breaking news
home for all
-
అందరికీ ఇళ్లు కింద 34 పట్టణాలు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంపిక చేసిన కేంద్రం కేంద్ర రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఇప్పటికే తొలివిడతగా రూ. 179.03 కోట్లు విడుదల మంచిర్యాల, భైంసా, రామగుండంలను చేర్చాలంటూ రాష్ట్రం వినతి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలోని 34 నగరాలు, పట్టణాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, రాష్ట్ర పురపాలక శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంపికైన నగరాల్లో హైదరాబాద్, వరంగల్‌తో పాటు అమృత్ పథకం కింద ఎంపికైన 9 నగరాలు, పట్టణాలున్నాయి. ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రానికి తొలి విడతగా రూ.179.03 కోట్లను కేంద్రం విడుదల చేసింది. కాగా, మంచిర్యాల, రామగుండం, భైంసా పట్టణాలను కూడా ఈ పథకం కింద ఎంపిక చేయాలని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం త్వరలో ప్రతిపాదనలు పంపనుంది. పట్టణాలు, నగరాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సర్వే చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితాను తయారుచేయనుంది. వారికి గృ హాలు నిర్మించి ఇచ్చేందుకు కావాల్సిన నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు కేంద్రం కేటాయించనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం, లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్న రాష్ట్ర ప్రభు త్వ హామీల నేపథ్యంలో ఒక్కో ఇంటిపై అదనంగా రూ.2 లక్షలు రాష్ట్రం భరించాల్సి ఉం టుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
'గతం గుర్తుచేసుకుని బాధ పడాల్సినవసరం లేదు'
-
'గతం గుర్తుచేసుకుని బాధ పడాల్సినవసరం లేదు'
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. అమృత్, అందరికీ గృహాలు, స్మార్ట్ సిటీస్ మిషన్ పథకాలను న్యూఢిల్లీలో గురువారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. వీటిలో భాగంగా 100 ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని పథకాలు రూపొందిస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడగలమా అన్న సందేహం వద్దని ఆయన పేర్కొన్నారు. ప్రణాళికా బద్దంగా ముందడుగు వేస్తే లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నగరాలు ఎలా అభివృద్ధి చెందాలన్నదానిపై చర్చిద్దామని, గతాన్ని గుర్తుచేసుకుని బాధపడాల్సిన అవసరంలేదన్నారు. పేదోళ్లకు ఇళ్లు కట్టించడమే కాదు, ఆత్మవిశ్వాసంతో బతికేలా చేద్దామని ప్రధాని మోదీ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 5 ఆకర్షణీయ నగరాలు, అమృత్ పట్టణాల ఆధునికీకరణను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఆకర్షణీయ నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపిక చేసిన ఒక్కో నగరానికి ఏడాదికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.