ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. అమృత్, అందరికీ గృహాలు, స్మార్ట్ సిటీస్ మిషన్ పథకాలను న్యూఢిల్లీలో గురువారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. వీటిలో భాగంగా 100 ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 5 ఆకర్షణీయ నగరాలు, అమృత్ పట్టణాల ఆధునికీకరణను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఆకర్షణీయ నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపిక చేసిన ఒక్కో నగరానికి ఏడాదికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.