టమర్లకు పంపుతారు. కంపెనీల ల్యాప్‌ట్యాప్‌లు, డాక్యుమెంట్ల వంటి వాటిని ప్రత్యేకమైన గదులలో పెట్టి వాటికి బార్కోడ్ ట్రాకింగ్, బయోమెట్రిక్ సిస్టమ్‌తో యాక్సిస్‌ను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లో రోజుకు 60–70 ఆర్డర్లు.. స్టోనెస్ట్‌కు కొంపల్లిలో 60 వేల చ.అ.లలో రెండు గిడ్డంగులున్నాయి. 2,500 మంది వ్యక్తిగత కస్టమర్లున్నారు. క్లౌడ్‌ఎరా, జెన్‌డెస్క్ వంటి 150 కంపెనీలు ఫర్నిచర్, ల్యాప్‌ట్యాప్స్ ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులను నిల్వ చేసుకున్నాయని స్టోనెస్ట్ స్టోరేజ్ మార్కెటింగ్ హెడ్ రాహుల్ తెలిపారు. ప్రీ–కోవిడ్ సమయంలో 4 నగరాల్లో నెలకు 300–400 కాల్స్ వచ్చేవి. ఇప్పుడు 800–1000 కాల్స్ వస్తున్నాయి. వీటిల్లో 150–200ల బుక్సింగ్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో రోజుకు 60–70 ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఫర్నిచర్‌కు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే ఢిల్లీ, కోల్కత్తా నగరాలలో సేవలను ప్రారంభించనున్నాం. మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి ఆంధ్రప్రదేశ్‌లో సేవలను విస్తరిస్తామని తెలిపారు. -
కావాల్సిన ఫర్నిచర్... ఆన్లైన్లో!
⇒ గదిని బట్టి మనమే ఫర్నీచర్‌ను ఎంచుకునే వీలు ⇒ కస్టమ్ఫర్నిష్.కామ్ సరికొత్త సేవలు ⇒ రూ.16 కోట్ల పెట్టుబడులు పెట్టిన సంస్థలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటికి ఫర్నిచర్ ఎలా ఉండాలి? తెలుసుకోవటానికి నాలుగు షాపులు తిరగటం... తక్కువ మోడల్స్ ఉంటాయి కనక ఎక్కువ చోట చూడటం... చివరికి ఎక్కడో ఒక చోట రాజీపడటం!!. చాలామంది చేస్తున్నదిదే. ఇపుడు ఆ అవసరం లేకుండా నచ్చిన ఫర్నిచర్‌ను మన టేస్ట్‌కు తగ్గట్టుగా మనమే సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని... అది కూడా ఇంట్లో నుంచే కొనుక్కునే అవకాశాన్ని ఆన్లైన్ సంస్థలు అందిస్తున్నాయి. ఇంటికి కావలసిన బెడ్స్, వార్డ్ రోబ్స్, డైనింగ్ టేబుల్, కిచెన్... ఇలా ఏ ఫర్నిచర్ కావాలన్నా ఆర్డరిచ్చేయొచ్చు. ఇంట్లోని గది సైజులకు సరిగ్గా సరిపోయేలా నచ్చిన రంగు, నచ్చిన మెటీరియల్.. ఇలా మన అభిరుచికి అనుగుణంగా ఏం కావాలంటే అది ‘కస్టమ్ఫర్నిష్.కామ్’ ద్వారా మనమే ఎంచుకోవచ్చు. ఈ హైదరాబాదీ సంస్థలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. దీనికి సంబంధించి సంస్థ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ మధుకర్ గంగాడీఏమంటారంటే... - సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అభిరుచికి తగ్గ ఫర్నీచర్ ఉండాలనుకోవటం తప్పేంకాదు. కానీ రిటైల్ షాపులు ఆ కోరికను తీర్చట్లేదు. వారు తయారు చేసిన ఫర్నీచర్‌లో మనకు నచ్చింది ఎంచుకుంటున్నాం. అంతే!!. కానీ, కస్టమ్ఫర్నిష్.కామ్‌లో మనకు నచ్చిన ఫర్నీచర్‌ను మనమే ఎంచుకునే వీలుంది. కస్టమ్ఫర్నిష్.కామ్ వెబ్‌సైట్‌కు వెళ్లగానే వార్డ్రోబ్స్, మాడ్యులర్ కిచెన్స్, సోఫాలు, ఫుల్ హౌజింగ్ ఫర్నీషింగ్ అనే విభాగాలు కన్పిస్తాయి. కావాల్సిన విభాగాన్ని ఎంచుకొని ఇంట్లోని గది సైజులను, నచ్చిన రంగు, మెటీరియల్.. అంతేకాదండోయ్ ఆయా ఫర్నీచర్ల మీద మనకు నచ్చిన ఫొటోలు, థీమ్‌లు ఇలా ఇలా ఎలా కావాలంటే అలా తయారు చేయించుకోవచ్చు. 7-15 రోజుల్లో డెలివరీ.. ఫర్నిచర్ ఎంచుకున్నాక ధర కూడా పక్కనే డిస్ప్లే అవుతుంటుంది. 50 శాతం అడ్వాన్స్ చెల్లించిన తర్వాత.. 7-15 రోజుల్లో ఇంటికి డెలివరీ చేస్తాం. ప్రతి ఫర్నీచర్‌పైనా గ్యారంటీ ఇస్తాం. కస్టమ్ఫర్నిష్.కామ్‌లో కొనే ప్రతి ఫర్నీచర్ రిటైల్ షాపులో కంటే 30 శాతం తక్కువ ధరకే వస్తుంది. ఇతర ఆన్లైన్ పోర్టళ్ల కంటే 40 శాతం తక్కువ ధరకు లభిస్తుంది. ఏడాదిన్నరలో 10 ఫ్యాక్టరీలు ప్రస్తుతం మూసాపేట్లో 30 వేల చ.అ. విస్తీర్ణంలో ఫర్నీచర్ తయారీ యూనిట్ ఉంది. నెల రోజుల్లో 60 వేల చదరపు అడుగుల్లో మరో యూనిట్‌ను ప్రారంభిస్తాం. వచ్చేనెల్లో బెంగళూరు, చెన్నై నగరాలకు, ఆరు నెలల్లో ఢిల్లీ, కోల్కత్తా, ముంబై నగరాలకు విస్తరిస్తాం. ఏడాన్నరలో దేశవ్యాప్తంగా 10 ఫ్యాక్టరీలను నెలకొల్పుతాం. ఒక్కో ఫ్యాక్టరీపై రెండున్నర కోట్ల పెట్టుబడులు పెడతాం. రూ.16 కోట్ల పెట్టుబడులు.. తొలిసారిగా హైదరాబాద్‌లో మా సంస్థకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (సిడ్బీ) రూ.3 కోట్ల రుణం మంజూరు చేసింది. అలాగే డీఆర్ఎల్ చైర్మన్ సతీష్ రెడ్డి, పీపుల్ కేపిటల్ శ్రీని రాజు, హైదరాబాద్ ఏంజిల్స్ ఫౌండర్ శ్రీని కొప్పోలు, గ్రీన్కో గ్రూప్ అనిల్ చలమశెట్టి వ్యక్తిగతంగా రూ.16 కోట్ల పెట్టుబడులను పెట్టారు. త్వరలోనే మ రో రూ.100 కోట్ల పెట్టుబడుల కోసం రౌండ్స్ నిర్వహిస్తాం. ఫర్నీచర్ పరిశ్రమ 20 బిలియన్ డాలర్లు.. దేశంలో ఫర్నీచర్ మార్కెట్ విలువ 20 బిలియన్ డాలర్లు. దీన్లో 15 శాతం వాటా సంఘటిత రంగానిది. 2-3 శాతం వాటా మాత్రమే ఆన్లైన్ ఫర్నీచర్ కంపెనీలది. ఇది చాలు దేశంలో ఆన్లైన్లో ఫర్నిచర్ అమ్మకాలకు ఎంత అవకాశముందో చెప్పడానికి. అసంఘటిత రంగ ఉత్పత్తులు ఎక్కువగాఉండటం, రవాణా ఛార్జీలు కలిసి రిటైల్ షాపుల్లో ఎక్కువ ధరకు కారణమవుతున్నాయి. ఇది కూడా ఆన్‌లైన్‌కు కలిసొచ్చేదే.