breaking news
hint
-
ఉత్తర కొరియాతో పెట్టుకుంటున్న ట్రంప్.. కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ?
వాషింగ్టన్: ఉత్తరకొరియాతో సత్సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సమక్షంలో కొరియా ద్వీపకల్పంలో శాంతిని తీసుకురావాలనే తన కోరికను అభివ్యక్తం చేశారు. ఇందుకోసం ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం కావాలనుకుంటున్నట్లు తెలిపారు.ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లీని తొలిసారిగా ట్రంప్ వైట్‌హౌస్‌కు స్వాగతించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో తగిన సమయంలో కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తనతో మంచిగా వ్యవహరించారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా,దక్షిణ కొరియా సమావేశంలో.. లీ జే మ్యుంగ్ కూడా ట్రంప్ సారధ్యంలో కొరియా ద్వీపకల్పానికి శాంతి చేకూరాలనే అభిలాషను వ్యక్తం చేశారు.ప్రపంచంలో ప్రత్యేక దేశంగా పేరొందిన కొరియా ద్వీపకల్పంలో ట్రంప్ శాంతిని తీసుకురాగలరని ఆశిస్తున్నానని, కిమ్ జోంగ్ ఉన్‌కు సన్నిహితులు కాగలరని, ఉత్తర కొరియాలో ట్రంప్ ప్రత్యేక ప్రపంచాన్ని (రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్) నిర్మించగలరని లీ జే మ్యుంగ్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించలేదు. అయితే దక్షిణ కొరియాతో యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా మీడియా ప్రత్యేక దృష్టి సారించిందని సమాచారం. కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోవాలనే కాంక్ష అమెరికాలో ఉందనే అభిప్రాయాన్ని ఉత్తర కొరియా వ్యక్తం చేసింది.కాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు వైట్ హౌస్ నుంచి పదేపదే ఆహ్వానాలు అందినప్పటికీ అతను విస్మరిస్తూనే వస్తున్నారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనూ ఉత్తరకొరియాతో దౌత్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. గడచిన జూలైలో ట్రంప్.. కిమ్‌తో భేటీని కోరుతూ లేఖ రాయగా, దానిని ఉత్తర కొరియా ఐక్యరాజ్యసమితి కార్యాలయ సిబ్బంది తిరస్కరించారని ఉత్తర కొరియా మీడియా తెలిపింది. -
నేడు రాయ్‌బరేలీ సీటుపై రాహుల్ కీలక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో కలిసి నేడు (మంగళవారం) యూపీలోని రాయ్‌బరేలీకి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. దీనితోపాటు రాయ్‌బరేలీ సీటు విషయంలో తన నిర్ణయం వెలిబుచ్చనున్నారని సమాచారం.గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతో అనుబంధం ఉంది. అందుకే రాయ్‌బరేలీ ఎంపీగా రాహుల్‌గాంధీ కొనసాగుతారనే వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. రాహుల్ రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అందులో ఆరుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 6.36 శాతం నుంచి 9.46 శాతానికి పెరిగింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్‌లలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి 66.17 శాతం ఓట్లు రాగా, 2019లో సోనియా గాంధీకి ఇదే సీటు నుంచి 55.80 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూశారు. అయితే ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహుతుడైన కిషోరి లాల్ శర్మ 54.99 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ రాయ్‌బరేలీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో రాహుల్ తాను రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతాననే సందేశాన్ని ఇస్తారని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.భూమా అతిథి గృహంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
సస్పెన్స్.. థ్రిల్
జయరామ్ తేజ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘హింట్’. చందూ బిజుగ దర్శకత్వంలో మైత్రీరెడ్డి, రిజ్వాన్ అహ్మద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నవ్యాంద్ర ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎస్వీఎన్ రావు రిలీజ్ చేశారు. ‘హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది’’ అన్నారు చందూ. ‘‘టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న నాకు హీరోగా చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జయరామ్ తేజ. ‘‘సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తాం’’ అన్నారు మైత్రీ రెడ్డి. -
బిగ్ బీ చుట్టూ బిగుస్తున్న పనామా ఉచ్చు
న్యూఢిల్లీ: పనామా పేపర్స్ వ్యవహారంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. జాతీయ మీడియా తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం అమితాబ్ బచ్చన్ మరిన్ని సమస్యల్లో చిక్కుకున్నారు. పనామా పత్రాల తాజా జాబితా ప్రకారం ఆయన నాలుగు విదేశీ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించినట్టు తెలుస్తోంది. 1993 -97 మధ్య కాలంలో విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన బిగ్ బీ ఆయా కంపెనీల్లో కీలక పాత్ర పోషించారంటూ మరిన్ని ఆధారాలను బయటపెట్టింది. ట్రాంప్ షిప్పింగ్ లిమిటెడ్, సీ బల్క్ షిప్పింగ్ కంపెనీల బోర్డు సమావేశాల్లో అమితాబ్ బచ్చన్ పాల్గొన్నట్లు తెలిపింది.1994లో ఆయా కంపెనీలతో అమితాబ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొంది. దీంతోపాటు రెండు కంపెనీలు జారీ చేసిన సర్టిఫికెట్లో డైరెక్టర్ల జాబితాలో అమితాబ్ పేరు కూడా ఉందని వెల్లడించింది. ఆ రెండు కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆఫీస్ బేరర్ పేర్లలో అమితాబ్ పేరును అధికారికంగా పేర్కొన్నారని చెప్పింది. మరోవైపు మొదట వచ్చిన ఆరోపణలను ఖండించిన బిగ్ బి తాజా పత్రాల్లో తన పేరు వెల్లడైన అంశంపై స్పందించారు. ఆఫ్‌షోర్ బోర్డు సమావేశాల్లో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలకు అమితాబ్ సమాధానం ఇచ్చారు. పది రోజుల క్రితమే ఆ అంశంపై ప్రభుత్వం తనకు నోటీసు ఇచ్చిందని, ప్రభుత్వం అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఒకవేళ ప్రభుత్వం ఇంకా ఏదైనా సమాచారం కావాలనుకుంటే తాను సహకరించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెడుతున్న 500 మంది భారత నల్లకుబేరుల జాబితాలో అమితాబ్ పేరు ప్రముఖంగా నిలిచింది. 1993 నుంచి 1997 వరకు ఆర్బీఐ నియమావళికి వ్యతిరేకంగా అమితాబ్ విదేశాల్లో సొమ్మ దాచుకున్నట్లు గతంలో పనామా పత్రాల ద్వారా వెల్లడైన విషయం తెలిసిందే.